యువ కథానాయకుడు ఆది సాయి కుమార్ (Aadi Sai Kumar) నటించిన తాజా సినిమా 'సిఎస్ఐ సనాతన్' (CSI Sanatan Movie). ఇదొక థ్రిల్లర్. ఈ శుక్రవారం (మార్చి 10న) థియేటర్లలోకి వస్తోంది. 2023లో థియేటర్లలోకి వస్తున్న ఆది తొలి చిత్రమిది. ఇటీవల 'పులి - మేక'తో ఆయన ఓ విజయం అందుకున్నారు. అయితే, అది వెబ్ సిరీస్! ఓటీటీలో వచ్చింది. 'సిఎస్ఐ సనాతన్' సినిమా. ఈ టైటిల్ చాలా డిఫరెంట్‌గా ఉంది కదూ! దీని వెనుక ఇంట్రెస్టింగ్ స్టోరీ కూడా ఉంది.


క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్!
'సిఎస్ఐ సనాతన్' చిత్రాన్ని చాగంటి ప్రొడక్షన్స్ పతాకంపై అజయ్ శ్రీనివాస్ ప్రొడ్యూస్ చేశారు. నిర్మాతగా ఆయనకు తొలి చిత్రమిది. సినిమా విడుదల కానున్న సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ''సిఎస్ఐ అంటే ఏంటి? అనే అనుమానం చాలా మందిలో ఉంది. క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్... 'సిఎస్ఐ'కు ఫుల్ మీనింగ్. ఇక, సినిమాలో హీరో పేరు సనాతన్. అందుకని 'సిఎస్ఐ సనాతన్' అని పెట్టాం. ఈ టైటిల్ క్యాచీగా, కొత్తగా ఉందని చాలా మంది చెబుతున్నారు'' అని తెలిపారు.
 
ఒక కంపెనీ సీఈవో మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో 'సిఎస్ఐ సనాతన్' కథ సాగుతుందని అజయ్ శ్రీనివాస్ తెలిపారు. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఈ మధ్య కాలంలో ఎప్పుడూ చూడని విధంగా ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తుందని ఆయన వివరించారు. సినిమాలో ఒక స్కామ్ గురించి కూడా డిస్కస్ చేశామని ఆయన చెప్పారు. 


'సిఎస్ఐ సనాతన్' థ్రిల్లర్ సినిమా అని, ఇది దేనికీ రీమేక్ కాదని, కథ విషయంలో చాలా రీసెర్చ్ చేశామని అజయ్ శ్రీనివాస్ చెప్పారు. ఫోరెన్సిక్ విషయాల్లోనూ రీసెర్చ్ చేసి స్టోరీ డెవలప్ చేశామన్నారు. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఎలా పని చేస్తారు? ఓ నేరం విషయంలో నిర్ధారణకు ఎలా వస్తారు? వారి ఇన్వెస్టిగేషన్ ఎంత క్షుణ్నంగా సాగుతుంది? అనేది దర్శకుడు శివ శంకర్ దేవ్ చెప్పినప్పుడు తనను అమితంగా ఆకట్టుకుందని ఆయన తెలిపారు. అన్నట్టు... 'పులి - మేక'లో ఆది సాయి కుమార్ ఫోరెన్సిక్ టీమ్ లీడ్ రోల్ చేశారు.
 
ఆది కోసమే వెయిట్ చేశాం!
'సిఎస్ఐ సనాతన్' స్టోరీ డెవలప్ చేశాక... హీరోగా ఆది సాయి కుమార్ అయితే బావుంటుందని ఆయన కోసం చాలా రోజులు వెయిట్ చేశామని నిర్మాత అజయ్ శ్రీనివాస్ చెప్పారు. ఆది బాడీ లాంగ్వేజ్, హావభావాలు ఈ సినిమాకు సరిగ్గా సరిపోయాయని తెలిపారు. దర్శకుడికి బెస్ట్ ఇవ్వాలని ఆర్టిస్టుల విషయంలో కూడా కాంప్రమైజ్ కాకుండా సెలెక్ట్ చేశానని అజయ్ శ్రీనివాస్ తెలిపారు. అనీష్ సోలోమాన్ అద్భుతమైన నేపథ్య సంగీతం ఇచ్చాడని, ప్రతి సన్నివేశంలో ఆర్ఆర్ అదిరిపోయిందని, థియేటర్ల నుంచి వచ్చిన తర్వాత కూడా గుర్తు ఉండేలా ఉంటుందని తెలిపారు.  


Also Read వెయ్యి కోట్ల సినిమాకు అయినా సరే 'ఆమె' కావాలి - ఆడదే ఆధారం 


ఆది సాయి కుమార్ జోడీగా మిషా నారంగ్ (Misha Narang) నటించిన ఈ సినిమాలో 'బిగ్ బాస్' ఫేమ్ అలీ రెజా, నందినీ రాయ్ (Nandini Roy), తాక‌ర్ పొన్న‌ప్ప, మ‌ధు సూద‌న్, వాసంతి తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : జి. శేఖ‌ర్, సంగీతం : అనీష్ సోలోమాన్, నిర్మాత : అజ‌య్ శ్రీనివాస్, ద‌ర్శ‌కుడు : శివ‌శంక‌ర్ దేవ్. 


Also Read : 'కెజియఫ్' కామెంట్స్ గొడవ - వెంకటేష్ మహా ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యారు? ఆయనకు అసలు పాయింట్ అర్థమవుతోందా?