Actor Nara Rohith Reaction On His Political Entry : టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ తన పొలిటికల్ ఎంట్రీపై స్పందించారు. తన తండ్రి నారా రామ్మూర్తి నాయుడు 74వ జయంతిని పురస్కరించుకుని ఆయన స్వగ్రామం తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలో ఘనంగా నిర్వహించారు. నారా రామ్మూర్తి నాయుడు స్మృతివనంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రోహిత్ సహా ఫ్యామిలీ మెంబర్స్ హాజరై నివాళి అర్పించారు.
పొలిటికల్ ఎంట్రీపై...
ప్రజలు తమ తండ్రి జ్ఞాపకాలను తమతో పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు రోహిత్. అభిమానులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీపై ప్రశ్న ఎదురవగా... టైం వచ్చినప్పుడు తప్పకుండా ఎంట్రీ ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో భవిష్యత్తులో ఆయన పొలిటికల్ ఎంట్రీ ఉండే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎలక్షన్స్ టైంలో ఆయన కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు.
Also Read : విశ్వనాథ్ అండ్ సన్స్ ఓటీటీ డీల్ - సూర్య డైరెక్ట్ తెలుగు మూవీ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
'బాణం' మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నారా రోహిత్... సోలో, స్వామి రారా, ప్రతినిధి, రౌడీ ఫెలో, అసుర, అప్పట్లో ఒకడుండేవాడు, నీది నాదీ ఒకే కథ, ప్రతినిధి 2, భైరవం మూవీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గతేడాది సుందరకాండ మూవీతో మంచి హిట్ అందుకున్నారు. లాస్ట్ ఇయరే శిరీషను రోహిత్ ప్రేమ వివాహం చేసుకున్నారు.
