బిగ్ బాస్ ఇంట్లో కెప్టెన్సీ టాస్క్ మొదలైపోయింది. ఇప్పటి వరకు కూడా ఆట మీద ఎక్కువ ఫోకస్ పెట్టని వాళ్ళు కూడా ఈసారి తమ సత్తా ఎంతో నిరూపించుకుంటున్నారు. ఈ వారం కెప్టెన్ అయ్యేందుకు ఇంటి సభ్యులు తమవంతుగా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. కెప్టెన్సీ కి పోటీదారులు బిగ్ బాస్ వస్తా.. నీ వెనుక అనే టాస్క్ ఇచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమోని వదిలారు. ఎప్పుడు శాంతంగా ఉండే రోహిత్ కి బాగా కోపం వచ్చేసింది. ఈ టాస్క్ కి రేవంత్ సంచాలక్ గా వ్యవహరించాడు.
తాజా ప్రోమో ప్రకారం.. కెప్టెన్సీ కంటెండర్లుగా కీర్తి, ఫైమా, శ్రీసత్య, రోహిత్, ఆదిరెడ్డి, మేరీనా నిలిచినట్టు తెలుస్తోంది. వారికి ఇచ్చిన టాస్ ప్రకారం మూడు భాగాలుగా ఉన్న సర్కిల్ లో తిరుగుతూ తమ భుజాల మీద ఉన్న పేపర్ బాల్స్ బస్తాలని పట్టుకుని కాపాడుకోవాలి. ఒకదాని తర్వాత ఒక సర్కిల్ లో తిరుగుతూ తమ బ్యాగ్స్ ని కాపాడుకోవాలి. అలా రెండో సర్కిల్ తిరిగే సమయానికి మేరీనా, కీర్తి అవుట్ అయిపోయినట్లు తెలుస్తోంది. తర్వాత రింగ్ లో రోహిత్, ఆదిరెడ్డి, ఫైమా, శ్రీసత్య పోటీపడ్డారు.
ఫైమా రోహిత్ బాడీ ని టచ్ చేయడంతో అలా చేయవద్దని రోహిత్ చెప్పాడు. మధ్యలో రాజశేఖర్ కల్పించుకునేసరికి రోహిత్ సీరియస్ అయ్యాడు. తర్వాత పోటీదారులు తమ బస్తాలు పట్టుకోకూడదని బిగ్ బాస్ చెప్పాడు. ఫైమా బ్యాగ్ చించేయడానికి ఆదిరెడ్డి, రోహిత్ చాలా స్ట్రగుల్ అయ్యారు. వాళ్ళిద్దరినీ ఫైమా అడ్డుకునేందుకు చాలా ట్రై చేసింది కానీ తన బస్తాలోనివన్నీ కిందపోయాయి. ఆదిరెడ్డి తన బ్యాగ్ పట్టుకుంటూనే రోహిత్ బ్యాగ్ చింపడానికి ట్రై చేశాడు. బ్యాగ్ పట్టుకోకూడదు కదా అని రోహిత్ గట్టిగా అరుస్తున్నా రేవంత్ పట్టించుకోడు. దీంతో మేరీనా కల్పించుకుని ప్రేక్షకులు చూస్తున్నారు వదిలేయ్ అని కూల్ చేసేందుకు చూస్తుంది. ఏం జరిగిందో ఏమో మరి రోహిత్ కి బాగా కోపం వచ్చేసి తన బ్యాగ్ ని కాలితో తన్నేసి అరుస్తాడు.
ఆదిరెడ్డి వర్సెస్ రేవంత్
రేవంత్ ‘నేను ఫిజికల్ అవ్వకుండా అయినట్టు ఆరోపణలు వేశారు కాబట్టి ఎవరిదైనా చిన్న గోరు తగిలినా నేను ఫిజికల్ అవుతా’ అన్నాడు. దానికి ఆదిరెడ్డి ‘గోరు తగిలినా ఫిజికల్ అవుతా అంటున్నాడు...రెజ్లింగా?’ అని అరిచాడు. దానికి రేవంత్ ‘నామినేషన్ కారణాలు వెతుక్కో... ఆ పనిలో ఉండు’ అన్నాడు. దానికి ఆదిరెడ్డి ‘నామినేషన్ వేయడానికి నీ విషయంలో కారణాలు వెతుక్కోపనిలేదు, నువ్వు అరగంటకొకటి ఇస్తావ్, ఏసుకో నువ్వు నామినేషన్ వేసుకుంటావో, ఏం వేసుకుంటావో వేసుకో, ఐ డోంట్ కేర్. నేను నీట్‌గా ఆడతా, ఫిజికల్ అవ్వను’ అన్నాడు. మరి ఈ రోజు ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూడాలి.
ఈ వారం నామినేషన్లలో ఉన్న సభ్యులు వీళ్లే
1. బాలాదిత్య
2. మెరీనా
3. ఫైమా
4. వాసంతి
5. కీర్తి
6. ఇనాయ
7. శ్రీహాన్
8.ఆదిరెడ్డి
9. రేవంత్
Also read: ఇచ్చిందే ఫిజికల్ టాస్కు, ఇక ఫిజికల్ అవ్వకుండా ఎలా ఉంటారు?