తమ అభిమాన హీరోలను ఒకే సినిమాలో ఒకే వేదికపై చూడాలని చాలామంది ఫ్యాన్స్ కోరుకుంటారు. పైగా, ఇద్దరు హీరోలు కలిసి నటించే సినిమాలకు హైప్ కూడా బాగానే ఉంటుంది. తాజాగా ‘వాల్తేరు వీరయ్య’ కూడా అదే హైప్‌ను క్రియేట్ చేసింది. పైగా, ఒకప్పుడు ‘అన్నయ్య’ సినిమాలో తమ్ముడిగా నటించిన చిరు అభిమాని రవితేజ.. చాలా ఏళ్ల తర్వాత చిరంజీవితో కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ట్రైలర్ కూడా మూవీపై ఆసక్తిని పెంచేసింది. పైగా ఆదివారం రాత్రి చిరంజీవి స్పీచ్ కూడా ‘వాల్తేరు వీరయ్య’ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ సందర్భంగా చిరంజీవి రవితేజ గురించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేకెత్తించాయి.
రవితేజ గురించి చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘రవితేజ ‘ఆజ్ కా గూండారాజ్’లో నాకు స్నేహితుడి వేషం వేశాడు. రవితేజ విజయవాడే. కానీ, పెరిగింది అంతా బాంబేనే. హిందీలో తెగ మాట్లాడేవాడు. రవి తేజ అమితాబ్‌ను ఎక్కువగా ప్రేమించేవాడు. సౌత్‌లో నేనంటే ఇష్టమని చెప్పేవాడు. అలాంటి రవితో నాకు సినిమాలు చేసే అవకాశం లభించింది’’ అని చిరంజీవి అనగానే.. రవితేజ ‘‘అబ్బా.. అవునా..’’ అని చిరంజీవిని ఆటపట్టించారు. దీంతో చిరు ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడుతూ.. ‘‘నువ్వు తక్కువోడు కాదు. ఏతంతావేంటి?’’ అని అన్నారు. దీంతో అంతా నవ్వేశారు. అనంతరం ప్రశంగం కొనసాగిస్తూ.. ‘‘నాకు రవి మీద కోపం వచ్చేస్తుంది. షూటింగ్‌లో నన్ను యాక్టింగ్ మీద ఫోకస్ పెట్టనివ్వడు. ఎప్పుడూ ఏవో కబుర్లు చెబుతాడు, అల్లరి చేస్తాడు’’ అని అన్నారు.
Also Read: త్వరలో నేనూ విశాఖవాసి కాబోతున్నా, శృతిని బెదిరించారేమో - బాలకృష్ణపై చిరంజీవి స్వీట్ సెటైర్
ఖాళీ దొరికితే రవితేజ సినిమాలే చూస్తా
‘‘చిన్న పాత్రలతో వచ్చి.. ఇప్పుడు మాస్ మహరాజ్ అనే ఇమేజ్‌ను ఏర్పచుకున్నాడు రవితేజ. నాకు రవి తేజ సినిమాలంటే చాలా ఇష్టం. నాకు ఖాళీ దొరికితే రవితేజ సినిమాలు చూస్తాను. అతని సినిమాల్లో మాస్, డ్యాన్స్, చిలిపి, వెటకారం ఎక్కువగా ఉంటాయి’’ అని అన్నారు. దీంతో రవితేజ స్పందిస్తూ.. ‘‘మేమంతా మిమ్మల్ని చూసి నేర్చుకున్నవే. మేం మిమ్మల్నే ఫాలో అయ్యాం’’ అని అన్నారు. దీంతో చిరంజీవి.. ‘‘నేను చేస్తే అది కామెడి. నువ్వు చేసివాటిలో వెటకారం ఉంటాది’’ అని అన్నారు. ‘వాల్తేరు వీరయ్య’లో మావి చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగే క్యారెక్టర్లు అంటూ చిరంజీవి మూవీలోని కీలక సన్నివేశాల గురించి హింట్ ఇవ్వబోయారు. దీంతో దర్శకుడు బాబి చిరంజీవిని చెప్పొద్దని సైగ చేశారు. దీంతో చిరంజీవి తనని తాను కంట్రోల్ చేసుకున్నారు. ‘‘రవితేజ కాకపోతే ఆ పాత్రకు న్యాయం జరిగేది కాదు. రవితేజ వల్ల ఆ క్యారెక్టర్ ఇంకో లెవల్‌కు వెళ్లింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుసపెట్టి సినిమాలు చేస్తున్నది మేమిద్దరమే. ఇంత బిజీ టైమ్‌లో కూడా రవి డేట్ ఇచ్చాడు.