బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా 'బ్రహ్మాస్త్ర'. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రణబీర్ కపూర్, అలియాభట్ జంటగా నటించారు. పాన్ ఇండియా లెవెల్ లో సినిమాను విడుదల చేయనున్నారు. తెలుగులో ఈ సినిమాను 'బ్రహ్మాస్త్రం' పేరుతో విడుదల కానుంది. సెప్టెంబర్ 9న రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. పెళ్లి తరువాత అలియా-రణబీర్ జంట నుంచి విడుదల కాబోయే సినిమా ఇదే.
'బ్రహ్మాస్త్ర'లో బిగ్ బి అమితాబ్ బచ్చన్, కింగ్ నాగార్జున అక్కినేని, మౌనీ రాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రీతం ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు. ఈ చిత్రాన్ని దక్షిణాది భాషల్లో దర్శక ధీరుడు రాజమౌళి సమర్పిస్తున్నారు. ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ కోసం బాగా ఖర్చు పెట్టారు. ప్రచారం కూడా ముమ్మరంగా చేస్తున్నారు.

సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ రాజమౌళి రేంజ్ లో లేవు కానీ ట్రెండ్ చూస్తుంటే మాత్రం మంచి ఫిగర్స్ నమోదయ్యేలానే ఉన్నాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఇప్పటివరకు 40 శాతం అక్యుపెన్సీతో 50 వేలకు పైగా టికెట్స్ అమ్ముడైనట్లు తెలుస్తోంది. సుమారు రూ.400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా అంత రెవెన్యూ రాబడుతుందా..? అనే విషయం చర్చనీయాంశంగా మారింది. హిట్ టాక్ వస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ టాక్ ఏమాత్రం తేడా వచ్చినా ఇబ్బందులు తప్పవు.
అసలే ఈ మధ్య ఉత్తరాది ఆడియన్స్ సినిమాల విషయంలో కొత్తదనం కోరుకుంటున్నారు. కంటెంట్ వీక్ గా ఉంటే సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రూ.400 కోట్లు అనేది చిన్న విషయం కాదు. రణబీర్ కపూర్, అలియా భట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున లాంటి భారీ క్యాస్టింగ్ ఉన్నా.. మేకర్స్ కి టెన్షన్ మాత్రం తప్పడం లేదు.
దక్షిణాదిలో బుకింగ్స్:
తెలంగాణలోని హైదరాబాద్, కర్ణాటకలోని బెంగళూరు వంటి నగరాల్లో కూడా 'బ్రహ్మాస్త్ర' బుకింగ్స్ బావున్నాయి. దక్షిణాదిలో విపరీతంగా ప్రచారం చేయడం కూడా ప్లస్ అయ్యింది. హైదరాబాద్‌లోని కొన్ని మల్టీప్లెక్స్‌లలో త్రీడీ సినిమా టికెట్ రేటు 300 వందలు పెట్టినప్పటికీ... కొందరు ప్రేక్షకులు బుక్ చేసుకుంటున్నారు. సినిమా హిట్ అయితే ఫస్ట్ డే కలెక్షన్స్ భారీగా నమోదు చేసే అవకాశం ఉంది.

'బ్రహ్మాస్త్ర'కు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. బాలీవుడ్‌లో కొత్త పెళ్లి జంట రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన తొలి చిత్రమిది. అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీ రాయ్ కీలక పాత్రలు పోషించారు.