టాలీవుడ్ ఇండస్ట్రీలో మరోసారి డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపింది. హైదరాబాద్ డ్రగ్స్ కేసులో ఇప్పటికే ముగ్గురు నైజీరియాన్ లతో పాటు ఒక సినీ నిర్మాత, ఒక మాజీ ఎంపీ కుమారుడు సైతం అరెస్ట్ అయినట్లు తెలుస్తోంది. గుడిమల్కాపూర్ పోలీసులతో కలిసి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో జరిపిన ఆపరేషన్ లో భాగంగా వీళ్లంతా పట్టుబడ్డారు. ఈ వ్యవహారానికి సంబంధించి హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సిపి ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ ‘‘సినీ హీరో నవదీప్ పబ్‌కు కూడా ఈ డ్రగ్స్ వ్యవహారంతో సంబంధం ఉందని, అతను కూడా డ్రగ్స్ తీసుకున్నాడు’’ అని అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు.


ఇదే విషయం మీద కమిషనర్ సీపీ ఆనంద్ మాట్లాడుతూ.. "ప్రస్తుతానికి నవదీప్ కానీ అతని కుటుంబం కాని అందుబాటులో లేదని, ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసుకుని కుటుంబంతో సహా పరారయ్యారు’’ అని తెలిపారు. ఈ విషయంపై హీరో నవదీప్ తన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ మేరకు నవదీప్ ట్వీట్ చేస్తూ.. "అది  నేను కాదు జెంటిల్మెన్, నేను ్కడే ఉన్నాను. దయచేసి క్లారిటీ తెచ్చుకోండి, థాంక్స్" అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఆ తర్వాత నవదీప్ మీడియాతో మాట్లాడుతూ.. తాను ఎక్కడికి పారిపోలేదని, హైదరాబాదులోని ఉన్నానని, డ్రగ్స్ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపాడు. తాను కూడా ప్రెస్ మీట్ చూశానని కమిషనర్ హీరో నవదీప్ అని ఎక్కడా మెన్షన్ చేయలేదని, అతను వేరే నవదీప్ అయి ఉంటాడని పేర్కొన్నాడు.






నవదీప్ ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ లో సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇటీవల నవదీప్ లీడ్ రోల్ లో నటించిన 'న్యూసెన్స్' అనే వెబ్ సిరీస్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. హీరోయిన్ బిందు మాధవి ఈ వెబ్ సిరీస్ లో మరో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ వెబ్ సిరీస్ ఆహా ఓటీటీలో ప్రసారమైంది. త్వరలోనే  సీజన్ 2 కూడా రాబోతోంది.


ఈ వెబ్ సిరీస్ తో పాటు 'లవ్ మౌళి' అనే సినిమాలో నటిస్తున్నారు నవదీప్. ఈ సినిమాలో నవదీప్ మేకోవర్ చూసి అందరూ షాక్ అయ్యారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది  అవనీంద్ర అనే నూతన దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ని వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 15 స్టార్ట్ చేయబోతున్నారు. ఈ మేరకు ఆ రోజు సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే 'The Anthem Of Love Mouli' అనే పేరుతో సాంగ్  ప్రోమోని విడుదల చేశారు. గోవింద్ వసంత కంపోజ్ చేసిన ఈ పాటకి అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు .


Also Read : 'జవాన్' డైరెక్టర్ అట్లీ నన్ను మోసం చేశాడు: ప్రియమణి





Join Us on Telegram: https://t.me/abpdesamofficial