'మహానటి' సినిమాతో టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ ని అందుకున్న కీర్తి సురేష్ గత ఐదేళ్లుగా వరుస ప్లాపులతో ఇబ్బందులు పడుతూనే వచ్చింది. మహేష్ బాబు సరసన 'సర్కారు వారి పాట' సినిమాలో కాస్త గ్లామర్‌గా కనిపించి ఏ పాత్రలకైనా సిద్ధమంటూ సిగ్నల్ ఇచ్చింది. కానీ, ‘దసరా’ మినహా పెద్దగా అవకాశాలేవీ రాలేదు. ప్రస్తుతం ‘దసరా' సినిమాతో మరోసారి తన నటనతో ఔరా అనిపించింది కీర్తి. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కించిన ఈ మూవీలో నాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటించి తమ అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో కీర్తి సురేష్ వెన్నెల పాత్రలో ఒదిగిపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద 'దసరా' భారీ కలెక్షన్స్ ని అందుకొని బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకుంది. సినిమా ఇంత పెద్ద విజయం సాధించడంలో హీరోయిన్ కీర్తి సురేష్ నటన కూడా ప్రధానంగా నిలిచింది.
ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో న్యాచురల్ స్టార్ నానిని డామినేట్ చేసింది. అలా సినిమా మొత్తానికి కీర్తి నటన హైలెట్‌గా నిలిచింది. ఇక ‘దసరా’ హిట్ తర్వాత కీర్తి సురేష్ కి ఆఫర్లు వెల్లువలా వస్తున్నాయి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అరడజను సినిమాలు ఉన్నాయి. అయితే, వాటిలో తెలుగు సినిమా ఒక్కటే ఉంది. మిగతావన్నీ తమిళ సినిమాలు. అలాగే, కొన్ని మలయాళ సినిమాలకు కూడా కీర్తి సైన్ చేసినట్లు సమాచారం.
‘దసరా’ తర్వాత ప్రస్తుతం కీర్తి సురేష్ మెగాస్టార్ చిరంజీవి 'భోళాశంకర్' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో చిరంజీవికి చెల్లెలి పాత్రలో కనిపించనుంది కీర్తి సురేష్. సినిమా మొత్తం ఆమె పాత్ర చుట్టే కథ తిరుగుతుంది. తమిళంలో అజిత్ నటించిన 'వేదాళం' అనే సినిమాకి ఇది తెలుగు అఫీషియల్ రీమేక్గా తెరకెక్కుతోంది. ఒరిజినల్ లో మెయిన్ పాయింట్ ని తీసుకొని తెలుగు నేటివిటీకి తగ్గట్లు మెహర్ రమేష్ చాలా మార్పులు చేర్పులు చేసినట్లు సమాచారం. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా ఆగస్టు 11 న విడుదల కాబోతోంది.
ఇక ఇటీవలే ఈ మూవీ ప్రమోషన్స్ ని కూడా స్టార్ట్ చేశారు. తాజాగా సినిమా నుంచి ‘‘భోలా మేనియా’’ అనే ప్రోమో సాంగ్ కూడా విడుదలైంది. మహతి స్వర సాగర్ సంగీతమందిస్తున్న ఈ సినిమాని ఏకే ఎంటర్టైన్మెంట్స్ ప్యానెల్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఇక సినిమాలో మెగాస్టార్ కి జోడిగా తమన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాతోపాటు అటు తమిళంలో ఉదయనిది స్టాలిన్ తో 'మామన్నాన్' అనే సినిమా చేస్తోంది. కర్ణన్ ఫేమ్ మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. ప్రస్తుతం ఈ సినిమా కూడా చిత్రీకరణ దశలో ఉంది. ఇక కోలీవుడ్ లో ఈ మూవీతో పాటు జయం రవితో ‘సైరన్’, ‘రివాల్వర్ రీటా’, ‘రఘు తథా’ వంటి వరుస సినిమాలు చేస్తోంది. ఇక ఈ సినిమాల్లో రెండు లేదా మూడు సినిమాలు కనుక సక్సెస్ సాధిస్తే కీర్తి సురేష్ సౌత్ ఇండియాలోనే నంబర్ వన్ హీరోయిన్ గా పాపులారిటి సంపాదించుకోవడం ఖాయమని చెప్పొచ్చు. అయితే, కీర్తి సురేష్‌కు తెలుగులో అవకాశాలు రాకపోవడానికి కారణం శ్రీలీలే అని టాక్. ఆమె డ్యాన్సులతోపాటు.. గ్లామర్ పాత్రల్లో సైతం ఒదిగిపోతుందనే కారణంతో మన దర్శకనిర్మాతలు ప్రస్తుతం ఆమె జపమే చేస్తున్నారు.
Also Read: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం - రామ్ చరణ్ స్పెషల్ ట్వీట్