Dandora Movie: మంగపతి శివాజీ ప్రధాన పాత్రలో 'దండోరా' మూవీ - మళ్లీ డ్యూటీ ఎక్కేశారుగా..

Dandora Movie: ప్రముఖ నటుడు శివాజీ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న మూవీ 'దండోరా'. ఈ సినిమా షూటింగ్ సెకండ్ షెడ్యూల్ తాజాగా ప్రారంభం కాగా శివాజీ అందులో భాగమయ్యారు.

Continues below advertisement

Actor Sivaji Being Part Of Dandora Movie Shooting: రీసెంట్ బ్లాక్ బస్టర్ 'కోర్ట్' మూవీలో మంగపతిగా తన నటనతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు నటుడు శివాజీ. ఆయన నటనకు ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యూత్ సైతం ఫిదా అయిపోయారు. టాలీవుడ్‌కు మరో విలన్ దొరికేశారంటూ కామెంట్స్ చేశారు.

Continues below advertisement

'దండోరా' షూటింగ్‌లో శివాజీ

శివాజీ (Sivaji) ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'దండోరా' (Dandora). మురళీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి కాగా.. మూవీ టీం తాజాగా సెకండ్ షెడ్యూల్ ప్రారంభించింది. ఈ సినిమా షూటింగ్‌లో శివాజీ పాల్గొంటున్నారు. 90స్, కోర్ట్ వంటి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను అలరించిన ఆయన.. ఇప్పుడు 'దండోరా'లోనూ కీలక పాత్రలో కనిపించనున్నారు.

నేషనల్ అవార్డు మూవీ 'కలర్ ఫోటో', బ్లాక్ బస్టర్ ‘బెదురులంక 2012’ చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్పానేని 'దండోరా' మూవీని రూపొందిస్తున్నారు. మురళీకాంత్ దర్శకత్వం వహిస్తుండగా.. శివాజీతో పాటు నవదీప్, నందు, రవికృష్ణ, మణిక, అనూష, రాధ్య తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ఫస్ట్ బీట్ వీడియోకు సూపర్ రెస్పాన్స్

రీసెంట్‌గా విడుదలైన 'దండోరా' ఫస్ట్ బీట్ వీడియోకు ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సమాజంలో కుల వివక్ష, అగ్ర వర్ణాలకు చెందిన అమ్మాయిలని ప్రేమించి పెళ్లి చేసుకున్నా, వారికి ఎదురు తిరిగినా ఎలాంటి దౌర్జన్యకాండ జరుగుతున్నాయనేది ప్రధానాంశంగా తీసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తెలంగాణ గ్రామీణ నేప‌థ్యంలో మ‌న పురాత‌న ఆచారాలు, సాంప్ర‌దాయాల‌ను ఆవిష్క‌రిస్తూనే వ్యంగ్యం, కామెడీ, హృద‌యాన్ని హ‌త్తుకునే భావోద్వేగాల క‌ల‌యిక‌గా ఈ సినిమాను ఆవిష్కరిస్తున్నారు. 

ఈ సినిమాకు ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు మార్క్ కె.రాబిన్ మ్యూజిక్ అందిస్తున్నారు. వెంక‌ట్ ఆర్‌.శాఖ‌మూరి సినిమాటోగ్ర‌ఫీ కాగా గ్యారీ బి.హెచ్ ఎడిటింగ్‌, క్రాంతి ప్రియ‌మ్ ఆర్ట్ డైరెక్ట‌ర్‌, రేఖ బొగ్గారపు కాస్ట్యూమ్ డిజైన‌ర్‌, ఎడ్వ‌ర్డ్ స్టీవ్‌స‌న్ పెరెజీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌, అనీష్ మ‌రిశెట్టి కో ప్రొడ్యూస‌ర్‌గా బాధ్య‌త‌ల‌ు నిర్వ‌హిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ మూవీకి సంబంధించి మ‌రిన్ని వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని మేక‌ర్స్ తెలియ‌జేశారు. 

Also Read: ఈ వారమే ఓటీటీలోకి రూ.50 కోట్లు సాధించిన 'కోర్ట్' మూవీ - ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?

Continues below advertisement