మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'గాడ్ ఫాదర్' (Godfather Movie). విజయ దశమి సందర్భంగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆల్రెడీ విడుదలైన 'థార్ మార్ తక్కర్ మార్' సాంగ్ రిలీజ్ చేశారు.
'గాడ్ ఫాదర్'లో 'నజభజ జజర... నజభజ జజర... గజగజ వణికించే గజరాజడిగోరో' అంటూ సాగే పాటను ఈ రోజు విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన 'థార్ మార్' పాటకు అన్ని వర్గాల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. సంగీత దర్శకుడు తమన్ మీద కొంత మంది ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఈ 'నజభజ జజర... నజభజ జజర' పాటకు మాత్రం ప్రశంసలు వస్తున్నాయి. ఇదీ మెగాస్టార్ రేంజ్ సాంగ్ అని కొందరు ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
'నజభజ జజర... నజభజ జజర' పాటను శ్రీకృష్ణ, పృథ్వీచంద్ర ఆలపించారు. ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు. సినిమాలో చిరంజీవి హీరోయిజం ఎలివేట్ చేసేలా ఈ పాట ఉందని నెటిజన్స్ పోస్టులు చేస్తున్నారు.
పాటల సంగతి పక్కన పెడితే... ఇటీవల 'నేను రాజకీయానికి దూరం అయ్యాను. కానీ, రాజకీయాలు నాకు దూరం కాలేదు' అంటూ ట్విట్టర్ వేదికగా చిరంజీవి విడుదల చేసిన డైలాగ్ తెలుగు రాష్ట్రాల్లో సంచనలం సృష్టించింది. సినిమాలో భాగంగా ఆ డైలాగ్ ఉన్నప్పటికీ... నిజ జీవితంలో ఆయన రాజకీయ ప్రయాణానికి కొంత మంది అన్వయించుకున్నారు. రేపు (సెప్టెంబర్ 28న) అనంతపురంలో మెగాభిమానుల సమక్షంలో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.
క్లైమాక్స్ ఫైట్... వెరీ వెరీ స్పెషల్ గురూ!
'గాడ్ ఫాదర్' కోసం చిరంజీవి ఫస్ట్ టైమ్ లుక్ చేంజ్ చేశారు. హీరోయిన్, డ్యూయెట్స్ లేకున్నా సరే... సినిమా చేశారు. అయితే... ఆయన నుంచి ప్రేక్షకుల కోరుకునే అంశాలు సినిమాలో ఉన్నాయని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ మామూలుగా ఉండదని సత్యదేవ్ అంటున్నారు. ఇక... చిరు, సల్మాన్, సత్యదేవ్ మీద తెరకెక్కించిన క్లైమాక్స్ ఫైట్ విపరీతమైన 'హై' ఇస్తుందట. మలయాళంతో పోలిస్తే... ఆ ఫైట్ డిఫరెంట్ గా తీశారట.
కథలోనూ కొన్ని మార్పులు
క్లైమాక్స్ ఫైట్ ఒక్కటే కాదు... కథ పరంగానూ 'లూసిఫర్'తో పోలిస్తే కొన్ని మార్పులు చేసి 'గాడ్ ఫాదర్' తెరకెక్కించారని యూనిట్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. కథకు ఏమాత్రం అడ్డు పడకుండా మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకుని కొన్ని కమర్షియల్ అంశాలు యాడ్ చేశారట.
Also Read : చిరంజీవి స్థాయిని తగ్గించేలా నటించలేదు... వాళ్ళ డౌట్స్ వాళ్ళవి, నా కాన్ఫిడెన్స్ నాది - సత్యదేవ్ ఇంటర్వ్యూ
ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహించారు. కొణిదెల సురేఖ సమర్పణలో సూపర్ గుడ్ ఫిలిమ్స్ పతాకంపై ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చిరు సోదరిగా నయనతార (Nayanthara) కనిపించనున్నారు. ఆమెకు భర్తగా ప్రతినాయకుడి పాత్రలో సత్యదేవ్ (Satyadev Kancharana), ఇతర కీలక పాత్రల్లో సునీల్, సముద్రఖని నటించారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రత్యేక పాత్రలో నటించారు. ఈ చిత్రానికి నీరవ్ షా ఛాయాగ్రాహకుడు, సురేష్ సెల్వరాజన్ కళా దర్శకుడు. తమన్ సంగీతం అందించారు.
Also Read : 'మెగా'స్టార్ మాస్ రికార్డు - 'వాల్తేరు వీరయ్య' ఓటీటీ రైట్స్ ఎంతంటే?