Malavika Mohanan About Chiranjeevi Bobby Project : మెగాస్టార్ చిరంజీవి, 'వాల్తేరు వీరయ్య' ఫేం బాబీ దర్శకత్వంలో ఓ పవర్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ రాబోతోన్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గానే ఈ మూవీ కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేయగా భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచే పలు రూమర్స్ హల్చల్ చేస్తూనే ఉన్నాయి. ఈ మూవీలో హీరోయిన్‌గా 'ది రాజా సాబ్' బ్యూటీ మాళవిక మోహనన్ నటించనున్నారనే ప్రచారం సాగింది. తాజాగా దీనిపై ఆమె రియాక్ట్ అయ్యారు. 

Continues below advertisement

అది నిజం కాదు

తాను ఈ మూవీలో హీరోయిన్ అనేది నిజం కాదని మాళవిక తెలిపారు. 'డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో రాబోతోన్న మెగా 158లో నేను యాక్ట్ చేయనున్నట్లు సోషల్ మీడియాలో వచ్చే వార్తలు అవాస్తవం. నా కెరీర్‌లో ఒక్కసారైనా చిరంజీవి గారి లాంటి అగ్ర హీరోతో నటించాలని కోరుకుంటున్నా. ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నా. కానీ, ఈ ప్రాజెక్టులో నేను భాగం కాదు. ఆ రూమర్స్‌లో ఎలాంటి నిజం లేదు.' అని క్లారిటీ ఇస్తూ ట్వీట్ చేశారు. 

Continues below advertisement

Also Read : 'బాహుబలి' బిహైండ్ ద స్టోరీ - ప్రభాస్, రానా, రాజమౌళి సరదా ముచ్చట్లు... ఫుల్ ఇంటర్వ్యూ చూశారా?

హీరోయిన్ ఎవరు?

తాను నటించడం లేదని మాళవిక క్లారిటీ ఇచ్చేయడంతో ఇప్పుడు ఈ మూవీలో హీరోయిన్ ఎవరు? అనేది చర్చనీయాంశంగా మారింది. మెగాస్టార్ చిరు సరసన హీరోయిన్‌గా డైరెక్టర్ బాబీ ఎవరిని సెలక్ట్ చేస్తారా? అని సస్పెన్స్ నెలకొంది. త్వరలోనే దీనిపై మూవీ టీం క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది.

చిరు, బాబీ కాంబోలో వచ్చిన 'వాల్తేరు వీరయ్య' బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అందుకుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్టుపైనా అంతే స్థాయిలో హైప్ ఉంది. గొడ్డలి వేటుతో రక్తపు ధార కిందకు వచ్చినట్లుగా పోస్టర్ ఉండగా... ఇప్పటివరకూ చూడని ఓ డిఫరెంట్ మాస్ ఎంటర్టైనర్‌ను అందించబోతున్నట్లు అర్థమవుతోంది. బెంగాల్ నేపథ్యంలో కథ సాగనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ, లోహిత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తుండగా... త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ప్రస్తుతం చిరు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'మన శంకర వరప్రసాద్ గారు' వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. అలాగే, వశిష్ట మల్లిడి దర్శకత్వంలో 'విశ్వంభర' 2026, మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత బాబీ, శ్రీకాంత్ ఓదెల మూవీస్ లైనప్‌లో ఉన్నాయి.