టాలీవుడ్ నటుడు, దర్శకుడు అయిన రాహుల్ రవీంద్రన్ తాజాగా భారత జావెలియన్ త్రోయర్ ఒలింపియన్ నీరజ్ చోప్రా తో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశారు. ఇదే విషయాన్ని తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు పోస్ట్ చేశారు. ఈ ఫోటోలో రాహుల్ రవీంద్రన్ తో పాటు 'బేబీ' హీరో ఆనంద్ దేవరకొండ కూడా ఉండడం విశేషం. 'అందాల రాక్షసి' సినిమాతో హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్న రాహుల్ రవీంద్రన్ ఆ తర్వాత నటుడిగా పలు సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. ఈ మధ్యకాలంలో అగ్ర హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను మెప్పించారు.


హీరో గానే కాకుండా దర్శకుడిగా మారి మొదటి సినిమాతోనే జాతీయ అవార్డు అందుకున్నారు. ప్రముఖ సింగర్ చిన్మయి భర్త ఆయన రాహుల్ రవీంద్రన్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటాడు. మన స్టార్ హీరోయిన్ సమంతకి బెస్ట్ ఫ్రెండ్స్ లో ఈయన కూడా ఒకరు. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ పెట్టి అభిమానులతో టచ్ లో ఉండే రాహుల్ రవీంద్రన్ తాజాగా తన ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు. ఈ పోస్టులో భారత జావెలియన్ త్రోయర్, ఒలింపియన్ నీరజ్ చోప్రా తో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేసినట్లు పేర్కొన్నారు." నాకు తెలిసిన వారు ఎవరైనా లేదా ట్విట్టర్లో నన్ను అనుసరించే ఎవరికైనా దీని అర్థం తెలుస్తుంది. ఓ ఛాంపియన్ తో ఈ అల్పాహారం ఎప్పటికీ మర్చిపోలేను" అంటూ తన ట్విట్టర్లో పేర్కొంటూ అందుకు సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు.






ఈ ఫోటోలో రాహుల్ రవీంద్రన్, నీరజ్ చోప్రా తో పాటు టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ కూడా ఉండడం విశేషం. ప్రస్తుతం రాహుల్ రవీంద్రన్ చేసిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే చైనా వేదికగా ఇటీవల జరిగిన ఆసియా క్రీడల్లో నీరజ్ చోప్రా పసిడి పథకం సాధించిన విషయం తెలిసిందే. ఈటెను నీరజ్ ఏకంగా 88.88 మీటర్ల దూరం విసిరి పసిడి పతకాన్ని గెలుచుకున్నాడు. ఇదే ఈవెంట్లో భారత్ కు చెందిన మరో జావేలియన్ త్రోయర్ కిషోర్ కుమార్ జెనా రజత పతకాన్ని అందుకోవడం విశేషం. తన నాలుగో ప్రయత్నంలో కిషోర్ కుమార్ ఈటెను 87.54 మీటర్ల దూరం విసిరి రెండవ స్థానంలో నిలిచి రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు.


ఇక రాహుల్ రవీంద్రన్ విషయానికి వస్తే.. సుశాంత్ హీరోగా నటించిన 'చి ల సౌ సినిమాతో దర్శకుడిగా మారిన ఈయన మొదటి సినిమాతోనే నేషనల్ అవార్డు అందుకున్నారు… ప్రస్తుతం రష్మిక మందనతో ఓ భారీ లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొదట ఈ లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ ను సమంతతో చేయాలని అనుకున్నా కొన్ని అనివార్య కారణాలవల్ల ఆమె స్థానంలో రష్మిక మందన ఈ ప్రాజెక్టులో భాగమైనట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ రీసెంట్ గా 'బేబీ'  భారీ సక్సెస్ అందుకున్నాడు. ప్రస్తుతం 'గం గం గణేశా' అనే క్రైమ్ కామెడీ బ్యాక్ డ్రాప్ మూవీలో నటిస్తున్నాడు. రీసెంట్ గానే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.


Also Read : రిలీజైన రెండు వారాలకే OTTకి వచ్చేస్తున్న మూవీ.. డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఇదే



Join Us on Telegram: https://t.me/abpdesamofficial