30 Years Industry Pridhviraj About Roja: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ హీట్ మామూలుగా లేదు. ఈసారి అక్కడి ఎన్నికల్లో పలువురు సినీ సెలబ్రిటీలు కూడా యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. అందులో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్విరాజ్ కూడా ఒకరు. కొన్నాళ్ల క్రితం జనసేనలో చేరిన ఈయన.. ఆ పార్టీకి సపోర్ట్‌గా పలు ప్రెస్ మీట్స్‌లో పాల్గొంటున్నారు. ఈసారి ఏపీ ఎన్నికల్లో జనసేన - టీడీపీ కూటమి గెలుపు ఖాయమని ప్రతీ సందర్భంలో చెప్తూనే ఉన్నారు. తాజాగా ఒక ప్రెస్ మీట్‌లో పాల్గొన్న పృధ్విరాజ్.. మరోసారి ఇతర పార్టీలపై కామెంట్స్ చేస్తూ జనసేన గెలవడం ఖాయం అన్నట్టుగా మాట్లాడారు.


గొప్పవాళ్లమని చెప్పుకుంటారు..


‘‘175 సీట్లు వచ్చాయని విర్రవీగుతున్నారు. అటు 5 తీస్తే 17, ఇటు 7 తీస్తే 15 ఉంటుంది. అంతకు మించి వీళ్లకు ఎక్కువ ఏమీ రావు. మొన్న కన్నబాబును పిఠాపురంలో ఎలా పంపించారో చూస్తూనే ఉన్నాం. నగరిలో టపాకాయలు కాల్చి, స్వీట్లు పంచి, కొత్త భాషలో గుడ్ మార్నింగ్ చెప్పిన ఆమె ఘోరంగా ఓడిపోయే వారిలో ముందుంటుంది. ఇన్ని దుర్మార్గాలు పెట్టుకొని పైకి మేము చాలా గొప్పవాళ్లం అని చెప్పుకుంటారు. ఇప్పుడు పృధ్విరాజ్ కరెక్ట్ అంటే అంబటి రాంబాబు, అనంతి శ్రీనివాస్ విషయం ఏమైంది?’’ అంటూ నగరిలో రోజా ఓటమి ఖాయం అన్నట్టుగా మాట్లాడారు పృధ్విరాజ్. తాజాగా ఆయన పాల్గొన్న ఇంటర్వ్యూలో ఎక్కువగా రోజానే టార్గెట్ చేస్తున్నట్టుగా మాట్లాడారు.


కట్ చేయరు..


‘‘నాయకులు కూడా తెలుసుకునే రోజు దగ్గర్లో ఉంది. కౌంట్‌డౌన్ స్టార్ట్ అవుతుంది. ఆమె మినిస్టర్ అయితే చిరంజీవి ఇంటికి పిలిచి బట్టలు పెట్టి, భోజనం పెట్టి పంపించారు. అయినా కూడా ఆమె ఒక దరిద్రుడు జైలుకు వెళ్తే.. ఒక దరిద్రుడు సపోర్ట్ చేశాడు అన్నట్టు మాట్లాడింది. భోళా శంకర్ ప్యాచ్ వర్క్ జరుగుతున్నప్పుడు నేను చిరంజీవి అడిగాను. వాళ్ల విజ్ఞతకే వదిలేశాం, కర్మ అన్నారు. ఆయన సంస్కారం అలాంటిది. ఆమె అలా మాట్లాడడం ఎంత తప్పు? నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడడమేనా? తిరుమలలో కొండపై రాజకీయాలు మాట్లాడొద్దు అంటే దరిద్రమైన మాటలన్నీ అక్కడే మాట్లాడతారు. అది కట్ చేయరు’’ అంటూ రోజా పేరును ఉపయోగించకుండా పరోక్షంగా చిరంజీవిపై ఆమె చేసిన వ్యాఖ్యలను గుర్తుచేసుకున్నారు పృధ్విరాజ్.


రెండుసార్లు ఓడిపోయింది..


‘‘చాలా విషయాలు ఉన్నాయి. నా దగ్గర పృధ్విరాజ్ డైరీ ఉంది. ప్రచారం మొదలుపెట్టినప్పటి నుండి రోజుకు ఒకటి వదులుతూ ఉంటా. వీడు అడుక్కు తినేవాడు వీడికి ఇన్ని వేల కోట్లు ఎక్కడి నుండి వచ్చాయి? వీడి చరిత్ర ఏంటి? వీడు తాగే బాటిల్స్ ఏంటి? అని నోట్ చేసి పెట్టుకున్నాను. మన దరిద్రం కాకపోతే ఇవన్నీ మనం స్వయంగా చూశాం. ఒకరిని నీటిపారుదల శాఖ మంత్రిని చేశారు. వాడికేం తెలుసు నీటిపారుదల గురించి? రోజా 28 స్థానంలో ఉన్న మొదటి స్థానంలో ఉంది అంటున్నారు. టీడీపీలో ఉన్నప్పుడు రెండుసార్లు ఓడిపోయింది. ఏమైనా అంటే పవన్ కళ్యాణ్‌కు మూడు పెళ్లిళ్లు, పధ్విరాజ్ వెనక నుండి పట్టుకున్నాడు అంటారు. నువ్వు రా ముందు నుండి పట్టుకుంటా నిన్ను’’ అని పృధ్విరాజ్ కామెంట్స్ చేశారు.


Also Read: అలాంటి బుద్ధి తక్కువ పని నేను చేయను - పిఠాపురంలో పోటీపై ఆర్జీవీ వివరణ