తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతిని ప్రజలు ఘనంగా నిర్వహించుకుంటారు. ఈ పండగకు చుట్టాలు పక్కాలు అంతా సొంతూళ్లకు చేరుకుని మూడు రోజుల పాటు అంగరంగం వైభవంగా వేడుక చేసుకుంటారు. ఇక సంక్రాంతి సీజన్ అంటే చాలు టాలీవుడ్ లో కొత్త ఉత్సాహం నెలకొంటుంది. స్టార్ హీరోలకు సంబంధించిన సినిమాలు పొంగల్ బరిలో నిలుస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతిని టార్గెట్ చేసుకుని ఇప్పటికే అర డజన్ సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. మహేష్ బాబు ‘గుంటూరుకారం’, వెంకటేష్ ‘సైంధవ్’, రవితేజ ‘ఈగల్’, ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ సహా పలు సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచాయి.   


తమిళంలోనూ పొంగల్ కు పెద్ద సినిమాల విడుదల


తెలుగులోనే కాదు, తమిళ నాట కూడా సంక్రాంతికి చాలా సినిమాలు విడుదల అవుతుంటాయి. ఈ ఏడాది పొంగల్ కు విడుదలైన అజిత్ ‘తునివు’, విజయ్ దళపతి ‘వారిసు’ సినిమాలు చక్కటి విజయాన్ని అందుకున్నాయి. వచ్చే ఏడాది కోసం పలు సినిమాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే శివ కార్తికేయన్ మూవీ ‘అయలాన్’ సంక్రాంతికి విడుదలకాబోతోంది. శివ కార్తికేయన్, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ జంటగా రూపొందుతున్నఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ఆర్‌. రవికుమార్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ సైన్స్ ఫిక్షన్ మూవీని కోటపాడి రాజేష్‌, ఆర్‌ డి.రాజా నిర్మిస్తున్నారు.


సంక్రాంతి బరిలో విక్రమ్ మూవీ


తాజా సమాచారం ప్రకారం రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న ‘తంగలాన్’ మూవీ కూడా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా వెల్లడించకపోయినా, ఇప్పటికే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో  విక్రమ్ సరికొత్త గెటప్ లో కనిపించనున్నారు. ‘తంగలాన్’ అనే ఆదివాసి తెగకు చెందిన వ్యక్తిగా నటిస్తున్నారు. సినిమాలో చాలా వరకు అతడు కేవలం గోచీతోనే కనిపించనున్నాడు.  యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో పీరియాడికల్ జానర్ లో ఈ మూవీ రూపొందుతోంది. పాన్ ఇండియా సినిమాగా పా రంజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో విక్రమ్ కు జోడీగా మాళవిక మోహనన్ నటిస్తోంది. ఆమె పుట్టినరోజు సందర్భంగా ‘తంగలాన్’ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్‌ను మూవీ యూనిట్ విడుదల చేసింది. ఇందులో మాళవిక వారియర్ రోల్‌లో కనిపించింది.  


నిర్మాణాంతర పనులు జరుపుకుంటున్న ‘తంగలాన్’


ఇక ‘తంగలాన్’  సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా ఇటీవలే పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుపుకుంటుంది. ఈ చిత్రంలో మాళవిక మోహనన్ తో పాటు, పార్వతి హీరోయిన్ గా నటిసతోంది. పశుపతి, డేనియల్ కాల్టాగిరోన్‌ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. చియాన్ విక్రమ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇండియా తో పాటు విదేశీ భాషల్లో 2డీ, 3డీలో విడుదలకు సిద్ధమవుతోంది. జీవీ ప్రకాష్ కుమార్ స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమాని స్టూడియో గ్రీన్, నీలం ప్రొడక్షన్స్ బ్యానర్లపై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు.


Read Also: ‘మంగళవారం‘ కోసం అంత రిస్క్ చేసిందా? అసలు విషయం బయటపెట్టిన హాట్ బ్యూటీ!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial