నయనతార నటించి, నిర్మించిన సినిమా ‘కనెక్ట్’. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల అయింది. సాధారణంగా సినిమా ప్రమోషన్లలో కనిపించని నయన్ కూడా ఈ సినిమా ప్రమోషన్లలో యాక్టివ్‌గా పాల్గొన్నారు. నయనతారకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా షేర్ అయ్యాయి. అయితే ఈ ఈవెంట్లో నయనతార వేసుకున్న దుస్తులపై బాగా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. దీనిపై ప్రముఖ గాయని, ఫెమినిస్ట్ చిన్మయి శ్రీపాద స్పందించారు.


దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లను చిన్మయి శ్రీపాద తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పెట్టారు. ‘ఈ పోస్టు కింద కామెంట్లు చూడండి. అందరూ వక్రబుద్ధి కలవారు. సంబంధిత సైట్ కామెంట్స్‌ను మోడరేట్ చేయకపోవడం మంచిది అయింది. వీరిలో ప్రమాదకరమైన వారు ఎవరో మనకు తెలుస్తుంది.’ అన్నారు.



దీనిపై మరో ఫెమినిస్ట్ స్వాతి జగదీష్ కూడా స్పందించారు. ‘నయనతార, తన భర్త, తన సెక్స్ లైఫ్, తన అవయవాలపై కామెంట్ చేసేవారి జీవితంలో ఉన్న మహిళల విషయంలో నేనెంతో జాలి పడుతున్నాను. ప్రత్యేకించి వారి జీవితంలోని ఆడ స్నేహితుల గురించి.’ అని పోస్టు కింద కామెంట్ చేశారు.



‘నాకు ఒక సెక్స్ ఎడ్యుకేషన్ పేజీ ఉంది. ఈ పేజీలో ఫేక్ అకౌంట్లతో కామెంట్లు చేస్తున్న వెధవలందరూ నా పేజీని ఫాలో అవ్వండి. ఒక మహిళని ఎలా చూడాలో మీకు తెలుస్తుంది.’ అని ఆ ఆ కామెంట్లో పేర్కొన్నారు. అయితే తన కామెంట్ ఉన్నట్లుండి పోస్టు నుంచి మాయం అయింది. దీనిపై చిన్మయి శ్రీపాద మళ్లీ స్టోరీ పెట్టారు. ట్రోల్స్ కనిపిస్తున్నాయి కానీ, ఒక సెక్స్ ఎడ్యుకేటర్ కామెంట్‌ను డిలీట్ చేశారని ఆ పేజీపై దుమ్మెత్తి పోశారు. 



దీనిపై ఆ పేజీ అడ్మిన్ చిన్మయికి వివరణ ఇచ్చారు. పోస్టులో సెక్సువల్ కామెంట్స్ ఉన్నవి ఆటోమేటిక్‌గా హైడ్ అయ్యాయని, తన కామెంట్‌లో ఆ పదాలు ఉన్నాయి కాబట్టి ఆ కామెంట్  హైడ్ అయింది కానీ, తాము ఉద్దేశపూర్వకంగా డిలీట్ చేయలేదని అన్నారు.