లెజండరీ నటుడు, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan). నటుడిగా తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోడానికి కష్టపడుతూ వస్తున్నాడు. ఈ క్రమంలో మంచి విజయాలు అందుకుంటున్నాడు. అయితే కెరీర్ ప్రారంభం నుంచీ తన తండ్రితో కంపేరిజన్స్ ఎదుర్కొంటూ వస్తోన్న జూనియర్ బచ్చన్... తాను తన తల్లి జయా బచ్చన్ (Jaya Bachchan) కు కార్బన్ కాపీ అని పేర్కొన్నారు.
అభిషేక్ బచ్చన్, సయామి ఖేర్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ 'ఘూమర్'. ఇందులో అమితాబ్ గెస్ట్ రోల్ లో కనిపించనున్నారు. ఆర్. బాల్కీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. గతంలో అమితాబ్ - అభిషేక్ లతో 'పా' సినిమా తీసిన బాల్కీ... చాలా గ్యాప్ తర్వాత తండ్రీ కొడులతో చేస్తున్న మూవీ కావడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. ఆగస్టు 18న విడుదల కాబోతున్న 'ఘూమర్' చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి, ఇందులో భాగంగా నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో అభిషేక్ మాట్లాడుతూ, తండ్రిలా కాకుండా తన తల్లిలానే ఉంటానని అన్నారు.
Also Read: ఇక్కడ 'అఖండ', అక్కడ 'గదర్ 2' - థియేటర్లకు ట్రాక్టర్లలో వస్తున్న జనాలు!
తండ్రీ కొడుకుల ద్వయంతో కలిసి పనిచేసిన దర్శకుడు బాల్కీ ఇద్దరి మధ్య వ్యత్యాసాల గురించి మాట్లాడుతూ.. "అభిషేక్ చాలా విలక్షణమైన వ్యక్తి అని నేను భావిస్తున్నాను. అమితాబ్ బచ్చన్ కొడుకుగా పుట్టి, అతనికి భిన్నంగా ఉండటం దాదాపు అసాధ్యం. కానీ అభిషేక్ చాలా మోడ్రన్, అతనిది భిన్నమైన వ్యక్తిత్వం. చిరునవ్వుతోనే ఇంటెన్సిటీ చూపిస్తాడు. నేను చూసిన వారిలో అలా చాలా తక్కువ మంది నటులే ఉన్నారు. అతనికి నిర్దిష్టమైన స్వరం ఉంది. అమితాబ్ బచ్చన్ వాయిస్ మాదిరిగానే, అలాంటి ఇంకో స్వరాన్ని నేను కనుగొనలేదు'' అని అన్నారు.
దానికి అభిషేక్ బచ్చన్ స్పందిస్తూ.. ''నా స్టైల్‌తో పాటు అంతా.. నేను నాన్నలా కాకుండా అమ్మలానే ఉంటానని అనుకుంటున్నాను'' అని అన్నారు. దీనికి బాల్కీ కలుగజేసుకుంటూ "అతను చాలా సహజంగా ఉంటాడు. చాలా నిజాయితీపరుడు" అని పేర్కొన్నారు. వెంటనే అభిషేక్ మాట్లాడుతూ.. "అవును, అవును.. నేను మా అమ్మ మాదిరిగా మాత్రమే కనిపిస్తాను. నేను మా అమ్మకి కార్బన్ కాపీని అని చెప్పాలి" అని చెప్పుకొచ్చారు.
కాగా, 'రెఫ్యూజీ' సినిమాతో హీరోగా ఆరంగేట్రం చేసిన అభిషేక్ బచ్చన్.. 60కి పైగా చిత్రాలలో నటించారు. ఇందులో భాగంగా తన తండ్రి మరియు భార్య ఐశ్వర్య రాయ్ బచ్చన్‌తో కూడా బిగ్ స్క్రీన్ చేసుకున్నారు. గతేడాది 'దస్వి' చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న జూనియర్ బచ్చన్.. ఇప్పుడు 'ఘూమర్' విజయంపై ధీమాగా ఉన్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలానే మెల్బోర్న్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించబడింది. ఈ వారాంతంలో థియేటర్లలోకి రాబోతున్న ఈ స్పోర్ట్స్ డ్రామా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
Also Read: దిశా లేదు, దీషా లేదు - టైగర్ సింగిలే, డేటింగ్ రూమర్స్‌పై క్లారిటీ!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial