Baahubali The Epic Prabhas Rana Rajamouli Special Interview : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, రానా ప్రధాన పాత్రల్లో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి 1', 'బాహుబలి 2' రెండూ కలిపి ఒకే మూవీ 'బాహుబలి : ది ఎపిక్'గా రానున్న సంగతి తెలిసిందే. ఈ నెల 31న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా మూవీ టీం డిఫరెంట్‌గా ప్రమోషన్స్ ప్లాన్ చేసింది. తాజాగా... ప్రభాస్, రానా, రాజమౌళి కలిసి ఓ ఇంటర్వ్యూలో మెరిశారు.
'బాహుబలి' బిహైండ్ ద స్టోరీ
'బాహుబలి' మూవీ షూటింగ్ టైంలో ఎదురైన అనుభవాలు, సెట్స్ ఎక్స్‌పీరియన్స్, యుద్ధ సన్నివేశాలు అన్నింటినీ ఓసారి గుర్తు చేసుకున్నారు రాజమౌళి, ప్రభాస్, రానా. మూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. ఓ బొమ్మను పట్టుకున్న రానా... ప్రభాస్‌తో 'బావ.. ఇది నేనే కదా భళ్లాల దేవుడిని. ఎంత పవర్ ఫుల్‌గా ఉన్నానో కదా' అని అనగా... అది నేను 'బాహుబలి'ని అంటూ ప్రభాస్ అంటాడు. అదే నీ బాడీకి నా ఫోటో పెట్టారు అంటూ నవ్వులు పూయించాడు రానా. ఇదే టైంలో రాజమౌళి వీరి మధ్య ఎంటరై అప్పటి షూటింగ్ టైంలో విశేషాలను ఒక్కొక్కటి గుర్తు చేసుకుని సందడి చేశారు. తాజాగా కట్ చేసిన ట్రైలర్స్‌ను జక్కన్న వారికి చూపించారు.
ఆ పార్ట్ వెరీ డిఫకల్ట్
ఫస్ట్ పార్ట్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్ కంటే ఇంటర్వెల్ టైంలో భళ్లాలదేవుని విగ్రహాన్ని ప్రతిష్టించే సీన్ చాలా డిఫకల్ట్ అని రాజమౌళి తెలిపారు. ఈ షూటింగ్ టైంలో భారీ క్రేన్స్ తెచ్చి వాడారని... ఒకానొక దశలో గూస్ బంప్స్ వచ్చాయంటూ ప్రభాస్, రానా చెప్పారు. సెకండాఫ్‌లో క్లాత్‌తో యుద్ధం సీన్ కంటే ఇది చాలా కష్టమైందని రాజమౌళి చెప్పారు. కాళకేయులతో యుద్ధం సీన్ కనీసం బ్రేక్ లేకుండా 70 రోజులు షూట్ చేశామని అన్నారు.
Also Read : అప్పుడు 'లిటిల్ హార్ట్స్'... ఇప్పుడు 'రాజు వెడ్స్ రాంబాయి' - సేమ్ స్ట్రాటజీ... మరో హిట్ కన్ఫర్మేనా?
తెలుగు సినిమా స్థాయిని ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన మూవీ బాహుబలి. ఈ మూవీతోనే ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా మారారు. ఈ సినిమా రిలీజై పదేళ్లు పూర్తైన సందర్భంగా రెండు పార్టులను కలిపి 'బాహుబలి : ది ఎపిక్'గా 3 గంటల 44 నిమిషాల రన్ టైంతో ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. మూవీలో ప్రభాస్, రానాలతో పాటు అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్‌పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ మూవీని నిర్మించారు.