Bigg Boss 6 Telugu: గీతూ వెళ్లిపోతే బిగ్‌బాస్ సీజన్ 6 ఇక ఏముంటుందిలే అనుకున్నారు చాలా మంది. కానీ ఆమె లేకపోయినా ఆట బాగానే సాగుతోంది. ఫిజికల్ టాస్కుల్లో మిగతా ఇంటిసభ్యులు ఇరగదీస్తున్నారు. నేటి ప్రోమోలో ఇనాయ, శ్రీసత్య ఏడుస్తూ కనిపించారు. శ్రీసత్య ఎందుకు ఏడ్చిందో తెలియదు కానీ ఇనాయ మాత్రం కెప్టెన్సీ కంటెండర్ల రేసు నుంచి తప్పుకున్నందుకు ఏడ్చింది. ఇనాయ తండ్రితో మాట్లాడుతూ కెప్టెన్ కంటెండర్ కూడా కాలేక పోయాను. కెప్టెన్సీ పోటీదారులు అయ్యేందుకు రెండో లెవెల్ పోటీ పెట్టారు బిగ్ బాస్. ఆ టాస్కు పేరు ‘నాగమణి’. ఇందులో భాగంగా నలుగురు సభ్యులు నాగమణులను కాపాడుతుంటే, నలుగురు సభ్యులు వాటిని వారి నుంచి లాక్కుని తమ దగ్గర పెట్టుకోవాలి. రేవంత్, బాలాదిత్య, రాజశేఖర్, మెరీనా, కీర్తి, ఆదిరెడ్డి, శ్రీహాన్, శ్రీసత్య, ఫైమా ఈ ఆటలో కనిపించారు. నాగమణులు ఉన్న ట్రేను రేవంత్, రాజశేఖర్, మెరీనా కాపాడుతూ కనిపించారు.
వారి నుంచి నాగమణులను లాగేసేందుకు మిగతా టీమ్ వాళ్లు ప్రయత్నించారు. ఆ ట్రేల్లోంచి నాగమణులను దొంగిలించడం మొదలుపెట్టారు. రేవంత్ వచ్చిన వాళ్లని తోసేయడంతో కీర్తి, ఆదిరెడ్డి చాలా సీరియస్ అయిపోయారు. మీరు తోసేయకండి, ఫిజికల్ అవ్వకండి అంటూ అరవడం మొదలుపెట్టారు. అంటే వాళ్లు నాగమణులను దొంగలిస్తుంటే చూస్తూ ఊరుకోమనా? నిజానికి బిగ్బాస్ ఇచ్చిందే ఫిజికల్ టాస్కు. ఇక ఫిజికల్ అవ్వకుండా ఎలా ఉంటారు?
రేవంత్, కీర్తి తిట్టుకుంటూ, కసురుకుంటూ కనిపించారు. రేవంత్ ఫిజికల్ గా ఆడడం చేతకాక ఇలా ప్రతిసారి ఫిజికల్ అవ్వకు అని నన్ను అంటున్నారు అని అరిచాడు. దమ్ముంటే ఆడండి అంటూ సవాలు చేశాడు. ఇక ఈ టాస్కు ముగిసే సమయానికి నిచ్చెన టీమ్ గెలిచినట్టు తెలుస్తోంది. కెప్టెన్సీ కంటెండర్లుగా రేవంత్, మెరీనా, శ్రీసత్య, బాలాదిత్య, రాజశేఖర్ ఉన్నట్టు సమాచారం. వీరికి కెప్టెన్సీ పోటీ పెట్టబోతున్నారు బిగ్ బాస్. ఈ వారం ఇంటి కెప్టెన్ ఎవరవుతారో చూడాలి.
ఈ వారం నామినేషన్లలో ఉన్న సభ్యులు ఎవరంటే...
1. బాలాదిత్య
2. మెరీనా
3. ఫైమా
4. వాసంతి
5. కీర్తి
6. ఇనాయ
7. శ్రీహాన్
8.ఆదిరెడ్డి
9. రేవంత్