Indraja New Movie: సీఎం భార్య బయటకొస్తే... అజయ్‌, ఇంద్రజ ఎమోషనల్ అయ్యేలా చేసిన పాట

CM Pellam Movie: ముఖ్యమంత్రి భార్య బయటకు వస్తే ఎలా ఉంటుందనే కథాంశంతో రూపొందిన సినిమా 'సీఎం పెళ్ళాం'. ప్రమోషనల్ సాంగ్ శనివారం రాత్రి విడుదల చేశారు. అందులో అజయ్, ఇంద్రజ ఎమోషనల్ అయ్యారు.

Continues below advertisement

''మంచి సోషల్ కాన్సెప్ట్‌తో వస్తోన్న సినిమా 'సీఎం పెళ్లాం'. ఒక ముఖ్యమంత్రి భార్య బయటకు వస్తే ఎలా ఉంటుందనేది మా దర్శకుడు చక్కగా చూపించారు. మన అందరికీ వినోదం అందిస్తూ ఆలోచింపజేసే చిత్రమిది'' అని నటి ఇంద్రజ అన్నారు. ఆవిడ టైటిల్ రోల్ పోషించిన సినిమా 'సీఎం పెళ్ళాం'. ముఖ్యమంత్రి పాత్రలో అజయ్ నటించారు. సహజనటి జయసుధ, సుమన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ఆర్కే సినిమాస్ బ్యానర్ మీద బొల్లా రామకృష్ణ ప్రొడ్యూస్ చేస్తున్నారు. గడ్డం రమణా రెడ్డి దర్శకుడు. త్వరలో థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా ప్రమోషనల్ సాంగ్ విడుదల చేశారు.

Continues below advertisement

సాంగ్ చూశాక ఎమోషనల్ అయ్యాను - అజయ్
'సీఎం పెళ్ళాం' సినిమా ప్రమోషనల్ సాంగ్ చూశాక ఎమోషనల్ అయ్యానని నటుడు అజయ్ చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''ఈ సినిమాలో నటించే ఛాన్స్ రావడం హ్యాపీగా ఉంది. ముఖ్యమంత్రిగా నేను, నా భార్యగా ఇంద్రజ గారు చేశాం. నేను సీఎంగా అయినా సరే... సినిమా మొత్తం ఇంద్రజ గారే ఉంటారు. ఆవిడను చూసి టైమ్ పంక్చ్యువాలిటీ నేర్చుకోవాలి. అందరికీ నచ్చేలా సినిమా ఉంటుంది. మా దర్శకుడు బాగా తీశారు'' అని చెప్పారు. 

రాజకీయ నేపథ్యంలో సందేశాత్మక చిత్రమిది - నిర్మాత
రాజకీయ నేపథ్యంలో సాగే మంచి సందేశాత్మక సినిమా 'సీఎం పెళ్ళాం' అని చిత్ర నిర్మాత నిర్మాత బొల్లా రామకృష్ణ తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''నాకు దర్శకుడు గడ్డం రమణా రెడ్డి మిత్రులు. ఆయన దగ్గర కథ విని ఇంప్రెస్ అయ్యి ఈ సినిమా ప్రొడ్యూస్ చేసేందుకు ముందుకు వచ్చాను. హైదరాబాద్ సిటీ గురించి చేసిన ఈ పాట అందరికీ నచ్చుతుంది'' అని అన్నారు. 

Also Readఅట్లీ సినిమాతో రేర్ రికార్డ్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్... ప్రజెంట్ ఇండియాలో టాప్ అతనేనా!?

''హైదరాబాద్ నగరం నేపథ్యంలో 'సీఎం పెళ్ళాం' ప్రమోషనల్ సాంగ్ చేశాం. మన సిటీ ఎలా ఉందనేది ఈ పాటలో చూపించాం. నేను అమెరికాలో ఉంటాను. అక్కడ కుండపోత వర్షం పడినా చుక్క నీరు నగరంలో నిలవదు. ఇక్కడ వర్షం వస్తే అంతే!ఈ విషయంలో నేను ఎవరినీ విమర్శించడం లేదు. సిటీ బాగుండాలనే తపనతో చెబుతున్నా. 'ఒకే ఒక్కడు'లో ఒక్క రోజు ముఖ్యమంత్రిని చూశాం. ఇందులో సీఎం భార్య బయటకు వస్తే ఎలా ఉంటుందో చూపిస్తున్నా'' అని దర్శకుడు గడ్డం రమణా రెడ్డి చెప్పారు. సామాజిక నేపథ్యంలో మంచి సందేశం ఇస్తూ చేసిన ఈ సినిమాలో వినోదం కూడా ఉందని, అందరినీ ఆలోచింపజేసేలా ఉంటుందని ఆయన తెలిపారు.

Also Readఎవరీ మహీరా శర్మ? సిరాజ్‌తో డేటింగ్ రూమర్లతో వైరల్... ఆవిడ ఏం చేసిందో తెలుసా?

 

CM Pellam Cast And Crew: జయసుధ, సుమన్, ఇంద్రజ, అజయ్,  నగేష్, కోటేశ్వరరావు, భరత్, ప్రీతి నిగం, రూపాలక్ష్మి, ప్రజ్ఞ, శాంతి, దాసరి చలపతి రావు, 'బేబీ' హర్షిత, సత్యనారాయణ మూర్తి తదితరులు నటించిన ఈ సినిమాకు కూర్పు: వి రామారావు, ఛాయాగ్రహణం: నాగ శ్రీనివాస్ రెడ్డి, సంగీతం: ప్రిన్స్ హెన్రి, నిర్మాణ సంస్థ: ఆర్కే సినిమాస్, నిర్మాత: బొల్లా రామకృష్ణ, రచన - దర్శకత్వం: గడ్డం రమణా రెడ్డి

Continues below advertisement