Anupama Parameswaran Strong Reply To Reporter : సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన 'DJ టిల్లు' సినిమాకి సీక్వెల్ గా 'టిల్లు స్క్వేర్' మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని మూవీ లవర్స్ ఎంతో క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు. 'DJ టిల్లు'లో నేహా శెట్టితో రొమాన్స్ చేసిన సిద్దు.. ఈసారి 'టిల్లు స్క్వేర్'లో అనుపమ పరమేశ్వరన్ తో నెక్స్ట్ లెవెల్ లో రొమాన్స్ చేయబోతున్నాడు. ఈ సినిమాలో అనుపమ ఓ రేంజ్ లో అందాలు ఆరబోసింది. ఎక్స్‌పోజింగ్‌ోపాటు లిప్ లాక్ సీన్స్ లో రెచ్చిపోయి మరీ నటించింది. తాజాగా ఈ సినిమా నుంచి 'ఓ మై లిల్లీ' అనే మూడో పాటని విడుదల చేయగా ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనుపమ బోల్ట్ క్యారెక్టర్ చేయడంపై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.


'టిల్లు స్క్వేర్'లో నాది చాలా మంచి క్యారెక్టర్


"ఒక యాక్టర్ గా నేను కంఫర్టబుల్‌గా చేసే క్యారెక్టర్స్ కొన్ని ఉన్నాయి. ఇన్ని ఇయర్స్ లో నేను చేసిన క్యారెక్టరే మళ్లీమళ్లీ చేస్తే ఎవరికైనా బోర్ వస్తుంది. కదా అదే నాకు వచ్చింది. టిల్లు స్క్వేర్ మూవీలో నాకు వచ్చిన క్యారెక్టర్‌ను వదులుకొని ఉంటే అంతకంటే మూర్ఖత్వమైన పని మరొకటి ఉండదు. ఒక కమర్షియల్ సినిమాలో అమ్మాయికి ఇంత మంచి క్యారెక్టర్ దొరకదు అని నేను చెప్తాను. సో అలాంటి ఓ మంచి క్యారెక్టర్ ని వదులుకోవాలని నేను అనుకోవట్లేదు. ఒక యాక్టర్ గా నాకు ఎన్ని లిమిటేషన్స్ ఉన్నా కూడా డైరెక్టర్ ఇచ్చిన పాత్రకు 100% చేయాలనేది నా డ్యూటీ. అది చేయడానికి నేను ట్రై చేశాను" అని చెప్పింది.


బిర్యానీ ఇష్టమని రోజు తినలేం కదా..!


బోల్డ్ క్యారెక్టర్ చేయడంపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు అనుపమా సమాధానమిస్తూ.. "మీకు బిర్యానీ అంటే ఇష్టమని ప్రతీ రోజూ ఇంట్లో బిర్యానీనే తినరు కదా..! అలాగే నేనూ ప్రతీ రోజు బిర్యానీ తినాలని కోరుకోవడం లేదు. నాకు డిఫరెంట్‍.. డిఫరెంట్ పులావ్ కావాలి.. పులిహోర కావాలి.. అంతే" అని తెలిపింది. దీంతో ఈ ముద్దుగుమ్మ చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.


నలుగురు మ్యూజిక్ డైరెక్టర్లు


'టిల్లు స్క్వేర్' చిత్రానికి ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్ పని చేస్తున్నారు. వారిలో రామ్ మిర్యాల, శ్రీ చరణ్ పాకాల, అచ్చు రాజమణి పాటలు కంపోజ్ చేశారు. అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కోసం మొదట తమన్ ని అనుకోగా కొన్ని అనివార్య కారణాలవల్ల తమన్ తప్పుకోవడంతో భీమ్స్ సిసిరోలియోకి ఆ బాధ్యతలను అప్పగించారు. తాజాగా విడుదలైన 'ఓ మై లిల్లీ' సాంగ్ ని అచ్చు రాజమణి కంపోజ్ చేయగా.. శ్రీరామచంద్ర ఆలపించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యున్ ఫోర్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా మార్చ్ 29న థియేటర్స్ లో సందడి చేయనుంది.


Also Read : మంచు లక్ష్మి కాళ్లు మొక్కిన అభిమాని - ‘ఆదిపర్వం’ ట్రైలర్ లాంచ్‌లో అనూహ్య ఘటన