Actress Arundhathi Nair: ప్రముఖ నటి, కోలివుడ్‌ హీరోయిన్‌ అరుంధత నాయర్‌ విషమ పరిస్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మూడు రోజుల క్రితం ఆమె రోడ్డు ప్రమదానికి గురయ్యారు, ఈ ఘటనలో అరుంధతి తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. వెంటిలేటర్‌పై ఉన్న ఆమె వైద్యంగా కోసం ఆర్థికి సాయం కోరుతూ ఆమె స్నేహితులు ఒకరు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ షేర్‌ చేశారు. అరుంధతి నాయర్‌ విజయ్‌ ఆంటోని సైతాన్‌ మూవీతో తమిళ్‌, తెలుగులో మంచి గుర్తింపు పొందారు. కాగా రీసెంట్‌గా అరుంధతి నాయర్‌ ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇంటర్వ్యూ  ఇచ్చారు.


ఇంటర్య్వూ అనంతరం ఆమె తిరిగి తన సోదరుడితో కలిసి స్కూటీపై ఇంటికి వెళ్తుండగా తిరువనంతపురం కోవలం సమీపంలో ఓ కారు వేగంగా వచ్చి వారి స్కూటీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఇద్దరిని హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. అరుంధతి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అరుంధతి ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం విషమ పరిస్థితిలో చికిత్స పొందుతున్న ఆమెకు వైద్యం అందించడానికి ఆర్ధిక సాయం చేయాలంటూ టీవీ సీరియల్ నటి గోపిక అనిల్ సోషల్ మీడియా వేదికగా అభ్యర్ధిస్తున్నారు.


Also Read: సింపుల్‌గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్‌ స్టార్‌ సింగర్‌ హారిక నారాయణ్‌ - సింగర్‌ రేవంత్‌ సందడి చూశారా?


ఆర్థిక సాయం కోసం ఎదురుచూపులు


‘నా స్నేహితురాలు అరుంధతి నాయర్‌ నిన్న ప్రమాదానికి గురయ్యారు. ప్రస్తుతం తన పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అరుంధతి వెంటిలేటర్‌పై ప్రాణాలతో పోరాడుతోంది. అయితే రోజువారీ ఆసుపత్రి ఖర్చులు భరించే ఆర్ధిక స్థోమత తన కుటుంబానికి లేదు. మేము మా వంతు కృషి చేస్తున్నాం. కానీ ఆమె చికిత్సకు ఇది సరిపోదు. కావునా, ఆమె మీ వంతు చేయూత ఇచ్చి తన మెరుగైన చికిత్సకు ఇది ఉపయోగపడుతుంది’ అంటూ బ్యాంకు ఖాతా, ఫోన్‌ నంబర్‌ వివరాలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. 






కాగా నటి అరుంధతీ నాయర్‌ కోలీవుడ్‌లో పలు చిత్రాలు చేసి నటిగా మంచి గుర్తింపు పొందారు. 'పొంగి ఎలు మనోహర'మూవీ సినీరంగ ప్రవేశం చేసింది.ఆ తర్వాత 'విరుమాండికుమ్‌ శివానందికమ్‌', విజయ్‌ ఆంటోని 'సైతాన్‌', 'పిస్తా', 'ఆయిరం పోర్కాసుకల్‌' చిత్రాల్లో హీరోయిన్‌గా నటించారు. ఆ వెంటనే 2018లో విడుదలైన ‘ఒట్టకోరు కముకన్‌’తో అనే సినిమాతో మలయాళ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అయితే విజయ్‌ ఆంటోని సరసన నటించిన సైతాన్‌ మువీతోనే అరుంధతి నాయర్‌కు ఒక్కసారిగా పాపులారిటీ సంపాదించుకున్నారు. చివరిగా ఆమె పోర్కాసుకల్‌ అనే మువీలో నటించారు. గతేడాది విడుదలైన ఈ చిత్రం మంచి తమిళంలో మంచి విజయం సాధించింది.