Actor Sriram Latest Interview : ఒకప్పటి టాలీవుడ్ హీరోలు ఇప్పుడు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తూనే మరోవైపు డిజిటల్ ఎంట్రీ ఇస్తూ వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీ అయిపోతున్నారు. అలాంటి వారిలో హీరో శ్రీరామ్ కూడా ఒకరు. అప్పట్లో తెలుగు, తమిళ భాషల్లో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీరామ్.. ఆ తర్వాత కొన్నాళ్లకు అవకాశాలు తగ్గడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి అగ్ర హీరోల సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం లీడ్ రోల్స్ లో కొన్ని సినిమాల్లో నటిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లు చేస్తున్నాడు. అలా ఇటీవల 'వళరి' సినిమాలో నటించాడు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీరామ్ తనకు ఫ్రీడమ్ ఫైటర్స్ బయోపిక్ లో నటించాలని ఉందంటూ మనసులో కోరికను బయటపెట్టాడు.
నేతాజీ, వీర్ సావర్కర్ బయోపిక్స్ లో నటించాలని ఉంది
"నేను నేతాజీ గారికి అభిమానిని. ఆయన లైఫ్ గురించి ఇంకా చాలా మిస్టరీ ఉంది. ఆయన ఎయిర్ క్రాష్ లో చనిపోలేదని కొన్ని ఫైల్స్ కూడా చెబుతున్నాయి. ఆయన ఇంకా బతికున్నారని కూడా చెప్తుంటారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఎన్నో ఉన్నాయి. వీటిని తీసుకొని ఇంకా ఇంట్రెస్టింగ్ గా చెప్పేలా నేతాజీ గారి బయోపిక్ చేయాలని ఉంది. ఆయనతో పాటూ వీర్ సావర్కర్ గారంటే కూడా నాకు ఇష్టం. వీళ్ళ లైఫ్ కి రేలేటెడ్ గా ఉన్న పాయింట్స్ తో సినిమా చేయాలని ఉంది" అని అన్నాడు
తెలుగు వాళ్ళు ఆయన బయోపిక్ పై ఎందుకు ఫోకస్ చేయడం లేదు?
పొట్టి శ్రీరాములు గారి బయోపిక్ తీయడాన్ని నేను ఇప్పటివరకు చూడలేదు. తెలుగు వాళ్ళు ఆయన బయోపిక్ పై ఎందుకు ఫోకస్ పెట్టలేదని అనిపించింది. ఆయన తెలుగువారి స్వాతంత్య్రం కోసం ఎంతో పోరాటం చేశారు. అది ఈ రోజు ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు. అలాంటి ఆయన బయోపిక్ పై ఇప్పటివరకు ఎందుకు ఫోకస్ చేయలేదు" అని పేర్కొన్నారు.
చాలామందికి నేతాజీ హిస్టరీ గురించి ప్రాపర్ గా తెలియదు
హిస్టరీ అనేది ఒక ఛాలెంజ్ లాంటిది. నేతాజీ హిస్టరీ గురించి ప్రాపర్ గా తెలిసిన వాళ్ళు లేరు. సో వాళ్లు చెప్పింది నిజమా కాదా అనేది మనకు తెలియదు. మన ఫ్రీడమ్ కోసం పోరాడిన వారిలో నేతాజీ గారు ఒక పిల్లర్ లాంటి వారు. గాంధీ గారి తర్వాత ఆయనే. కాకపోతే ఈయన అహింస వాది. ఆయన హింసావాది. నువ్వు నాకు బ్లడ్ ఇస్తే నేను నీకు ఫ్రీడమ్ ఇస్తా అని ఆయన హింసను బిలీవ్ చేశారు. దారులు వేరు కావచ్చు కానీ పోరాడింది మాత్రం ఫ్రీడమ్ కోసమే. నేను నేతాజీ గారికి బిగ్ ఫ్యాన్ ని. మనకు దొరికిన ఫ్రీడమ్ ని మనమే మిస్ యూస్ చేసుకున్నామని నాకు కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. కొన్ని దేశాలు మన గవర్నెన్స్ నుంచే నేర్చుకున్నారు. అలాంటిది మనం ఇంకెంతో నేర్చుకోవాలి" అంటూ చెప్పుకొచ్చాడు.
Also Read : అదంతా టైమ్ వేస్ట్ అనిపిస్తుంది, బాగా కొట్టారు - ‘హనుమాన్’ మూవీపై శ్రీ విష్ణు కామెం