నటుడు సంపత్ రాజ్ (Sampath Raj)కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగులో స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని పేరు తెచ్చుకున్న అతి కొద్ది మందిలో ఆయన ఒకరు. సంపత్ రాజ్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్! ఆయన సోషల్ మీడియాలో అడుగు పెట్టారు.


ఇన్‌స్టాలో సంపత్ రాజ్... ఎందుకంటే?
సంపత్ రాజ్ పేరు చెబితే తెలుగు ప్రేక్షకులకు ముందుగా ప్రభాస్ 'మిర్చి' సినిమా గుర్తుకు వస్తుంది. అందులో నటనకు గాను విలన్ కేటగిరీలో నంది అవార్డు కూడా అందుకున్నారు. 'మిర్చి'కి ముందు 'పంజా', 'దమ్ము' సినిమాల్లోనూ నటించారు. ఆ 'మిర్చి' తర్వాత 'రన్ రాజా రన్', 'లౌక్యం', 'సన్నాఫ్ సత్యమూర్తి', 'శ్రీమంతుడు', 'రారండోయ్ వేడుక చూద్దాం', 'భీష్మ' తదితర సినిమాలు చేశారు. 


ఇన్నాళ్ళూ లేనిది ఇప్పుడు సోషల్ మీడియాలో సంపత్ రాజ్ ఎందుకు అడుగు పెట్టారు? అంటే... 'వ్యవస్థ' వెబ్ సిరీస్ కోసం! ఈ నెల 28 నుంచి 'జీ 5' ఓటీటీలో ఆ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. అందులో లాయర్ చక్రవర్తి పాత్రలో సంపత్ రాజ్ నటించారు. తెలుగులో ఆయన నటించిన తొలి వెబ్ సిరీస్ ఇది. దీని కంటే ముందు తమిళంలో 'అనంతం' అని ఓ వెబ్ సిరీస్ చేశారు. అదీ 'జీ 5'లో అందుబాటులో ఉంది.


Also Read : 'గబ్బర్ సింగ్'కు 'ఉస్తాద్' పవన్ కళ్యాణ్ గిఫ్ట్ - హరీష్ శంకర్ ప్లానింగ్ మామూలుగా లేదుగా
 





ఇది ఆనంద్ రంగా న్యాయ 'వ్యవస్థ'
'వ్యవస్థ' వెబ్ సిరీస్ (Vyavastha On Zee5)కి 'ఓయ్' ఫేమ్ ఆనంద్ రంగా దర్శకత్వం వహించారు. ఇందులో హెబ్బా పటేల్ (Hebah Patel), కార్తీక్ రత్నం (Karthik Rathnam), సంపత్ రాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. జీ 5 ఓటీటీ కోసం ఎక్స్‌క్లూజివ్‌గా రూపొందిన సిరీస్ ఇది. 


Also Read  వైఎస్ జగన్ కథను తప్పకుండా చెబుతా - దర్శకుడు మహి వి రాఘవ్


మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మితా కొణిదెల, అల్లుడు విష్ణు ప్రసాద్ నిర్మించిన 'షూట్ అవుట్ ఎట్ ఆలేరు' వెబ్ సిరీస్ తర్వాత 'జీ 5' కోసం ఆనంద్ రంగా తీసిన సిరీస్ ఇది. ఆల్రెడీ విడుదలైన ట్రైలర్, ప్రోమోలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. 


తెలుగులో కామ్నా జెఠ్మలానీ రీ ఎంట్రీ
గోపీచంద్ 'రణం' సినిమాలో కథానాయికగా నటించిన కామ్నా జెఠ్మలానీ (Kamna Jethmalani) గుర్తు ఉన్నారా? ఆ సినిమా తర్వాత 'అల్లరి' నరేష్ 'బెండు అప్పారావు', 'కత్తి కాంతారావు', 'యాక్షన్ త్రీడీ' తదితర సినిమాలు చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు 'సైనికుడు'లో స్పెషల్ సాంగ్ కూడా చేశారు. పెళ్లి తర్వాత, పిల్లలకు జన్మ ఇచ్చాక... యాక్టింగుకు బ్రేక్ ఇచ్చారు. ఇప్పుడీ 'వ్యవస్థ'తో తెలుగులో ఆమె రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో ఆమె కీలక పాత్ర చేశారు. సంపత్ రాజ్ ఇన్స్టాలో అడుగు పెట్టిన సందర్భంగా ఆయనకు కామ్నా జెఠ్మలానీ వెల్కమ్ చెప్పారు. 'వ్యవస్థ'లో వీళ్ళిద్దరూ జంటగా నటించినట్లు తెలుస్తోంది. జీ 5 ఓటీటీలో ఈ వారమే 'వ్యవస్థ' వెబ్ సిరీస్ సందడి చేయనుంది. ఏప్రిల్ 28వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుందని ఓటీటీ వర్గాలు వెల్లడించాయి. క్రైమ్ నేపథ్యంలో రూపొందిన కోర్ట్ రూమ్ డ్రామా కావడంతో జనాలు ఈ సిరీస్ మీద ఆసక్తి చూపిస్తున్నారు.