సినిమా హీరోలను ప్రేక్షకులు ఎంతగా ఆదరిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా అగ్ర హీరోల అభిమానులు తమ అభిమాన హీరో పై చూపించే ప్రేమ ఒక్కొక్కసారి హద్దులు దాటుతుంటుంది. అభిమాన నటుడి కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి కొంతమంది రెడీ అయిపోతుంటారు. అందరికంటే తామే ప్రత్యేకం అని నిరూపించుకోవడానికి ఇంకొంతమంది ఫ్యాన్స్ వింత వింత పనులు చేస్తుంటారు. అలాంటి ఓ వింత సంఘటనే తాజాగా తమిళనాడులో జరిగింది. కోలీవుడ్ స్టార్ తలపతి విజయ్ వీరాభిమాని చేసిన ఓ వింతపని సోషల్ మీడియా అంతట చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఏంటా వింత పని? డీటెయిల్స్ లోకి వెళ్తే..


దళపతి విజయ్ హీరోగా నటించిన 'లియో' మూవీ గురువారం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదలైన సంగతి తెలిసిందే కదా. అయితే ఈ సినిమా విడుదల సందర్భంగా దళపతి విజయ్ ఫ్యాన్స్ ఓ వింత పని చేశారు. జీవితంలో కొత్త బంధానికి నాంది పలికే నిశ్చితార్థాన్ని 'లియో' చిత్రం ప్రదర్శింపబడుతున్న థియేటర్లో జరుపుకొని తమ అభిమానాన్ని చాటుకున్నారు. తమిళనాడులోని పుడుక్కోటి జిల్లాకు చెందిన వెంకటేష్, మంజుల తలపతి విజయ్ కి వీరాభిమానులు. రీసెంట్ గానే వీళ్లిద్దరి మ్యారేజ్ ఫిక్స్ అయింది. పెళ్లి కుదిరిన తర్వాత వీళ్లు విజయ్ కి వీరాభిమానులని ఇద్దరికీ తెలిసింది. దాంతో ఈ జంట కొన్ని విషయాల్లో నియమాలు పెట్టుకున్నారు.






విజయ్ నటించిన లియో మూవీ రిలీజ్ అయ్యాకనే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఇందులో భాగంగానే ఏకంగా ఎనిమిది నెలల గ్యాప్ తీసుకున్నారు. ఇక తాజాగా అక్టోబర్ 19న 'లియో' రిలీజ్ అవ్వడంతో ఆ తర్వాతి రోజు అంటే అక్టోబర్ 20న పెళ్లి పెట్టుకున్నారు. అంతకు ముందు రోజు తమ అభిమాన నటుడి సినిమా కోసం ఈ జంట థియేటర్ కి వెళ్లి 'లియో' మూవిని వీక్షించారు. థియేటర్ కి ట్రెడిషనల్ డ్రెస్ లో వచ్చిన వీళ్లు లియో సినిమా ప్రదర్శింపబడుతుండగానే ఆడియన్స్ ముందు దండలు, ఉంగరాలు మార్చుకుని నిశ్చితార్థం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.


'అభిమానం అంటే ఇలా కూడా ఉంటుందా?' అని కొంతమంది అంటుంటే, "మీ అభిమానానికి హ్యాట్సాఫ్" అంటూ ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక 'లియో' విషయానికి వస్తే.. ప్రస్తుతం మిక్స్డ్ టాక్ తో  థియేటర్స్ లో రన్ అవుతుంది. దళపతి ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాతో పండగ చేసుకుంటున్నారు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమైన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా భారీ ఓపెనింగ్స్ ని అందుకుంది. 'లియో' మూవీ మొదటి రోజు బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా రూ.140 కోట్లు కొల్లగొట్టి విజయ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని నమోదు చేసింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ కి జోడిగా త్రిష హీరోయిన్ గా నటించింది. సంజయ్ దత్, అర్జున్, గౌతమ్ మీనన్, మన్సూర్ అలీ ఖాన్ మిష్కిన్ ఇతర కీలక పాత్రలు పోషించారు.


Also Read : 'లియో' దిమ్మతిరిగే రికార్డ్స్ - విజయ్ దెబ్బకు 'ఆదిపురుష్, జైలర్, 'జవాన్' రికార్డ్స్ బ్రేక్!





Join Us on Telegram: https://t.me/abpdesamofficial