Celebrity Couples: పెళ్లి అంటే నూరేళ్ల పంట అంటారు. కానీ ఇద్దరి మధ్య ఆ బంధం పొసగకపోతే విడాకులు తీసుకనే వాళ్లు కూడా చాలా మందే ఉన్నారు. ఆ తర్వాత తమకు నచ్చిన వాళ్లను పెళ్లి చేసుకొని హాయిగా గడిపే వాళ్లు కోకొల్లలు. సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ఒకటికి మించి పెళ్లిళ్లు చేసుకున్న వారు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో మొదటి పెళ్లి అచ్చి రాక రెండు, మూడో పెళ్లి చేసుకున్న వారు కూడా ఉన్నారు. వారెవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 


1. మోహన్ బాబు


నటప్రపూర్ణ డాక్టర్ మంచు మోహన్ బాబు గురించి అందిరకీ తెలిసిందే. అయితే మోహన్ బాబు ముందుగా విద్యా దేవిని వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు (మంచు మనోజ్), ఓ కుమార్తె (మంచు లక్ష్మీ ప్రసన్న) ఉన్నారు. వీరిద్దరూ సినిమాల్లో నటిస్తుండేవారు. కానీ ఆమె కొంత కాలానికే చనిపోయింది. ఆ తర్వాత మోహన్ బాబు ఆమె సోదరి నిర్మలా దేవిని వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికీ ఓ కుమారుడు జన్మించాడు. ఆయనే మంచు మనోజ్. 


2. మంచు మనోజ్


మంచు మోహన్ బాబు కుమారుడు మనోజ్.. 2015 మే 20వ తేదీన ప్రణతి రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ వ్యక్తిగత కారణాల వల్ల 2019లోనే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఇటీవలే 2023 మార్చి 3వ తేదీన మనోజ్.. భూమా మౌనికా రెడ్డిని రెండో వివాహం చేసుకున్నాడు. అయితే గతంలో బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త గణేష్ రెడ్డితో భూమా నాగ మౌనికా రెడ్డి మొదటి వివాహం జరిగింది. ఆ దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. ఆ అబ్బాయి పేరు ధీరవ్ రెడ్డి. ఇప్పుడు ఆ బాబు బాధ్యతను కూడా మనోజ్ తీసుకున్నట్లు తెలుస్తోంది. మనోజ్.. ధీరవ్ తమ కొడుకు అని చెబుతున్నాడు. 


3. నరేష్


దివంగత విజయ నిర్మల కుమారుడు, సీనియర్ హీరో నరేష్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఇతనికి ఇప్పటికే మూడు సార్లు వివాహం జరిగింది. మొదట సీనియర్ కెమెరామెన్ శ్రీను కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. వీరికి నవీన్ విజయ కృష్న అనే బాబు జన్మించాడు. ఆ తర్వాత మనస్ఫర్ధల కారణంగా విడిపోయారు. ప్రముఖ రచయిత దేవులపల్లి కృష్మ శాస్తిర మనవరాలు రేఖా సుప్రియాను రెండో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి కూడా ఓ బాబు పుట్టగా విడిపోయారు. 50 ఏళ్ల వయస్సులో ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుడు అయిన రఘు వీరారెడ్డి సోదరుడి కుమార్తె రమ్యను 2010 డిసెంబరు 3న హిందూపురంలో వివాహం చేసుకున్నాడు. 2012లో ఈ దంపతులకు రణఅ వీర్ అనే బాబు పుట్టాడు. ఆ తర్వాత వీరిద్దరికీ గొడవలు రావడంతో నరేష్.. రమ్యకు విడాకుల నోటీస్ పంపించాడు. ఇక ఆ తర్వాత నటి పవిత్రా లోకేష్ తో ప్రేమాయణం నడుపుతూ, కలిసి తిరుగుతూ హ్యాపీగా గడిపేస్తున్నారు. 


4. ఆశిష్ విద్యార్థి


అనేక బాలీవుడ్, టాలీవుడ్ చిత్రాలలో ప్రతినాయక పాత్రలు పోషించిన ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్థి 60 ఏళ్ల వయస్సులో రెండో వివాహం చేసుకున్నారు. అస్సాంకు చెందిన ఫ్యాషన్ ఎంటర్‌ప్రెన్యూర్ రూపాలి బరువాతో  మే 25వ తేదీన ఆశిష్ విద్యార్థి ఏడు అడుగులు వేశారు. అయితే గతంలో ఆశిష్.. నటి రాజోషి విద్యార్థిని వివాహం చేసుకున్నారు. రాజోషి నటి, గాయని, థియేటర్ ఆర్టిస్ట్. వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. దీంతో ఆశిష్ విద్యార్థి రెండో విద్యార్థి రెండో వివాహం చేసుకున్నాడు.


5. పవన్ కల్యాణ్


పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 1997లో పవన్ కల్యాణ్ నందినిని పెళ్లి చేసుకున్నారు. కానీ కొంత కాలానికే వీరిద్దరి మధ్య గొడవలు రావడంతో 2007లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నటి రేణూ దేశాయ్ ను పవన్ కల్యాణ్ ప్రేమించి 2009లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. అకీరా నందన్, ఆద్య. అయితే 20012లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2013లో పవన్ కల్యాణ్ అన్నా లెజినోవాను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు పుట్టారు. పాప పొలెనా అంజనా పవనోవా, తనయుడు మార్క్ శంకర్ పవనోవిచ్. 


6. నందమూరి హరికృష్ణ


అలనాటి అగ్రనటుడు ఎన్టీఆర్ కుమారుడు నందమూరి హరికృష్ణకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే 1973లో ఆయన లక్ష్మీ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి జానకి రామ్, కల్యాణ్ రామ్ పుట్టగా.. 2014లో జానకి రామ్ మరణించాడు. ఆ తర్వాత అంటే 1983లో హరికృష్ణ షాలినీ భాస్కర్ ను వివాహం చేసుకోగా.. జూనియర్ ఎన్టీఆర్ జన్మించారు. 


7. ప్రకాష్ రాజ్


హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా, రంగస్థల నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న ప్రకాశ్ రాజ్ గురించి ప్రతీ ఒక్కరికీ తెలిసిందే. అయితే డిస్కో శాంతి సోదరి లలిత కుమారిని ప్రకాష్ రాజ్ ముందుగా పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు అమ్మాయిలు, ఓ అబ్బాయి పుట్టారు. 2004లో అబ్బాయి చనిపోయాడు. అయితే ఆ తర్వాత ఈ దంపతులు విడాకులు తీసుకున్నారు. 2010లో బాలీవుడ్ నాట్య కారిణి పోనీ వర్మను ప్రేమించి రెండో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఓ బాబు పుట్టాడు. 


8. సీనియర్ ఎన్టీఆర్


అలనాటి సీనియర్ హీరో, మాజీ సీఎం నందమూరి తారక రామారావు గురించి అందరికీ తెలిసిందే. అయితే 1942లో ఈయన బసవ రామ తారకంను పెళ్లి చేసుకున్నారు. వీరికి 11 మంది పిల్లలు పుట్టారు. చాలా కాలం హాయిగా కాపురం చేశారు. కానీ 1985లో బసవతారకం చనిపోయారు. ఆ తర్వాత కొన్నేళ్లు ఒంటరిగా ఉన్న ఎన్టీఆర్.. 1993లో లక్ష్మీ పార్వతిని రెండో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి పిల్లలు పుట్టలేదు. 1996 జనవరి 18వ తేదీన సీనియర్ ఎన్టీఆర్ మరణించారు. 


9. దిల్ రాజు


టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజు మంచి పేరునే సంపాదించుకున్నారు. అయితే ముందుగా ఈయన అనిత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. వీరికి హన్షిత అనే కూతురు కూడా పుట్టింది. కానీ 2017లో అనిత హఠాత్తుగా గుండెపోటుకు గురై చనిపోయింది. తర్వాత మూడేళ్లకు అంటే 2020 లాక్‌డౌన్‌ సమయంలో దిల్ రాజు నిజామాబాద్‌లోని ఓ గుడిలో వైగారెడ్డిని (తేజస్విని) రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి 2022 జూన్ 29న మ‌గ‌బిడ్డ‌ జన్మించాడు.


Also read : రోజూ రాత్రిపూట ఇలా జరుగుతోందా? జాగ్రత్త, క్యాన్సర్ కావచ్చు - డాక్టర్‌ను సంప్రదించండి


Join Us on Telegram: https://t.me/abpdesamofficial