SS Rajamouli Post About 83 Years Old Japan Woman: దర్శక ధీరుడు, దిగ్గజ డైరెక్టర్‌ ఎస్‌ఎస్‌ రాజమౌళికి జపాన్‌లో ఘనస్వాగతం లభించింది. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ జపాన్‌ థియేటర్లో మళ్లీ స్క్రీనింగ్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జక్కన్న తన భార్య రమతో కలిసి జపాన్‌ వెకేషన్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి అభిమానులు రాజమౌళికి ఘనస్వాగతం పలికారు. జపాన్ సంప్రదాయం ఉట్టిపడేలా స్పెషల్ పోస్టర్స్‌ స్వగతం పలికి అభిమానం చాటుకున్నారు. ముఖ్యంగా 83 ఏళ్ల ఓ వృద్ధురాలు జక్కన్న కోసం స్వయంగా చేతులతో చేసిన ఈ స్పెషల్‌ పోస్టర్‌ ఆయనను బాగా ఆకట్టుకుంది.


రాజమౌళి ఎమోషనల్ పోస్ట్


ఈ మేరకు ఆయన ఈ ఫోటోలను, అభిమానితో దిగిన ఫోటోలను తన ఎక్స్‌ పోస్టర్‌ వేదికగా పంచుకున్నారు. ఈ సందర్భంగా జసనీయుల వీరాభిమానికి ఆయన ఉప్పొంగిపోయారు. ఈ మేరకు జక్కన్న పోస్ట్‌ చేస్తూ "జపాన్‌ ప్రజలు తమ ప్రియమైన వారు ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యం ఉండాలని కోరుకుంటూ ఓరిగామ్‌ క్రేన్‌లతో తయారు చేసిన బహుమతులను ఇవ్వడం వారి సంప్రదాయం. ఈ 83ఏళ్ల పెద్దావిడ 1000 ఓరిగామి క్రేన్‌లను ప్రత్యేకమైన కానుకతో మమ్మల్ని ఆశీర్వాదించారు. ఎందుకంటే ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ఆమెను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కానుకను మాకు అందించేందుకు రాత్రి చలిలో మా కోసం వెయిట్‌ చేశారు. ఇలాంటి అభిమానం, ప్రేమలు వెలకట్టలేనివి. కృతజ్ఞత చూపించడం తప్ప తిరిగి ఏం చెల్లించగలం" అంటూ జక్కన్న రాసుకొచ్చారు.






జపాన్ థియేటర్లో రాజమౌళి సందడి


ప్రస్తుతం ఆయన పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రాజమౌళి కోసం, ఒక తెలుగు సినిమాపై ఆమె పెంచుకున్న అభిమానం చూసి తెలుగు ప్రజలంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక రాజమౌళిపై ఈ బామ చూపించిన అభిమానం చూసి ఆయన ఫ్యాన్స్‌ అంతా ముచ్చటపడుతున్నారు. కాగా RRR జపనీస్ భాషలో విడుదలై ఏడాది పూర్తైన సందర్భంగా అక్కడి థియేటర్లలో ఈ మూవీ స్పెషల్ షో లను వేశారు. దీంతో జక్కన తన భార్య రమ, ఇతర కుటుంబసభ్యులతో కలిసి ఆయన జపాన్‌ వెళ్లారు. టోక్యోలో RRR స్పెషల్ షోలు వేస్తున్న థియేటర్లలో ఆయన కుటుంబంతో కలిసి సందడి చేశారు. ఈ సందర్భంగా ఈ మూవీ షూటింగ్‌ విశేషాలతో పాటు పలు ఆసక్తికర విషయాలను జపాన్‌ ఆడియన్స్‌తో పంచుకున్నారు. అంతేకాదు షూటింగ్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో తనకున్న ఫన్నీ ఎక్స్ పీరియన్సెను షేర్ చేసుకున్నారు.



అల్రెడీ విడుదలైన సినిమాను కూడా మళ్లీ థీయేటర్లో ఇంతగా ఆదిరిస్తున్న జపాన్‌ ప్రేక్షకులకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాలు తెలిపారు. 'ఆర్ఆర్ఆర్' సినిమాలో కొమురం భీం పాత్రలో మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామ రాజుగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటనకు భారతీయ ప్రేక్షకులతో పాటు అంతర్జాతీయ ప్రేక్షకులు సైతం సర్‌ప్రైజ్‌ అయయారు. ముఖ్యంలో ఈ సినిమాలోని 'నాటు నాటు...' పాటలో వేసిన స్టెప్పులు, కొరియోగ్రఫీకి హాలీవుడ్‌ దిగ్గజాలు సైతం ఫిదా అయ్యారు. ఇక ఈ మూవీ ఆస్కార్‌ గెలవడంతో నాటు నాటు క్రేజ్‌ ఇంటర్నేషనల్‌ వేదికలపై మారుమోగింది. ఇప్పటికీ ఈ పాటకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు స్టెప్పులేస్తుంటారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రాజమౌళి మహేష్‌ బాబు పాన్‌ వరల్డ్‌ చిత్రం SSMB29 సినిమాను తెరకెక్కించబోతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ను జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి రానున్నట్టు సమాచారం.