చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) కథానాయకుడిగా నటించిన సినిమా 'కోబ్రా' (Cobra Movie). ఇందులో 'కెజియఫ్ 2' (KGF 2 Movie) ఫేమ్ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) కథానాయిక. ఇటీవల చెన్నైలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. మొదట ఆగస్టు 11న 'కోబ్రా'ను విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ ఆ సమయానికి రావడం కుదరలేదు. ఇప్పుడు ఆగస్టు 31న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Continues below advertisement


దానికి తగ్గట్లుగా చిత్రబృందం ప్రమోషన్స్ షురూ చేసింది. తాజాగా ఈ సినిమా తెలుగు టీజర్ ను విడుదల చేశారు. మ్యాథ్స్ లో జీనియస్ అయిన 'కోబ్రా'.. తన టాలెంట్ ను ఉపయోగించి అసాధ్యమైన క్రైమ్స్ ను చాలా ఈజీగా చేస్తుంటాడు. అతడిని ఎలాగైనా పట్టుకోవాలని ప్రయత్నిస్తుంటారు పోలీసులు అండ్ గవర్నమెంట్ అఫీషియల్స్. కానీ తను మాత్రం దొరకడు. తన లెక్కలతో అందరికీ చుక్కలు చూపిస్తుంటారు. టీజర్ ను చాలా ఇంట్రెస్టింగ్ గా కట్ చేశారు. ఆగస్టు 25న తమిళ ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు. అదే రోజు తెలుగు ట్రైలర్ కూడా వస్తుందేమో చూడాలి. 'కోబ్రా'లో విక్రమ్ సుమారు 20 పాత్రల్లో కనిపిస్తారని టాక్. ఇదొక యాక్షన్ థ్రిల్లర్. 



స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్న అజ‌య్ జ్ఞాన‌ముత్తు (Ajay Gnanamuthu) ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై ఎస్ఎస్ లలిత్ కుమార్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో సినిమా రిలీజ్ కానుంది. ఎ.ఆర్‌.రెహ‌మాన్ (A.R.Rahman)సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎన్.వి.ప్రసాద్ ఈ సినిమా తెలుగు హక్కులను సొంతం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆయనే స్వయంగా రిలీజ్ చేస్తున్నారు.


Also Read : 'లైగర్' ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా? ఏ ఏరియా రైట్స్ ఎన్ని కోట్లకు అమ్మారో చూడండి


Also Read : ఎవరు ఆపుతారో చూద్దాం - విజయ్ దేవరకొండ