కామెడీ హీరో సంపూర్ణేష్ బాబు కథానాయకుడిగా వస్తున్న సినిమా ‘కాలీఫ్లవర్’. చాలా నెలలుగా సినిమా వాయిదా పడుతూ వస్తోంది. నవంబర్ 26 విడుదల కాబోతోంది. ఇందులో బర్నింగ్ స్టార్ కాలీ ఫ్లవర్ పేరుతో నవ్వించేలా నటించాడు. నెత్తిమీద పిలకతో కాలీఫ్లవర్ లానే కనిపిస్తున్నాడు. మగాడి శీల రక్షణే తన ధ్యేయమని, మగాళ్ల శీల రక్షణ కోసం చట్టం రావాలన్నదే తన పోరాటమంటూ నవ్వించే డైలాగులతో సాగింది టీజర్. మంగళవారం ఉదయం ఈ టీజర్ ను విడుదల చేశారు. ‘ఆకాశ వాణి కెమెరా పెట్టు... నా ఘోషేంటో ఈ ప్రపంచానికి తెలియాలి’ అన్న డైలాగ్ తో టీజర్ మొదలైంది. ‘ఎనీ టైమ్ శీలాన్నే కాపాడే సింబలేరా ఈ కాలీ ఫ్లవర్’ అంటూ తనదైన శైలిలో రెచ్చిపోయాడు సంపూ. ఈ సినిమా ఉపశీర్షిక కూడా ‘శీలో రక్షతి రక్షిత:’. 


ఈ సినిమాను ఆర్కే మలినేని తెరకెక్కించారు. ఆశా జ్యోతి గోగినేని నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వాసంతి హీరోయిన్ గా నటిస్తోంది.  పోసాని కృష్ణమురళి, పృథ్వీ కీలక పాత్రల్లో  నటిస్తున్నారు. ఈ   సినిమాని ఈనెల 26న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. సినిమా ఆద్యంతం ప్రేక్షకులను నవ్విస్తుందని చెబుతున్నారు మూవీ మేకర్స్.









Also Read: పవన్ కల్యాణ్ సినిమా వెనక్కి వెళ్లడం లేదు... సంక్రాంతి బరిలోనే 'భీమ్లా నాయక్'
Also Read: లాయర్లతో రవితేజ మంతనాలు... సెక్షన్ల గురించి ఆరా తీస్తున్న మాస్ మహారాజ్
Also Read: అనుష్క స్లిమ్ గా ఎలా మారిందో తెలుసా..? ఇదిగో ఆమె డైట్ సీక్రెట్..
Also Read: 'ఆర్ఆర్ఆర్', 'రాధే శ్యామ్'కు దారిస్తూ... వెనక్కి వెళ్లిన 'గంగూబాయి  కథియవాడి'
Also Read: విజేతగా నిలిచేది ఒక్కడే... ఆ ఒక్కడు నువ్వే ఎందుకు అవ్వాలి?... చెర్రీ వాయిస్‌తో అదిరిపోయిన గని టీజర్
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి