Fan Touches Manchu Lakshmi Feet in Adiparvam Trailer Launch Event: మామూలుగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో స్టేజ్‌పై స్పీచ్ ఇస్తుంటే అభిమానులు వచ్చి వారి కాళ్లపై పడి ఎమోషనల్ అవుతుంటారు. అప్పుడప్పుడు హీరోయిన్లకు కూడా ఇలాంటి అనుభవాలే ఎదురవుతుంటాయి. తాజాగా ఆ లిస్ట్‌లోకి మంచు లక్ష్మి కూడా యాడ్ అయ్యారు. తన మూవీ ఈవెంట్‌లో లక్ష్మి మాట్లాడుతుండగా.. ఒక ఫ్యాన్ స్టేజ్‌పైకి తన కాళ్లు మొక్కి హడావిడి చేశాడు. అంతే కాకుండా తను వెళ్లిపోయేటప్పుడు ఆ అభిమానితో కలిసి ఫోటో దిగింది. ఆ సమయంలో కూడా ఆ వ్యక్తి చాలా ఎమోషనల్ అయిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


అభిమాని ఎమోషనల్..


ప్రస్తుతం మంచు లక్ష్మి ఎక్కువగా ఫోటోషూట్స్‌తోనే బిజీ అయిపోయింది. సినిమాల్లో కనిపించడం చాలా అరుదుగా మారిపోయింది. ప్రస్తుతం తను లీడ్ రోల్‌లో నటించిన ‘ఆదిపర్వం’ మూవీ రిలీజ్‌కు సిద్ధమయ్యింది. ఏప్రిల్‌లో ఈ సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తుండగా తాజాగా ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచారు మేకర్స్. అందులో భాగంగానే ఒక ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు. అందులో ఒక అభిమాని వచ్చి మంచు లక్ష్మి కాళ్లు మొక్కి ఎమోషనల్ అవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మామూలుగా హీరోలకు మాత్రమే ఇలా జరుగుతుంది. హీరోయిన్లకు జరగడం మాత్రం చాలా అరుదు. అలాంటిది ఎక్కువగా సినిమాల్లో యాక్టివ్‌గా ఉండని మంచు లక్ష్మికి ఇలా జరగడమేంటి అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.






సీరియల్స్ నుండి సినిమాల్లోకి..


‘ఆదిపర్వం’ విషయానికొస్తే.. చిన్న సినిమాలతో దర్శకుడిగా నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తున్న సంజీవ్ మెగోతి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. ఇప్పటివరకు సంజీవ్.. సినిమాలకు కంటే సీరియల్స్‌కే ఎక్కువగా పనిచేశారు. తెలుగు, కన్నడలో దాదాపు 50 సీరియల్స్‌కు పైగా స్టోరీ, స్క్రీన్‌ ప్లే అందించారు. దర్శకుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా సంజీవ్ సక్సెస్ సాధించారు. ఆయన సొంత నిర్మాణ సంస్థలోనే పలు సీరియల్స్‌ను ప్రొడ్యూస్ కూడా చేశారు. సుమ సుధీంద్ర ‘ఆదిపర్వం’కు మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్‌తో పలు పోస్టర్లు విడుదలయ్యాయి. ప్రతీ పోస్టర్‌లో మంచు లక్ష్మి ఒక డిఫరెంట్ లుక్‌తో కనిపిస్తున్నారు.


రెండేళ్ల తర్వాత..


కేవలం తెలుగులో మాత్రమే కాకుండా హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా ‘ఆదిపర్వం’ను విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. దాదాపు రెండేళ్ల తర్వాత వెండితెరపై ‘ఆదిపర్వం’తో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది మంచు లక్ష్మి. ఈ మూవీలో తను పవర్‌ఫుల్ రోల్ చేస్తుందని విడుదలయిన పోస్టర్స్ చూస్తుంటే అర్థమవుతోంది. ఇది రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఒక మిస్టరీ థ్రిల్లర్ అని మేకర్స్ ఇప్పటికే రివీల్ చేశారు. అలాగే సినిమాకు సంబంధించిన ప్రతీ పోస్టర్‌లో బ్యాక‌గ్రౌండ్‌లో ఒక గుడి కూడా కనిపిస్తోంది. ఇవన్నీ ప్రేక్షకుల్లో ‘ఆదిపర్వం’పై ఆసక్తి పెరిగేలా చేస్తున్నాయి.


Also Read: RRR రీ రిలీజ్, జపాన్‌లో రాజమౌళికి ఘన స్వాగతం - ఈ 83 ఏళ్ల బామ్మ చేసిన పనికి జక్కన్న ఫిదా