'బీస్ట్' (Beast Movie)... ఇప్పుడు 'బీస్ట్' పేరు చెబితే తమిళ కథానాయకుడు విజయ్ గుర్తుకు రావడం సహజం. 'బీస్ట్' టైటిల్‌తో ఆయన నటించిన సినిమా ఏప్రిల్ 13న...  అనగా బుధవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా హీరోయిన్ పూజా హెగ్డే, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్, సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస, ఇతర యూనిట్ సభ్యులతో కలిసి ప్రచార కార్యక్రమాలకు విజయ్ వెళ్లారు. అందరూ కలిసి కారులో వీడియోలు తీసుకున్నారు. ఇప్పుడు అవి వైరల్ అయ్యాయి. ఆ వీడియోస్ ఏంటో మీరూ చూడండి.


ఆడి, బీఎండబ్ల్యూ, రోల్స్ రాయిస్... ఇలా విజయ్ దగ్గర ఖరీదైన కార్లు ఐదారు ఉన్నాయి. అందులో రోల్స్ రాయిస్ 'ఘోస్ట్' ఒకటి. సుమారు తొమ్మిది కోట్ల రూపాయల విలువ చేసే ఆ కారులో విజయ్ 'బీస్ట్' ప్రమోషన్స్‌కు వెళ్లారు. ఆయన స్వయంగా కార్ డ్రైవ్ చేయడం విశేషం. 'ఘోస్ట్'లో 'బీస్ట్' ప్రమోషన్స్  అన్నమాట. ఇప్పుడు ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. అవి మీరూ చూడండి. 


Also Read: రాముడిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సందడి చేసి పాతికేళ్ళు - హీరోగా సిల్వర్ జూబ్లీ ఇయర్ పూర్తి