న్యాచురల్ స్టార్ నాని, నటి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన సినిమా ‘దసరా’. ఈ మూవీకి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, పాటలు, టీజర్ లు ఆకట్టుకుంటున్నాయి. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీలో హీరో నాని సరికొత్త లుక్ లో కనిపించనున్నారు. అలాగే మూవీలో కీర్తి సురేష్ కూడా ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ మార్చి 30 న పాన్ ఇండియా మూవీగా విడుదల చేయనున్నారు మేకర్స్. ప్రస్తుతం మూవీ టీమ్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది. తాజాగా యాంకర్ సుమతో కలసి హీరో నాని, కీర్తి సురేష్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలో యాంకర్ సుమ తెలంగాణ యాస గురించి కీర్తి సురేష్ ను ఓ ప్రశ్న అడిగింది. దానికి కీర్తి ఇచ్చిన సమాధానం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. అంతేకాదు, పొలిటికల్‌గా కూడా ఆమె వ్యాఖ్యలను వాడేసుకుంటున్నారు.


ఇటీవల ‘దసరా’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా యాంకర్ సుమతో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు హీరో నాని, కీర్తి సురేష్. ఈ సందర్భంగా యాంకర్ సుమ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు నాని, కీర్తి. ఈ నేపథ్యంలో తెలంగాణ యాస గురించి సుమ కీర్తిను ఓ ప్రశ్న అడిగింది. సాధారణంగా తెలంగాణ యాస అంటే కొంచెం స్పైసీ గా ఉంటుంది. అది తెలుగు వాళ్లకే కొంచెం కష్టంగా ఉంటుంది. మరి ఈ సినిమా కోసం ఆ యాసను ఎలా నేర్చేకున్నావ్ అని కీర్తిను అడిగింది సుమ. దానికి కీర్తి సమాధానం చెబుతూ.. తనకు మామూలుగా స్పైస్ టోలరంట్స్ అంటే ఇష్టమే అని, అందుకే తాను నేర్చుకున్నానని అన్నారు. అయినా తానేమీ గుజరాత్ నుంచి రాలేదని, చెన్నై నుంచే వచ్చానని అందుకే తనకేమీ అదంత కష్టంగా అనిపించలేదని చెప్పింది. 


ఆమె ఫ్లోలో చెప్పిన ఆ మాటలను రాజకీయ నేతలు వాడేసుకుంటున్నారు. తెలంగాణకు చెందిన ఓ బీఆర్ఎస్ పార్టీ మహిళా నేత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దానితో పాటు ఓ నోట్ ను కూడా రాసుకొచ్చారు. అదేంటంటే.. ‘‘గుజరాత్ నుంచి వచ్చిన వాళ్లకు మా తెలంగాణ యాస అర్థం కాదని కళ్లు తెరిపించేలా చెప్పావు తల్లీ’’ అంటూ రాసుకొచ్చారు. దీంతో కీర్తి వ్యాఖ్యలు అటు రాజకీయంగానూ ఇటు ఇండస్ట్రీలోనూ చర్చనీయంశమవుతున్నట్లే కనిపిస్తోంది. అయితే ఆ మహిళా నేత చేసిన వ్యాఖ్యలపై ఏ పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.


Read Also: ‘స్వీటెస్ట్ బ్రదర్’ అంటూ చెర్రీకి మంచు మనోజ్ బర్త్‌డే విసెష్, విష్ణును ట్రోల్ చేస్తున్న నెటిజన్స్