Vikrant Massey: ‘12th ఫెయిల్’ హీరో, బాలీవుడ్‌ నటుడు విక్రాంత్‌ మాస్పే గుడ్‌న్యూస్‌ చెప్పాడు. తండ్రిని అయ్యానంటూ ఫ్యాన్స్‌ శుభవార్త అందించాడు. తాజాగా ఆయన భార్య శీత‌ల్ ఠాకూర్‌ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్టు తెలిపాడు. ఈ మేరకు విక్రాంత్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ షేర్‌ చేశాడు. ఈ రోజు (ఫిబ్రవరి 7వ తేదీ 2024) మేము ఒక్కటయ్యాం. మా జీవితాల్లో మరో కొత్త వ్యక్తి వచ్చారు. మాకు కుమారుడు పుట్టాడని చెప్పేందుక మేము ఎనలేని ఆనందం, ప్రేమతో ఉప్పోంగిపొతున్నాము' అంటూ తన పోస్ట్‌కు రాసుకొచ్చాడు.


ఈ జంటకు శుభాకాంక్షల వెల్లువ


తల్లిదండ్రులుగా ప్రమోట్‌ అయిన ఈ బాలీవుడ్‌ జంటకి సహ నటీనటులు, సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. కాగా ఏడేళ్ల డేటింగ్‌ అనంతరం 2022 ఫిబ్రవరి 18న మూడుమూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. పళ్లయి సరిగ్గా రెండేళ్లకు వారు తాజాగా తల్లిదండ్రులుగా ప్రమోట్‌ అయ్యారు. కాగా విక్రాంత్‌ మాస్సే ఇటీవల ‘12th ఫెయిల్’ (ట్వెల్త్ ఫెయిల్) సినిమాతో మంచి విజయం సాధించాడు. నిజ జీవిత సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో విక్రాంత్ మాసే.. మనోజ్ కుమార్ శర్మ పాత్ర పోషించారు. పేదరికాన్ని దాటి, ఓ దశలో 12వ తరగతి ఫెయిల్ అయినా ఆ తర్వాత కష్టపడి చదివి ఐపీఎస్ ఆఫీసర్ అయిన మనోజ్ కుమార్ శర్మ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు విధు వినోద్ చోప్రా.






హిందీలో గతేడాది అక్టోబర్‌ 27న థియేటర్లోకి వచ్చిన ఈ సినిమాకు మంచి హిట్‌ టాక్‌ రావడంతో తెలుగు, తమిళ్‌, కన్నడ భాషల్లోనూ డబ్‌ చేసి నవంబర్‌ 3న రిలీజ్‌ చేశారు. సౌత్‌లోనూ ఈ మూవీకి ఆడియన్స్‌ బ్రహ్మరథం పట్టారు. మొదట హిందీలో చిన్న సినిమాగా వచ్చిన ‘12th ఫెయిల్’ ఊహించని రెస్పాన్స్‌ అందుకుంది.  కలెక్షన్లతో పాటు చాలా ప్రశంసలు దక్కించుకుంది. ఎంతో మందిలో స్ఫూర్తిని నింపిన ఈ మూవీ మంచి మెసెస్‌ ఒరియెంటెడ్‌ చిత్రంగా పేరు తెచ్చుకుంది. అయితే, ఇటీవలే 12th ఫెయిల్ ఓటీటీకి రాగా అక్కడ ఈ సినిమా భారీ రెస్పాన్స్‌ అందుకుంది.


హిందీలో మాత్రమే ఈ మూవీ స్ట్రీమింగ్‍కు అందుబాటులో వచ్చింది. ఓటీటీలోకి కూడా 12th ఫెయిల్ మూవీకి అదిరిపోయే స్పందన వస్తోంది. హాట్‍స్టార్‌ ట్రెండింగ్‍లో ప్రస్తుతం టాప్‍లో ఉంది. చాలా మంది ఈ మూవీని చూసి సోషల్ మీడియాలో ప్రశంసిస్తున్నారు. దీంతో 12th మూవీని తెలుగు, కన్నడ భాషల డబ్బింగ్ వెర్షన్‍ను కూడా స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి తీసుకురావాలని నెటిజన్లు నుంచి డిమాండ్స్ వస్తున్నాయి. మరి ఈ మూవీ తెలుగు, తమిళ్‌, కన్నడ వెర్షన్లు అందుబాటులోకి ఎప్పుడు వస్తాయో చూడాలి.