Actress Jayalalitha about Casting Couch: కొందరు నటీమణులు హీరోయిన్స్‌గా తమ కెరీర్లను ప్రారంభించినా.. అనుకున్న సక్సెస్ దక్కకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సెటిల్ అయిపోతారు. అందులో జయలలిత కూడా ఒకరు. హీరోయిన్‌గా పలు చిత్రాల్లో నటించినా కూడా తర్వాత తనకు బ్యాక్ టు బ్యాక్ బోల్డ్ క్యారెక్టర్లే వచ్చాయి. దాని వల్ల తను పర్సనల్ లైఫ్‌లో కూడా కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చిందని ఓపెన్‌గా చెప్పేశారు జయలలిత. అంతే కాకుండా క్యాస్టింగ్ కౌచ్ గురించి, దాని వల్ల తను పడిన ఇబ్బందుల గురించి కూడా మాట్లాడారు. అవకాశాల కోసం క్యాస్టింగ్ కౌచ్ వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను చెప్పకుండా దాచేస్తున్న ఈ రోజుల్లో జయలలిత బోల్డ్‌నెస్‌ను ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు.


కమల్ హాసన్ రికమెండ్ చేశారు..


మలయాళంలో హీరోయిన్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన జయలలిత.. స్టేట్ అవార్డును కూడా అందుకున్నారు. అలా తన కెరీర్‌లో అనుకోకుండా బోల్డ్ క్యారెక్టర్ల వైపు ఎలా షిఫ్ట్ అయ్యారో తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో బయటపెట్టారు. ‘‘ఒక మలయాళ దర్శకుడు వచ్చి కమల్ హాసన్ పక్కన గ్లామర్ రోల్ అన్నారు. ముగ్గురు హీరోయిన్లు.. శోభన, గీత, నువ్వు అని చెప్పారు. మొదట్లోనే కమల్ హాసన్ పక్కన అని గ్రేట్‌గా ఫీల్ అయ్యి ఓకే అని ఒప్పేసుకున్నాను. తీరాచూస్తే అందులో విలన్ భార్యగా బోల్డ్ క్యారెక్టర్‌గా చేయాల్సి వచ్చింది. దాని తర్వాత ఇంద్రుడు చంద్రుడులో సెక్రటరీగా ఎవరు బాగుంటారు అని డిస్కషన్ వచ్చినప్పుడు కమల్ హాసన్ నన్ను రికమెండ్ చేశారు. అలా వరుసగా అలాంటి క్యారెక్టర్లు కంటిన్యూ అయిపోయింది’’ అంటూ హీరోయిన్ నుండి బోల్డ్ పాత్రల వైపు తన ప్రయాణం గురించి మాట్లాడారు జయలలిత.


అలా అపోహ పడ్డారు..


సినీ పరిశ్రమలో తను ఎదుర్కున్న పరిస్థితుల గురించి బోల్డ్‌గా మాట్లాడారు జయలలిత. ‘‘పరిస్థితులకు అనుగుణంగా వెళ్లాను. దానివల్ల నేను పెద్దగా ఇబ్బందులు ఏమీ ఎదుర్కోలేదు. ఫ్రెండ్లీగా గడిచిపోయేది. ఒక పెద్ద ఆర్టిస్ట్ అయితే నువ్వు తలుపు తీస్తావా లేదా నేను ఇక్కడ ఉరి వేసుకొని చచ్చిపోనా అని అడిగాడు. బంధం లాంటిది ఏం లేదు. బాగుండేదాన్ని. యంగ్ ఏజ్‌లో ఉన్నాను. మంచి పర్సనాలిటీ ఉంది, బోల్డ్ క్యారెక్టర్లు చేస్తున్నాను కాబట్టి పర్సనల్‌గా కూడా అదే అయ్యిండొచ్చు అని అపోహ. కొన్ని తప్పించుకున్నాను, కొన్ని తప్పించుకోలేకపోయాను. తప్పలేదు. ఒకసారి డైరెక్టర్‌ను రిజెక్ట్ చేశానని నా క్యారెక్టర్ కట్ చేసి పంపించేశారు’’ అని తను కాంప్రమైజ్ అయిన పరిస్థితుల గురించి తెలిపారు.


నావాళ్లు బాగుండాలి..


‘‘ఒకసారి పోయినా వందసార్లు పోయినా అదంతే. నావాళ్లు బాగుండాలి అన్నది మాత్రమే లక్ష్యం. నేను చెడిపోతే చెడిపోయాను. నా వాళ్లు బాగుండాలి అనుకున్నాను. ఇండస్ట్రీలో వాళ్లు చేసేదాంట్లో పైశాచికత్వం ఉండదు, గౌరవం ఉండదు. రెండూ ఉండవు. నాతో ఎవరూ అంత దారుణంగా ప్రవర్తించలేదు. ఒప్పుకొని వెళ్లాము, వాళ్ల అవసరం అయిపోయింది వచ్చేశాం అన్నంతవరకే ఉండాలి. తర్వాత అందరూ బాగానే ఉండేవాళ్లు. అంతా కాసేపటి వరకే. మాకు వేధింపులు ఏమీ లేవు కానీ తప్పలేదు. తెలుగు ఇండస్ట్రీలో కూడా నన్ను హక్కున చేర్చుకోలేదు, ఛీ కొట్టలేదు’’ అంటూ ఇన్నాళ్లకు తన మంచి మనసే తనకు ఇండస్ట్రీలో ఉండడానికి కారణమని చెప్పుకొచ్చారు జయలలిత.


Also Read: శరత్ బాబుతో కలిసి ఒక బిడ్డని కందామనుకున్నాను, కానీ.. - నటి జయలలిత కామెంట్స్ వైరల్