నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. నిజానికి ఈపాటికే సినిమా షూటింగ్ పూర్తి చేసి ఫస్ట్ కాపీ రెడీగా పెట్టుకోవాలి కానీ ఇంకా కొంత వర్క్ బ్యాలెన్స్ ఉంది. ఈ సినిమాకి సంబంధించిన షెడ్యూల్స్ అన్నీ కూడా కరెక్ట్ గానే జరిగాయి. కానీ ఫైనల్ షెడ్యూల్ మాత్రం బ్రేకులతో ముందుకు సాగడం లేదు. ఫైనల్ షెడ్యూల్ కోసం సెప్టెంబర్ లో కొన్ని, అక్టోబర్ లో మరికొన్ని కాల్షీట్స్ ఇచ్చారు బాలయ్య. 


కానీ అదే సమయంలో బాలయ్య 'అన్ స్టాపబుల్' షూటింగ్ లో పాల్గొనాల్సి వచ్చింది. దీంతో 'వీరసింహారెడ్డి'కి బ్రేక్ పడింది. ఆ తరువాత బాలయ్య ఓ కన్స్ట్రక్షన్ కంపెనీ కమర్షియల్ యాడ్ లో నటించడం కోసం మరో నాలుగైదు రోజులు తీసుకున్నారు. 'అన్ స్టాపబుల్' ప్రోమో కోసం కూడా మధ్యలో కొన్ని డేట్స్ ఇచ్చారు. ఇలా 'ఆహా' కోసం కొన్ని రోజులు, యాడ్ షూట్ కోసం మరికొన్ని రోజులు కేటాయించడంతో 'వీరసింహారెడ్డి' షూటింగ్ కి బ్రేక్ పడింది. 


మరో రెండు, మూడు రోజుల్లో ఈ సినిమాకి సంబంధించిన ఫైనల్ షెడ్యూల్ మొదలుపెట్టి వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. నవంబర్ ఎండింగ్ కి షూటింగ్ పూర్తి చేసి.. డిసెంబర్ లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరపడానికి టీమ్ ప్లాన్ చేసుకుంది. నవంబర్ నుంచి భారీ ఎత్తున ప్రమోషన్స్ మొదలుపెట్టాలని చూస్తుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. దీంతో పాటు మరో మూడు సినిమాలు పోటీ పడబోతున్నాయి. 


ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. దునియా విజయ్ విలన్ రోల్ పోషిస్తున్నారు. ఇంకా లాల్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావు తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.


మలయాళ భామ హానీ రోజ్ ఓ పాత్రలో కనిపించనుంది. తన క్యారెక్టర్ టిపికల్ తెలుగు సినిమా హీరోయిన్ తరహాలో ఉంటుందని ఆమె పేర్కొన్నారు. 'చీకటి గదిలో చితకొట్టుడు' ఫేమ్ చంద్రికా రవి ఈ సినిమాలో ప్రత్యేక గీతంలో స్టెప్పులు వేశారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. 


తాజాగా మరో సినిమా ఓకే చేశారు బాలయ్య. అనిల్ రావిపూడి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ పతాకంపై సినిమా రూపొందుతోంది. దీనికి హరీష్ పెద్ది, సాహూ గారపాటి నిర్మాతలు. హీరోగా బాలకృష్ణకు 108వ సినిమా ఇది (NBK 108 Movie). ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించడానికి సిద్ధమవుతున్నారు. దాదాపు రూ.80 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించబోతున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి కెరీర్ లో ఇంత బడ్జెట్ తో సినిమా తీయడం ఇదే మొదటిసారి. సినిమా బడ్జెట్ కి తగ్గట్లే బాలయ్య భారీ రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారని సమాచారం. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాకి బాలయ్యకు రూ.25 కోట్లు పారితోషికంగా ఇస్తున్నారట. 


Also Read : మెగాస్టార్ కోసం కదిలొచ్చిన కాలేజ్ - ఆరు వేల మంది విద్యార్థులతో చిరు 'వాల్తేర్ వీరయ్య' లుక్