మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), నందమూరి బాలకృష్ణ(Balakrishna) ఇదివరకు చాలా సార్లు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ పోటీకి సిద్ధమవుతున్నారు. చిరంజీవి-బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. దానికి తగ్గట్లుగానే షూటింగ్ జరుగుతోంది. ఇందులో రవితేజ(Raviteja) కీలకపాత్రలో కనిపించనున్నారు. అలానే మరోపక్క బాలకృష్ణ సినిమా కూడా సంక్రాంతి రిలీజ్ కు రెడీ అవుతోంది. 


Chiranjeevi, Balakrishna who will back off from Pongal race: గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా కూడా సంక్రాంతికే రాబోతుందని టాక్. సంక్రాంతికి ఎక్కువ సినిమాలు విడుదల అవ్వడం సహజమే కానీ ఈసారి భారీ బడ్జెట్ సినిమాలు రంగంలోకి దిగుతున్నాయి. 'ఆదిపురుష్', వారసుడు' లాంటి సినిమాలు రేసులో ఉన్నాయి. ఇప్పుడు చిరు, బాలయ్య కూడా తోడైతే థియేటర్లు అడ్జస్ట్ చేయడం కష్టమవుతుంది. 


మరో ఇంట్రెస్టింగ్ విషయమేమిటంటే.. చిరంజీవి, బాలయ్య సినిమాలను నిర్మిస్తున్నది మైత్రి మూవీ మేకర్స్ సంస్థ. ఒకేసారి తమ బ్యానర్ నుంచి రెండు సినిమాలు రిలీజ్ చేయడం వారికి ఇష్టం లేదు కానీ ఈసారి వారి చేతుల్లో ఏమీ లేదని అంటున్నారు. చిరు, బాలయ్యల ఇద్దరూ మాట్లాడుకొని ఒకరి సినిమాను డిసెంబర్ లో, మరొకరి సినిమా సంక్రాంతికి విడుదలయ్యేలా చూసుకోవాలి. మరేం జరుగుతుందో చూడాలి!


రీషూట్ మోడ్ లో బాలయ్య సినిమా:


ఇటీవలే టర్కీలో 40 రోజుల పాటు బాలయ్య సినిమా షూటింగ్ ను నిర్వహించారు. రీసెంట్ గానే టీమ్ ఇండియాకు వచ్చింది. ఇదిలా ఉండగా.. హైదరాబాద్ లో చిత్రీకరించిన కొన్ని సన్నివేశాల రషెస్ చూసిన దర్శకుడు గోపీచంద్ కి సంతృప్తిగా అనిపించలేదట. దీంతో మళ్లీ ఆ సన్నివేశాలు రీషూట్ చేయాలని భావిస్తున్నారు. అక్టోబర్ చివరికి ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలనేది దర్శకుడి ప్లాన్. కానీ ఇప్పుడు రీషూట్ కారణంగా షూటింగ్ ఆలస్యమయ్యేలా ఉంది. దసరా సందర్భంగా సినిమా నుంచి అప్డేట్ ఉంటుందేమోనని ఫ్యాన్స్ ఆశించారు కానీ అలా జరగలేదు. కనీసం దీపావళికైనా అప్డేట్ ఇస్తారేమో చూడాలి. 


దీపావళికి చిరు సినిమా అప్డేట్:


చిరంజీవి-బాబీ సినిమాలో హీరో ఈస్ట్ గోదావరి యాసలో మాట్లాడతారట. వింటేజ్ స్టఫ్ తో కూడిన మంచి ఎంటర్టైనర్ గా సినిమా నిలుస్తుందని ఇటీవల చిరు వెల్లడించారు. ఈ సినిమాకి సంబంధించిన టైటిల్, టీజర్ ను దీపావళి సందర్భంగా రిలీజ్ చేస్తామని చెప్పారు. ఈ సినిమాలో చిరు, రవితేజ సవతి సోదరులుగా కనిపించబోతున్నారు. గతంలో ఇలాంటి కాన్సెప్ట్ తో తెలుగులో కొన్ని సినిమాలు వచ్చాయి. కానీ వాటికి భిన్నంగా ఈ సినిమా ఉంటుందట. పూర్తి మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు. తెరపై చిరంజీవి, రవితేజ మధ్య వచ్చే క్లాష్ సన్నివేశాలు సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు.  


Also Read : వసూళ్ల వేటలో 'కాంతార' దూకుడు - మూడో రోజూ రఫ్ఫాడించిన రిషబ్ శెట్టి