Ester Noronha Sensational Comments on Ex Husband Noel Sean: నటి ఎస్త‌ర్ నోరోన్హా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈమే ఈ మధ్య బోల్డ్‌ కంటెంట్‌, బోల్డ్‌ రోల్స్‌తో వార్తల్లో నిలుస్తుంది. కన్నడలో పలు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న ఎస్తర్‌ కమెడియన్‌ సునీల్‌ భీమవరం బుల్లోడు సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. ఈ  మూవీ మంచి విజయం సాధించింది. కానీ హీరోయిన్‌గా ఎస్తర్‌కు మాత్రం పెద్దగా గుర్తింపు రాలేదు. దాంతో సినిమాల్లో సహానటి పాత్రలతో మెప్పించింది. అలా జయ జానకి నాయిక, గరం,69 సంస్కార్‌ కాలనీ,డెవిల్,టనెంట్‌ వంటి చిత్రాల్లో సహానటి పాత్రల్లో అలరిచింది.


తెలుగులోనే కాదు తమిళం, మారాఠీ, కొంకణి, హిందీ భాష చిత్రాల్లోనూ నటించిన ఎస్తర్‌ సింగర్‌ నోయల్‌తో ప్రేమలో పడింది.  కొంతకాలం సీక్రెట్‌ డేటింగ్‌ అనంతరం 2019లో పెళ్లి ఇరుకుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరి వివాహ బంధం ఎంతోకాలం నిలవలేదు. పెళ్లయిన ఏడాదికే వీరు విడాకులు తీసుకున్నారు. అయితే వీరి విడాకులకు అసలు కారణం ఏంటనేది మాత్రం ఇద్దరు కూడా ఎప్పుడు వెల్లడించలేదు. కానీ ఎప్పుడు ఒకరిపై ఒకరు పరోక్షంగా ఆరోపణలు చేసుకుంటూనే వస్తున్నారు. నోయల్‌ బిగ్‌బాస్‌లో తన పెళ్లి, విడాకుల అంశాన్ని లెవనేత్తి ఎమోషల్‌ అయ్యేవాడు. తనని తన మాజీ భార్య ఎస్తర్‌ మోసం చేసిందా? అనేట్టుగా నోయల్‌ కామెంట్స్‌ ఉండేవి. దీంతో ఆమెపై నెగిటివిటీ పెరిగింది.


యాసిడ్ పోస్తానని బెదిరించారు


ఇక తాజాగా ఓ ఇంటర్య్వూలో ఎస్తర్‌ నోయల్‌పై సంచనల వ్యాఖ్యలు చేసింది. "2019లో మా పెళ్లయ్యింది. అయితే పెళ్లయిన 16 రోజులకే నోయల్‌ నిజస్వరూపం తెలిసింది. అప్పటి నుంచి అతడికి దూరంగానే ఉన్నాను. చివరికి అతడితో విడిపోవాలని నిర్ణయించుకున్నా. 2020లో మాకు విడాకులు వచ్చాయి. అయితే ఈ విషయంపై నేను ఎప్పుడు బయటక చెప్పాలి అని అనుకోలేదు. కానీ నోయల్‌ మాత్రం బిగ్‌బాస్‌లో మా విడాకుల అంశాన్ని తన సింపతీ కోసం వాడుకున్నాడు. నాపై చెడుగా ప్రచారం చేస్తూ వచ్చాడు. దాంతో అందరూ నాదే తప్పు అనుకున్నారు. దీంతో నన్ను బయటక చాలా దారుణంగా ట్రోల్‌ చేశారు. నాపై విమర్శలు చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు కూడా వచ్చాయి. ఒక వ్యక్తి అయితే ఏకంగా నేను హైదరాబాద్ వస్తే నాపై యాసిడ్‌ పోసి చంపేస్తానంటూ బెదిరించాడు కూడా. అప్పుడు నాకు నోయల్‌ని చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది. మనుషులు ఇలా కూడా ఉంటారా?" అని ఆవేదన వ్యక్తం చేసింది.  


మళ్లీ పెళ్లి చేసుకుంటా?


అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్న తను మళ్లీ చేసుకుంటానంది. ప్రస్తుతం తనకు ఒంటరిగా బతకాలని లేదు. అందమైన జీవితం గడపాలని ఉంది. అందుకు తగిన భాగస్వామి కోసం మా ఇంట్లో వాళ్లు చూస్తున్నారు. మంచి వ్యక్తి దొరికితే తప్పకుండ మళ్లీ పెళ్లి చేసుకుంటా. అయితే, ఎలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలో నాకు క్లారిటీ లేదు. నేను ఇప్పటికి ఒక వివాహం చేసుకుని ఫెయిల్‌ అయ్యాను. అందులో చాలా సమస్యలు ఎదుర్కొన్నాను. షోకేష్‌ లాంటి భర్త కంటే అర్థం చేసుకునే వ్యక్తి దొరికితే సంతోషం" అంటూ చెప్పుకొచ్చింది. 


Also Read: Upasana: లావణ్య త్రిపాఠి చేసిన పనికి ఉపాసన 'అత్తమ్మాస్‌ కిచెన్‌'పై విమర్శలు! - వివరణ ఇచ్చిన టీం