తాజాగా 'బేబీ'(Baby) మూవీతో కెరియర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. 'బేబీ' తర్వాత ఆనంద్ నటించిన 'గంగం గణేశా' మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవలే ‘బేబీ' హీరోయిన్ వైష్ణవి చైతన్యతో మరో సినిమాని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు తాజాగా స్టూడియో గ్రీన్ బ్యానర్ లో ఓ భారీ బడ్జెట్ మూవీ చేస్తున్నాడు. గురువారం హైదరాబాదులో ఈ మూవీ ఘనంగా ప్రారంభమైంది. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై కేఈ జ్ఞానబెల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'డ్యూయెట్'(Duet) అనే టైటిల్ని ఖరారు చేశారు. అగ్ర దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన మిథున్ వరదరాజ కృష్ణ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మధుర శ్రీధర్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.


ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ సరసన 'అశోక వనంలో అర్జున కళ్యాణం' మూవీ ఫేమ్ రితిక నాయక్ హీరోయిన్ గా నటిస్తోంది. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ సినిమా ప్రారంభోత్సవం గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు హరీష్ శంకర్, చందు మొండేటి, సాయి రాజేష్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి హీరో, హీరోయిన్లపై దర్శకుడు హరీష్ శంకర్ క్లాప్ కొట్టగా.. సాయి రాజేష్జ్ జ్ఞానవేల్ రాజా, సహనిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి స్క్రిప్టును దర్శకుడు మిథున్ కి అందజేశారు. డైరెక్టర్ చందు మొండేటి ఫస్ట్ షార్ట్ డైరెక్ట్ చేయగా.. ఆనంద్ దేవరకొండ పేరెంట్స్ గోవర్ధన్ దేవరకొండ, మాధవి దేవరకొండ కెమెరా స్విచ్ ఆన్ చేస్తారు.


అనంతరం హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ.."డ్యూయెట్ నాకు ఒక స్పెషల్ మూవీ. ఈ సినిమా టైటిల్ ఇండస్ట్రీలోని ఫ్రెండ్స్ తో షేర్ చేసుకున్నప్పుడు మంచి టైటిల్, మేము రిజిస్టర్ చేసుకుంటే బాగుండేది అన్నారు. అక్కడి నుంచి డ్యూయెట్ పై పాజిటివ్ వైబ్స్ మొదలయ్యాయి. ఈ మూవీకి నన్ను సెలెక్ట్ చేసుకున్న నిర్మాతలు జ్ఞానవేల్ రాజా, మధుర శ్రీధర్ గారికి థాంక్స్. జ్ఞానవేల్ గారు తమిళంలో సూర్య, కార్తీ గారితో పెద్ద మూవీస్ చేశారు. ఇక్కడ నాతో మా అన్నయ్యతో అలాగే ప్రొడ్యూస్ చేయాలి. తెలుగులో బిగ్ మూవీస్ చేయబోతున్నారు జ్ఞానవేల్ రాజా. ఆ భారీ లైనప్ లోని మూవీస్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నా" అని తెలిపాడు.


"మా సినిమాకు జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ డైరెక్టర్ అనగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఆడుకాలం మూవీ నుంచి నేను ఆయనకు ఫ్యాన్. అశోక వనములో అర్జున కల్యాణం మూవీలో రితిక సూపర్బ్ గా నటించింది. ఈ సినిమాకు ఆమెకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. మిథున్ అమేజింగ్ స్టోరీ రాశాడు. మా టీం తో కలిసి ఒక మంచి మూవీ చేయబోతున్నాం" అని అన్నాడు. ఇక హీరోయిన్ రితిక నాయక్ మాట్లాడుతూ.. "డ్యూయెట్ కథ విన్నప్పుడు మెస్మరైజ్ అయ్యాను. ఎప్పుడు షూటింగ్ కు వెళ్దామా అనేంత క్యూరియాసిటీ వచ్చింది. ఆనంద్‌తో పనిచేయడం గౌరవంగా భావిస్తున్నా. నాకి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ మిథున్, ప్రొడ్యూసర్స్ జ్ఞానవేల్, శ్రీధర్ గారికి థాంక్స్" అని చెప్పింది.


Also Read : తెలుగు సినిమాలను తమిళంలో ఎందుకు ఎంకరేజ్ చేయడం లేదు? విక్రమ్ ఆన్సర్ ఇదే!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial