తమిళ చలన చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుడు, తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడైన అజిత్ కుమార్ (Ajith Kumar) ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి సుబ్రమణియం (Subramaniam) మరణించారు. అనారోగ్య సమస్యల కారణంగా ఈ రోజు ఉదయం చెన్నైలో ఆయన తుదిశ్వాస విడిచారు.
ఐరోపాలో అజిత్ ఫ్యామిలీ...
విషయం తెలిసిన వెంటనే!
అజిత్, ఆయన భార్య శాలిని, ఇతర కుటుంబ సభ్యులు యూరోప్ (Ajith Family Europe Trip) లో ఉన్నారు. కొన్ని రోజుల క్రితం ఫ్యామిలీ టూర్ వేశారు. అయితే, తండ్రి మరణ వార్త తెలిసిన వెంటనే ఇండియాకు ప్రయాణం అయ్యారు. ఈ రోజు సాయంత్రం లోపు చేరుకోవచ్చని తెలుస్తోంది.
సుబ్రమణియం వయసు 84 ఏళ్ళు. ఆయన స్వస్థలం కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్. ఆయనకు భార్య మోహిని, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ముగ్గురిలో అజిత్ కుమార్ హీరో కాగా... మరో ఇద్దరి పేర్లు అనూప్ కుమార్, అనిల్ కుమార్. కొన్ని రోజులు అజిత్ ఫ్యామిలీ హైదరాబాద్ సిటీలో ఉన్నారు.
కుటుంబ సభ్యుల మధ్య అంత్యక్రియలు నిర్వహిస్తామని అజిత్ కుమార్ సోదరులు ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.
నేడు చెన్నైలో అంత్యక్రియలు
సుబ్రమణియం అంత్యక్రియలు ఈ రోజు చెన్నైలోని బీసెంట్ నగర్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారని సమాచారం అందింది. ఆయన మృతి విషయం తెలిసిన ఫ్యాన్స్, పరిశ్రమ ప్రముఖులు అజిత్ కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు.
Also Read : రాసుకో సాంబ - షూటింగుకు ఉస్తాద్ పవన్ కళ్యాణ్ రెడీ
సినిమాలకు వస్తే... విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో హీరోగా ఓ సినిమా చేయాలని అజిత్ కుమార్ ప్లాన్ చేశారు. అయితే, ఆ సినిమా మధ్యలో ఆగింది. దాన్ని పక్కన పెట్టేశారు. విఘ్నేష్ శివన్ బదులు 'కలగ తలైవన్' దర్శకుడు తిరుమేని (Magizh Thirumeni) తో సినిమా చేస్తున్నారు అజిత్. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఆ సినిమా ప్రొడ్యూస్ చేయనుంది.
Also Read : ఏయ్ పిల్లా - రవితేజ వారసుడి సినిమా ఆగింది!