Actress Anjali Clarity About Her Marriage: హీరోయిన్లపై ఎప్పుడూ ఏదో ఒక రూమర్ నడుస్తూనే ఉంటుంది. వాళ్ల పెళ్లి అని, ప్రేమలో ఉన్నారని, లివిన్ లో ఉన్నారనే వార్త ఎక్కడో ఒక దగ్గర వైరల్ అవుతూనే ఉంది. ఇక ఇప్పుడు సినీనటి అంజలికి సంబంధించి ఒక రూమర్ కూడా వైరల్ అవుతోంది. అదే ఆమె పెళ్లికి సంబంధించిన వార్త. దీనిపై.. ఆమె క్లారిటీ ఇచ్చింది. 'గీతాంజలి మళ్లీ వచ్చింది' ట్రైలర్ ఈవెంట్ లో ఆమె తన పెళ్లి గురించి మాట్లాడారు. ఒక రిపోర్ట్ అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పారు.
నన్ను కూడా పిలవండి..
'గీతాంజలి మళ్లీ వచ్చింది' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్రబృందం.. రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. దాంట్లో భాగంగా.. ఒక రిపోర్టర్.. మీ పెళ్లికి సంబంధించి వార్తలు వస్తున్నాయి? పెళ్లి ఎప్పుడు అని అడగగా దానికి ఆమె ఫన్నీ రిప్లై ఇచ్చారు. దీనిపై శ్రీనివాస్ రెడ్డి కూడా స్పందించారు "పెళ్లి కార్డులు మీరే పంచాలి అంటూ".. కామెంట్ చేశారు. ఇక ఈ విషయంపై అంజలీ మాట్లాడుతూ.. "మీరు అడుగుతున్న ప్రశ్నకి నా కంటే ముందు మీ పక్కన వ్యక్తే నవ్వుతున్నారు. పెళ్లికి రావాల్సింది నేను కానీ, నాకే ఎవ్వరూ చెప్పలేదు. ఇప్పటికి నాకు నాలుగుసార్లు పెళ్లి చేశారు. ఇప్పుడు ఐదోసారి చేశారు. నేను కూడా రిసెంట్ గా విన్నాను. విన్నాను అంటే నిజం కాదని తెలుసు కదా? నాతో ఎవరో చెప్పారు.. నేను లివిన్‌లో ఉంటున్నానని విన్నా. నేను ఇంట్లో ఉండటం లేదు ఔట్ డోర్ లో ఉంటున్నా.. ఆ ఇంట్లో ఉంటున్నవాళ్లు ఎవరో.. వారితో రెంట్ కట్టిస్తే బాగుండు. నేను కూడా ఈఎంఐ కడుతున్నాను. ఇక పెళ్లి మాత్రం కచ్చితంగా చేసుకుంటాను. మీకు చెప్పి చేసుకుంటాను" అంటూ పెళ్లిపై క్లారిటీ ఇచ్చారు అంజలి.
ఆకట్టుకుంటున్న ట్రైలర్..
తెలుగు బ్యూటీ అంజలి మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆమె ప్రధాన పాత్రలో ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ అనే సినిమా చేస్తోంది. 2014లో కామెడీ, హారర్ జానర్ లో వచ్చిన ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమాకు సీక్వెల్ రాబోతోంది. గీతాంజలి మళ్లీ వచ్చింది అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇది అంజలి కెరీర్ లో 50వ చిత్రం. ఇక ఈ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి సత్యం రాజేష్, సత్య, షకలక శంకర్, అలీ, బ్రహ్మాజీ, రవి శంకర్, రాహుల్ మాధవ్ సహా పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎంవీవీ సినిమాస్ బ్యానర్ తో కలిసి కోన ఫిలిం కార్పొరేషన్ బ్యానర్‌పై కోన వెంకట్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ట్రైలర్ కూడా ఎంతగానో ఆకట్టుకుంటోంది. మంచి టాక్ వచ్చింది ఇక సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి.
Also Read: Vijay Devarakonda: విజయ్ దేవరకొండది బలుపా - పొగరా? కాన్ఫిడెన్సా?