'Pushpa 2' Latest Update : ఇండియన్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న 'పుష్ప2' కూడా ఒకటి. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం వరల్డ్ వైడ్ సినీ లవర్స్ ఎంతో ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. పార్ట్‌ 1 వచ్చి రెండున్నర ఏళ్లు అవుతుంది.. ఇంకా మూవీని రిలీజ్‌ చేయకపోవడంపై ఫ్యాన్స్ అసహనంతో ఉన్నారు. దానికి తోడు మూవీ షూటింగ్‌ కూడా స్లోగా సాగుతుంది. పైగా అప్‌డేట్స్‌ కూడా పెద్దగా రావడం లేదు. అప్పుడెప్పుడో ఫస్ట్‌ గ్లింప్స్‌ రిలీజ్ చేసిన టీమ్ మళ్లీ ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్ బయటికి వచ్చింది. 


ఒక్క ఎపిసోడ్ కోసం రూ.50 కోట్లు


'పుష్ప 2' బడ్జెట్ విషయంలో నిర్మాతలు ఏమాత్రం వెనకడుగు వెయ్యట్లేదు. సుమారు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ఓ కీలక ఎపిసోడ్ షూట్ చేశారట. సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్‌‌లో వచ్చే ఆ ఎపిసోడ్ కోసం నిర్మాతలు భారీగా ఖర్చు చేసినట్లు సమాచారం. 'పుష్ప2' జాతర ఎపిసోడ్ దాదాపు అరగంట సేపు ఉంటుంది. ఇందుకు మూవీ టీమ్ దాదాపు 35 రోజుల పాటు పని చేసింది.


ఈ ఎపిసోడ్ కోసమే నిర్మాతలు రూ.50 కోట్లకుపైనే ఖర్చు చేసినట్లు ఇన్సైడ్ వర్గాల సమాచారం. ఈ జాతర ఎపిసోడ్లో బన్నీ అర్ధనారీశ్వరుడి గెటప్‌లో కనిపిస్తాడట. చేతులకు నెయిల్ పాలీష్‌, నుదుట బొట్టుతో ఇప్పటికే రిలీజ్ చేసిన బన్నీ లుక్ ఈ ఎపిసోడ్ లోనే ఉంటుందని అంటున్నారు. ఓ పాట, భారీ ఫైట్, సెంటిమెంట్ ని మేళవించి సుకుమార్ ఈ ఎపిసోడ్ని చిత్రీకరించినట్లు తెలుస్తోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఇదే ఎపిసోడ్లో ఓ కీలక ట్విస్ట్ కూడా ఇంటర్వెల్ బ్యాంగ్ తో ఉంటుందట. 'పుష్ప 2' సినిమా మొత్తానికే ఈ ఎపిసోడ్ హైలెట్ కానుందని సమాచారం. థియేటర్స్ లో ఈ ఎపిసోడ్ కి పూనకాలు గ్యారెంటీ అని చెబుతున్నారు.


'పుష్ప 3' పై బన్నీ అప్డేట్


ఇటీవల జరిగిన 74వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ లో పాల్గొన్న బన్నీ 'పుష్ప 3' పై అప్డేట్ ఇచ్చాడు. ఈ సినిమాని ఫ్రాంచైజీగా చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిపాడు. "పుష్ప 3ని కచ్చితంగా ఆశించవచ్చు. ఎందుకంటే, మేం 'పుష్ప'ను ఓ ఫ్రాంచైజీగా మార్చాలనుకుంటున్నాం. సీక్వెల్స్ కోసం మా దగ్గర చక్కటి ఆలోచనలున్నాయి. 'పుష్ప3' ఆశించడంలో ఏమాత్రం సందేహం అవసరం లేదు" అని చెప్పుకొచ్చారు. కాగా 'పుష్ప 3' సెట్స్ పైకి వెళ్లేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉంది. 'పుష్ప2' తర్వాత బన్నీ.. అట్లీ, త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగా లాంటి దర్శకులతో ఇప్పటికే సినిమాలు కమిట్ అయ్యాడు. అటు సుకుమార్ కూడా రామ్ చరణ్ తో ఓ సినిమా చేస్తున్నారు. సో 'పుష్ప3' ఉన్నా కూడా కార్యరూపం దాల్చడానికి మరింత ఎక్కువ సమయం పడుతుంది.


'పుష్ప 2' సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ నటుడు ఫాహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ, జగదీశ్ బండారి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.


Also Read : కాబోయే భర్త 'VD' లాగా ఉండాలన్న రష్మిక - పరోక్షంగా హింట్ ఇచ్చిందంటున్న ఫ్యాన్స్!