Dhanush Wayanad Landslide: వయనాడ్ బాధితులకు ధనుష్ సాయం - కేరళలో సహాయక చర్యలకు పాతిక లక్షలు ఇస్తున్న కుబేర హీరో

Dhanush: కేరళలోని వయనాడ్ బాధితులకు ఆర్థికంగా సాయం చేయడం కోసం పలు సినీ సెలబ్రిటీలు ముందుకొచ్చారు. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ ధనుష్ కూడా అందులో యాడ్ అయ్యాడు.

Continues below advertisement

 Dhanush Donation To Wayanad: కేరళలోని వయనాడ్‌లో వరదలు సృష్టించిన భీభత్సం నుండి అక్కడి ప్రజలు ఇంకా కోలుకోలేదు. అందుకే సినీ సెలబ్రిటీలు సైతం అక్కడి ప్రజలకు ఆర్థికంగా సాయం చేయడానికి ముందుకొస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది సౌత్ సెలబ్రిటీలు వయనాడ్‌కు ఆర్థికంగా సాయం చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి మరో తమిళ హీరో కూడా యాడ్ అయ్యాడు. కోలీవుడ్ స్టార్ ధనుష్ కూడా తన తరపున వయనాడ్‌కు విరాళం అందిస్తున్నట్టుగా తెలిపారు. వయనాడ్‌లో ప్రజలకు సాయం చేయడం కోసం సినీ సెలబ్రిటీలు ముందుకు రావడం సంతోషకరం అని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Continues below advertisement

సాయంగా కోలీవుడ్..

కోలీవుడ్ స్టార్ ధనుష్ వయనాడ్ ప్రజలకు రూ. 25 లక్షలు విరాళమిస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటివరకు కోలీవుడ్ నుండి మరెందరో నటీనటులు కూడా వయనాడ్‌కు ఆర్థికంగా సాయం చేస్తున్నట్టుగా ప్రకటించారు. సూర్య, జ్యోతిక సైతం వయనాడ్ ప్రజలకు రూ. 50 లక్షలు విరాళం అందించారు. విక్రమ్ కూడా రూ. 20 లక్షలు విరాళమిస్తున్నట్టుగా తెలిపారు. నయనతార, తన భర్త విఘ్నేష్ శివన్ కలిసి తమ ప్రొడక్షన్ హౌజ్ రౌడీ పిక్చర్స్ ద్వారా రూ. 20 లక్షలు విరాళమిస్తున్నట్టు ప్రకటన విడుదల చేశారు. మాలీవుడ్ తరపున కూడా వయనాడ్ ప్రజలకు ఆర్థిక సాయం అందింది. ముఖ్యంగా తమ రాష్ట్రంలో ఇలాంటి విపత్తు జరిగినందుకు బాధగా ఉందంటూ మాలీవుడ్ స్టార్లు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు.

‘రాయన్’తో బిజీ..

ఇక ధనుష్ విషయానికొస్తే.. ఇప్పటి వరకు తన ‘రాయన్’ మూవీ ప్రమోషన్స్‌లో, రిలీజ్‌లో బిజీగా ఉన్నారు. తన కెరీర్‌లో 50వ చిత్రంగా తెరకెక్కిన ‘రాయన్’లో తను హీరోగా నటించడం మాత్రమే కాకుండా దానికి తానే దర్శకత్వం వహించి మెప్పించారు. ఈ సినిమా రొటీన్ స్టోరీతో తెరకెక్కినా కూడా ప్రేక్షకులను మెప్పించే ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయంటూ పాజిటివ్ టాక్‌ను అందుకుంది. ముఖ్యంగా ఇందులో ధనుష్ నటన చాలా బాగుందంటూ మరోసారి తన యాక్టింగ్‌కు ఫిదా అయిపోయారు ఆడియన్స్. ఇందులో ధనుష్‌తో పాటు సందీప్ కిషన్, కాలిదాస్ జయరామ్ లాంటి యంగ్ హీరోలు కూడా ఇతర ముఖ్య పాత్రల్లో మెప్పించారు.

అప్‌కమింగ్ మూవీస్..

ప్రస్తుతం ధనుష్.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేర’ అనే మూవీలో నటిస్తున్నారు. ఇందులో ధనుష్‌తో పాటు సీనియర్ హీరో నాగార్జున కూడా ఇతర ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ‘కుబేర’లో ధనుష్‌కు జోడీగా రష్మిక మందనా నటిస్తోంది. తెలుగుతో పాటు తమిళంలో విడుదల కానున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే ‘కుబేర’ నుండి ధనుష్, నాగార్జున క్యారెక్టర్లకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలయ్యాయి. అంతే కాకుండా రష్మిక మందనా క్యారెక్టర్ గ్లింప్స్ కూడా విడుదలయ్యింది. వీటితోనే సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేశారు మేకర్స్. దీంతో పాటు హిందీలో ‘తేరే ఇష్క్ మే’ మూవీతో బిజీగా ఉన్నారు ధనుష్.

Also Read: చిరు, చరణ్‌ల 'మెగా' మనసు - కేరళ బాధితులకు తండ్రీ కుమారుల విరాళం కోటి... బాసూ, నువ్వు గ్రేట్!

Continues below advertisement