నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, శ్రీ లీల ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న 'భగవంత్ కేసరి'(Bhagavanth Kesari) మూవీ దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. రిలీజ్ టైం దగ్గర పడటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే ఇప్పటికే సినిమాపై బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తూ ఆడియన్స్ లో క్యూరియాసిటీని పెంచేస్తుంది. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ ని అందుకుంది. ఇక తాజాగా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా కాజల్ అగర్వాల్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ చిత్రంలో కాజల్ 'కాత్యాయని' అనే పాత్రలో కనిపించనుంది.


ఈ మేరకు ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్ సినిమాకు సంబంధించి అనేక విషయాలను అభిమానులతో పంచుకుంది. ముఖ్యంగా తన తోటి హీరోయిన్ శ్రీ లీలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు వచ్చే జనరేషన్ హీరోయిన్స్ కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఓ హీరోయిన్ కి ఉండాల్సిన ప్రధాన లక్షణం ఏంటి? అని యాంకర్ అడగగా దానికి కాజల్ బదులిస్తూ.." సినిమాలతో పాటూ పర్సనల్ గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్. జీవితంలో సినిమాలతో పాటు ఇంకా చాలా చేయాలి. నేను కూడా సినిమాని బాగా ప్రేమిస్తాను. నా మొదటి లవ్ కూడా అదే. కానీ నా పర్సనల్ లైఫ్ లో సినిమాలతో పాటు ఇంకా చాలా పనులు చేస్తున్నా" అని తెలిపింది.


ఉదాహరణకి డిఫరెంట్ బిజినెస్ లు చేయడం, నా కుటుంబాన్ని చూసుకోవడం.. వీటన్నిటినీ చూసుకోవాలంటే అందుకు చాలా టైం కావాలి. ఇవన్నీ చూసుకొని సినిమాలు చేసి రెండిటిని బ్యాలెన్స్ చేయడం అంటే అది చాలా కష్టం. కానీ నువ్వు నిజంగా చేయాలని అనుకుని అన్నిటినీ ఛాలెంజింగ్ గా తీసుకుంటే అది జరుగుతుంది. ఆ క్వాలిటీస్ ని నేను శ్రీలలలో చూశాను. శ్రీలీలకి చాలా పొటెన్షియల్ ఉంది. తను చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. విధేయం గా ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా చాలా ఫోకస్డ్‌గా ఉంటుంది. తనకేం కావాలో తనకు బాగా తెలుసు. ఇలాంటి క్వాలిటీస్ అన్ని ఈ జనరేషన్ హీరోయిన్స్ లో ఉండాలని నేను అనుకుంటున్నాను" అంటూ చెప్పింది.


శ్రీలీలతో పాటు ఈ జనరేషన్ హీరోయిన్స్ సినిమాల విషయంలో చాలా ఫోకస్ గా ఉన్నారు. అది నాకు బాగా నచ్చింది. వాళ్ళకంటూ ఇండస్ట్రీలో ఓ ప్రాపర్ స్ట్రాటజీ, ప్రాపర్ ప్లానింగ్ ఉంది. వాటితోనే వాళ్లంతా ముందుకు వెళ్లడం నిజంగా అద్భుతం" అంటూ కాజల్ అగర్వాల్ తాజా ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది. ఇక 'భగవంత్ కేసరి' విషయానికొస్తే.. హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ మూవీని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించగా, ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించారు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తండ్రి, కూతుర్ల మధ్య సాగే ఎమోషనల్ బాండింగ్ తో ఈ సినిమా ఉండబోతోంది. దసరా కానుకగా అక్టోబర్ 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


Also Read : టైగర్ నాగేశ్వరావు చిత్ర నిర్మాతపై ఐటీ దాడులు - ఆఫీస్​లో సోదాలు చేసిన అధికారులు!






Join Us on Telegram: https://t.me/abpdesamofficial