Actor Nanda Kishore About Rumours On Him: యాక్ట‌ర్ నంద కిశోర్..చి.ల‌.సౌ. స్ర‌వంతి సీరియ‌ల్ తో బుల్లితెర‌కు ప‌రిచ‌యం అయిన ఈయ‌న ఆ త‌ర్వాత ఎన్నో సీరియ‌ల్స్ చేసి ఫేమ‌స్ అయ్యారు. ఎంతోమంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్నారు. కేవ‌లం యాక్టింగ్ తో మాత్ర‌మే కాదు క్రికెట్ ఆడి సినీ అభిమానుల మ‌న‌సు దోచుకున్నారు. సీసీఎల్ హీరో అయ్యాడు. ఇప్పుడిక త‌న కెరీర్ గురించి, త‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి ఎన్నో విష‌యాలను ఇంట‌ర్వ్యూలో పంచుకున్నారు. ఏమ‌న్నారంటే? 


ఫిట్ నెస్ గురించి? 


వాలీ బాల్ ప్లేయ‌ర్ ని అందుకే ఫిట్ నెస్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండేది. స్పోర్ట్స్ కాబ‌ట్టి ఫిట్ నెస్ కూడా మెయింటెయిన్ చేయ‌గ‌లుగుతున్న‌. ఫిట్ నెస్ అనేది యాక్ట‌ర్ కి చాలా ముఖ్యం. యాక్ట‌ర్ కి మాత్ర‌మే కాదు అంద‌రికీ ఇంపార్టెంట్. సినీమా ఫీల్డ్ వాళ్లు ఎక్కువ‌గా ఇంట్రెస్ట్ చూపిస్తారు. చూపించాలి కూడా. 


వెన్నుపోట్లు ఎదుర్కొన్నారా?  


వెన్నుపోట్లు అని చెప్ప‌ను. అంత అవ‌కాశం ఇవ్వ‌ను ఎవ్వరికీ. కానీ కొన్ని స్వ‌యంకృత అప‌రాథాలు చేశాను. కెరీర్ పీక్స్ లో  ఉన్న‌ప్పుడు మంచి రోల్స్ ఉన్న‌ప్పుడు చాలా ఛాన్సులు వ‌దిలేసుకున్నాను. హీరోగా అయితే కాదు. వేరే చాలా క్యారెక్ట‌ర్లు వ‌దులుకున్నాను. ఆ త‌ర్వాత చాలా ఫీల్ అయ్యాను. 


ఇన్ స్పిరేష‌న్ అంటే ఎవ‌రి పేరుచెప్తారు? 


యాక్ట‌ర్ గా అయితే మెగాస్టార్ ని ఇన్ స్పిరేష‌న్ గా తీసుకున్నాను. ఆ త‌ర్వాత రియ‌ల్ లైఫ్ లో ప్ర‌తి సంద‌ర్భంలో ఒక గురువు ఉన్నారు. అమ్మ ఎప్ప‌టికీ ఒక స్ఫూర్తి. నా బ్ర‌ద‌ర్స్ నాకు చాలా స‌పోర్ట్ చేస్తారు. నా భార్య చాలా స‌పోర్టివ్. ఫ్రెండ్స్ కూడా చాలా మంచివాళ్లు స‌పోర్టివ్ ఉన్నారు. బిగెస్ట్ ఇన్ స్పిరేష‌న్ అంటే దేవుడు నాకు. ఇక ఆ త‌ర్వాత విక్ట‌రీవెంక‌టేశ్ గారు కూడా పెద్ద ఇన్ స్పిరేష‌న్. అంద‌రికీ పాజిటివ్ స‌పోర్ట్ ఇస్తారు. నాకు చాలా మోర‌ల్ స‌పోర్ట్ ఇచ్చారు. సీసీఎల్ ఆడిన‌ప్పుడు, క్రికెట్ ఆడిన‌ప్పుడు బాగా ప‌రిచ‌యం. ఏదైనా హెల్ప్ కావాల‌న్నా సార్ నే అడుగుతాను. ఆ స్థాయిలో ఉన్న వ్య‌క్తి మ‌న‌కు హెల్ప్ చేయాల‌ని లేదు క‌దా? ఎప్ప‌టికీ ఆయ‌న‌కి రుణ‌ప‌డి ఉంటాను. ఆయ‌న ఎప్ప‌టికీ హ్యాపీగా ఉండాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటాను.


బ్యాటింగ్ కి ఫ్యాన్స్ ఉన్నారు క‌దా?  


నేను ఆల్ రౌండ‌ర్ ని అండి. భువ‌నేశ్వ‌ర్ లో జ‌రిగిన మ్యాచ్ నేను గెలిపించాను. అది అలా క‌లిసొచ్చింది. నిజానికి బ్యాట్స్ మెన్ గా అంటే బౌల‌ర్ గా న‌న్ను గుర్తిస్తారు చాలామంది. ఎప్పుడైనా అవ‌కాశం వ‌స్తే ప్రూవ్ చేసుకుంటాను. అలాంటి రెండు సంద‌ర్భాలు వ‌చ్చాయి. దాని వ‌ల్ల అంద‌రూ నా బ్యాటింగ్ కోసం వెయిట్ చేస్తుంటారు. టీమ్ వాళ్లందిర‌కీ నాపైన‌ మంచి ఇంప్ర‌ష‌న్ ఉంది. 


బాధ‌ప‌డిన సంద‌ర్భాలు ఏవైనా ఉన్నాయా?


ప‌ర్స‌న‌ల్ లైఫ్ అంటే 2010లో మా నాన్న చ‌నిపోవ‌డం. ఆ టైంలో స్ర‌వంతి సీరియ‌ల్ అయిపోనొచ్చింది. నాకు బెస్ట్ యాక్ట‌ర్ అవార్డు వ‌చ్చింది. నేను స‌క్సెస్ అయ్యాను అని చెప్ప‌డానికి ఆయ‌న లేడు. అది చాలా పెయిన్ ఫుల్ గా అనిపించింది. చెన్నైలో ఛాన్స్ కోసం వెళ్లిన‌ప్పుడు నిర్ల‌క్ష్యంగా మాట్లాడిన‌ప్పుడు బాధ అనిపించింది. ఆ త‌ర్వాత ఇది మాములే అనుకున్నాను. ఇక రూమ‌ర్స్ విష‌యానికొస్తే ఇండ‌స్ట్రీలో ఉన్న‌ప్పుడు రూమ‌ర్స్ కామ‌న్. అప్ప‌టికీ నాకు పెళ్లైపోయింది, మీనా కుమారికి పెళ్లైపోయింది. సీరియ‌ల్ లో యాక్ట్ చేసేస‌రికి క‌పుల్ అనుకున్నారు అంతే. అని త‌న గురించి కొన్ని విష‌యాలు అలా పంచుకున్నారు యాక్ట‌ర్ నంద కిశోర్. 


Also Read: పవన్ కళ్యాణ్‌కి వదినమ్మ ప్రత్యేకమైన బహుమతి - చిరంజీవి ఎమోషనల్‌ పోస్ట్‌, ఆకట్టుకుంటున్న వీడియో