విశ్వక్ సేన్ 'లైలా'లో నటుడు '30 ఇయర్స్ ఇండస్ట్రీ' పృథ్వీ రాజ్ క్యారెక్టర్ లెంగ్త్ తక్కువ. అయితే, ఆ సినిమా కాంట్రవర్సీలో ఆయన పేరు ఎక్కువ వినబడింది. అది పక్కన పెడితే... ఇప్పుడు ఒక కొత్త సినిమాలో నటించే అవకాశం ఆయనకు వచ్చింది. వివాదాలతో సంబంధం లేకుండా ఆయనకు వరుస ఆఫర్లు వస్తాయని చెప్పడానికి ఇదొక ఉదాహరణ.

'హే చికీతా'... 'గరుడవేగ' అంజి నిర్మాణంలో!'హే చికీతా' అంటే తెలుగు ప్రేక్షకులకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'బద్రి' సినిమాలో సాంగ్ గుర్తుకు వస్తుంది. అది 'ఏ చికీతా...'. ఇప్పుడు 'హే చికీతా' పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోంది. దీనిని అమరావతి మూవీ మేకర్స్, సుందరకాండ మోషన్ పిక్చర్స్ సంస్థల మీద ఎన్. అశోక ఆర్ఎన్ఎస్,'గరుడవేగ' అంజి ప్రొడ్యూస్ చేస్తున్నారు. 

ప్రేమికుల రోజు సందర్భంగా శుక్రవారం సినిమా టైటిల్ అనౌన్స్ చేశారు. యువ దర్శకుడు, 'ఆర్ఎక్స్ 100 - మహా సముద్రం - మంగళవారం' సినిమాలు తీసిన అజయ్ భూపతి టైటిల్ పోస్టర్ లాంచ్ చేయగా... సోషల్ మీడియాలో నటి అనసూయ భరద్వాజ్, నటుడు వశిష్ఠ ఎన్ సింహ, దర్శకుడు సాయి రాజేష్ టైటిల్ పోస్టర్ లాంచ్ చేశారు.

ప్రేమికుల రోజున మొదలైన సినిమా షూటింగ్!After Laila controversy, actor 30 Years Industry Prudhvi Raj lands a new role in Hey Chikittha movie: 'హే చికితా'తో ధన్‌రాజ్ లెక్కల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి కథ - స్క్రీన్ ప్లే కూడా ఆయనే అందిస్తున్నారు. ఇందులోనే '30 ఇయర్స్ ఇండస్ట్రీ' పృథ్వీ రాజ్ కీలక పాత్ర చేస్తున్నారు.

'హే చికీతా'లో 'వైఫ్ ఆఫ్' ఫేమ్ అభినవ్ మణికంఠ, దివిజా ప్రభాకర్, తన్మయి హీరో హీరోయిన్లగా నటిస్తున్నారు. దర్శకులు దేవి ప్రసాద్, వీర శంకర్, ఇంకా ప్రభాకర్, 'బలగం' సుజాత, సాయి నాయుడు, అశోక్ వర్ధన్, నేత, సాయి కౌశిక్, క్రాంతి ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 'మై విలేజ్ షో' అంజి మామ, గంగవ్వ, రాజశేఖర్ కూడా ముఖ్యమైన క్యారెక్టర్లు చేస్తున్నారు.

Also Read: చిరంజీవితో సాయి దుర్గా తేజ్... 'విశ్వంభర'లో మామా అల్లుళ్ళ సందడి చూసేందుకు రెడీ అవ్వండమ్మా, మేనల్లుడి రోల్ ఏమిటో తెల్సా!?

''ప్రేమికుల రోజు సందర్భంగా టైటిల్ అనౌన్స్ చేసి షూటింగ్ స్టార్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. తెలంగాణ, ఏపీలోని పలు అద్భుతమైన లొకేషన్లలో చిత్రీకరణ చేస్తాం. శరవేగంగా సినిమా పూర్తి చేస్తాం'' అని దర్శక నిర్మాతలు తెలిపారు.

Also Readలైలా రివ్యూ: డబుల్ మీనింగ్‌లో హీరో డైలాగ్స్... ప్రతి సీన్‌లో హీరోయిన్ స్కిన్ షో.... విశ్వక్ సేన్ లేడీ గెటప్ వేస్తే చాలా? థియేటర్లలో సినిమాను చూడగలమా?

ఈ చిత్రానికి సంగీతం: చరణ్ అర్జున్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: 'గరుడవేగ' అంజి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రవిందర్ బెక్కం, కూర్పు: మధు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రవిందర్ బెక్కం, నృత్య దర్శకత్వం: కపిల్ - జేడీ, కాస్ట్యూమ్ డిజైనర్: నల్లాపు సతీష్, ఫైట్ మాస్టర్ : కృష్ణంరాజు, నిర్మాణ సంస్థలు: అమరావతి మూవీ మేకర్స్ - సుందరకాండ మోషన్ పిక్చర్స్, నిర్మాతలు: ఎన్. అశోక ఆర్ఎన్ఎస్ - 'గరుడవేగ' అంజి, రచన - దర్శకత్వం: ధన్‌రాజ్ లెక్కల.