మహేష్ బాబు దర్శకత్వంలో ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni) ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. మహేష్ అంటే హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు కాదు... దర్శకుడు మహేష్! ఆ సినిమా మరో రెండు రోజుల్లో పూజతో ప్రారంభం కానుంది. ఆ వివరాల్లోకి వెళితే...
గురువారం పూజతో రామ్ 22వ సినిమా మొదలు!
దేవసేన అనుష్క శెట్టి, యువ కథానాయకుడు నవీన్ పోలిశెట్టి జంటగా నటించిన సినిమా 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'. ఆ చిత్రానికి మహేష్ బాబు పచ్చిగోళ్ళ దర్శకత్వం వహించారు. గత ఏడాది సెప్టెంబర్ 7న థియేటర్లలో విడుదల అయ్యింది. మంచి విజయం అందుకుంది.
'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' విజయం తర్వాత రామ్ పోతినేనితో సినిమా చేసేందుకు మహేష్ బాబు పి కథ రెడీ చేసుకున్నారు. హీరోగా రామ్ పోతినేని 22వ సినిమా ఇది. అందుకని, RAPO 22 అంటున్నారు. ఈ సినిమాను ఈ గురువారం (నవంబర్ 21వ తేదీన) పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించనున్నట్టు నిర్మాణ సంస్థ ఈ రోజు అనౌన్స్ చేసింది. సైకిల్ తీసుకుని నడుస్తున్న హీరోను వెనుక నుంచి తీసిన ఫోటో షేర్ చేశారు.
Also Read: ఓపెనింగ్స్ కోటి రాలేదు కానీ ఓటీటీ రైట్స్ అన్ని కోట్లా - వరుణ్ తేజ్ నిర్మాతలకు ఇదొక్కటీ ప్లస్!
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ర్యాపో 22
రామ్ పోతినేని, మహేష్ బాబు పి కలయికలో రూపొందుతున్న ఈ సినిమాను అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తోంది. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ప్రొడ్యూసర్లు. 'డబుల్ ఇస్మార్ట్' సినిమా తర్వాత రామ్ చేస్తున్న సినిమా ఇది. సినిమా ప్రారంభోత్సవం రోజు ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
Also Read: బాయ్‌ఫ్రెండ్‌తో కీర్తి సురేష్ పెళ్లి... ముహూర్తం ఖరారు, గోవాలో ఏడు అడుగులు వేసేది ఎప్పుడంటే?