Actress Jayalalitha About Her Life: అలనాటి నటి జయలలిత. బోరింగ్ పాప అంటే బాగా గుర్తుపడతారు ఆమెని. పాత సినిమాల్లో ఎన్నో వ్యాంప్ క్యారెక్టర్లు చేసిన ఆమె అద్భుతమైన డ్యాన్సర్ కూడా. ఇక ఇప్పుడు సినిమాలు మానేసిన ఆమె సెకెండ్ ఇన్నింగ్స్ లో సీరియల్స్ లో నటించారు. సీరియల్స్ కూడా మానేశానని, భగవంతుడి సేవలో నిమగ్నమై ఉన్నానని చెప్తున్నారు జయలలిత. గుమ్మడి గారు తన మధ్య ఉన్న అనుబంధం గురించి ఆమె ఇంటర్వ్యూలో ఇలా చెప్పుకొచ్చారు.
తండ్రి లాంటి వాడు..
చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు అలనాటి నటి జయలలిత. ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన సినీ కెరీర్ గురించి, ఫ్యామిలీ గురించి ఎన్నో విషయాలు చెప్పారు. శరత్ బాబు తనకు మధ్య సంబంధం గురించి ఈ మధ్య ఆమె చెప్పిన విషయాలు వైరల్ అయ్యాయి కూడా. ఇక గుమ్మడి గారితో అనుబంధం చెప్పారు ఆమె. వయసు, తారతమ్యం లేకుండా, ఆమెకి.. గుమ్మడి గారికి సంబంధం అంటగట్టారని చెప్పి బాధపడ్డారు. గుమ్మడి తనకు తండ్రి లాంటి వారని చెప్పారు. రోజు పొద్దున్న లేచి నాకు ఫోన్ చేసి, ఇవాళ ఏం వండుతున్నావు? అని అడిగేవారు.
"సినిమాలు మానేసి మా బతుకు మేం బతుకుతున్నాం. ఏం చేస్తున్నావు.. వంట ఏం తెస్తున్నావు? అనేవారు. తల్లిదండ్రులు లేరు. వాళ్లనే తల్లిదండ్రులు అనుకునేవాళ్లం. వాళ్లతో కలిసి తినడం, తాగడం, పేకాట ఆడటం అదృష్టంగా భావించేదాన్ని. నా కోసం సులా అని ప్రత్యేకంగా వైన్ బాటిల్ తెప్పించేవారు. నేను పరిచయం అయిన తర్వాత ఆయన క్లబ్ కి వెళ్లటం మానేశారు. ఇంకెందుకు క్లబ్‌కు వెళ్లడం అనేవారు. అంత అభిమానంగా నాలుగైదేళ్లు జర్నీ చేశాం. ఇప్పటికీ ఆయన ఇంటి వైపు వెళ్తే ఏడుపు వస్తుంది. కొడుకు యూఎస్ లో ఉండేవాడు. ఆడపిల్లలు మాత్రమే చూసేందుకు వచ్చేవారు. చివర్లో ఆయన పక్కన ఉన్నది నేను. హాస్పిటల్ లో జాయిన్ చేసింది నేను. చనిపోయేటప్పుడు గుండెల మీద పడుకోబెట్టుకున్నాడు. ఫస్ట్ పోయిన విషయం తెలిసింది నాకే. నీకు చాలా లోటు గుమ్మడి గారు పోవడం అని అక్కినేని గారు అన్నారు. వాళ్లంతా గొప్పవాళ్లు. ఆత్మీయత ఆయన అంటే. ఆ టైం మళ్లీ తిరిగిరాదు. అంటూ ఎమోషనల్ అయ్యారు జయలలిత.
దేవుడు దగ్గర అవుతున్నాడు
"నా వాళ్లు దూరం అవుతున్నారంటే దేవుడు దగ్గర అవుతున్నాడు అని అర్థం. ‘ప్రేమ ఎంత మధురం’లో బ్యాడ్ ఇన్సిడెంట్ అయ్యింది. హృదయానికి గాయమై మానేశాను. ఒక యాక్టరస్.. కొత్తగా వచ్చి మర్యాద లేకుండా చేసింది. చాలా అడ్జస్ట్ అయ్యాను. ఆ అమ్మాయి బిహేవియర్ పీక్స్‌కు వెళ్లిపోయింది. ఇక చేయలేను అని చెప్పాను. సరే మీ ఇష్టం అని చెప్పి పంపించేశారు. ఇంక ఆ తర్వాత చేయాలని అనిపించలేదు. సినిమాల్లో ఛాన్సులు వస్తాయో రావో తెలీదు. కానీ, కొంత డబ్బు మాత్రం దాచుకున్నాను. ఆ తర్వాత అంతా భగవంతుడి దయ" అని తన కెరీర్ గురించి చెప్పారు జయలలిత.
Also Read: సింగర్ మంగ్లీతో గొడవపై స్పందించిన రాహుల్ సిప్లిగంజ్ - పెళ్లికి పిల్లనిస్తలే!