Venu Udugula's Raju Weds Rambai To Release On 21st November : రీసెంట్‌గా వచ్చిన యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ 'లిటిల్ హార్ట్స్' బాక్సాఫీస్ వద్ద బిగ్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. యంగ్ హీరో మౌళి తనూజ్, శివానీ నాగారం జంటగా నటించిన ఈ మూవీకి సాయి మార్తాండ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని ముందు సిరీస్‌గా ఈటీవీ విన్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా రిలీజ్ చేయాలని భావించారు. అయితే, ఆ తర్వాత మూవీగా రూపొందించి థియేటర్స్‌లోకి రిలీజ్ చేసి బిగ్ సక్సెస్ అందుకున్నారు. తాజాగా సేమ్ స్ట్రాటజీనే మరో కొత్త మూవీకి ఫాలో అవుతున్నారు.
విలేజ్ లవ్ స్టోరీ 'రాజు వెడ్స్ రాంబాయి'
'నీది నాదీ ఒకే కథ', 'విరాట పర్వం' మూవీస్‌తో మంచి ఫేమ్ సంపాదించుకున్నారు డైరెక్టర్ వేణు ఊడుగుల. ఆయన నిర్మాతగా మారిన ఫస్ట్ మూవీ 'రాజు వెడ్స్ రాంబాయి'. ఆయన ప్రొడక్షన్ హౌస్‌లో రాహుల్ మోపిదేవి, ఈటీవీ విన్‌లతో కలిసి మూవీని నిర్మిస్తున్నారు. సాయిలు కంపాటిని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అఖిల్, తేజస్వి రావ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.
నవంబర్ 21న మూవీ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మూవీ టీం వెల్లడించింది. 'అన్నీ అడ్డంకులను ధిక్కరించే గొప్ప ప్రేమకథను సెలబ్రేట్ చేసుకోండి.' అంటూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. తెలంగాణలోని వరంగల్, ఖమ్మం జిల్లాల సరిహద్దు గ్రామాల్లో జరిగిన రియల్ సంఘటనల ఆధారంగా మూవీని రూపొందించినట్లు అర్థమవుతోంది. మూవీని దోలముఖి సబాల్టర్న్ ఫిల్మ్స్, మాన్సూన్స్ టేల్స్ బ్యానర్లపై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మిస్తున్నారు. ఈటీవీ విన్ ద్వారా థియేటర్లలోకి రిలీజ్ కానుండగా... 'లిటిల్ హార్ట్స్' మూవీ తరహాలోనే ఈ సినిమా కూడా బిగ్ సక్సెస్ అందుకుంటుందని టీం భావిస్తోంది.
Also Read : ఎవరీ జాన్వీ స్వరూప్? ఘట్టమనేని కుటుంబం నుంచి మరో కథానాయిక... మహేష్ మేనకోడలు గురించి తెలుసుకోండి