ఈ రోజు ఉపాధ్యాయ దినోత్సవం. ఈ సందర్భంగా యూజీసీ ఐదు ఫెలోషిప్‌లు, రీసెర్చ్ గ్రాంట్లు, ఒంటరి ఆడపిల్లలకు, రిటైర్డ్ ఫ్యాకల్టీ సభ్యులకు కూడా అందిస్తుందని,అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ఉన్నత విద్యా సంస్థలకు ప్రయోజనం చేకూర్చేవిధంగా అనేక పరిశోధన పథకాలను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రకటిస్తోందని చైర్మన్ జగదీష్ కుమార్ తెలిపారు.ఈ కార్యక్రమం ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు యూజీసీ ట్విట్టర్, యూట్యూబ్ చానెళ్లలో లైవ్ వెబ్ క్యాస్ట్ కానుంది.


మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ప్రారంభించనున్న ఐదు పథకాలు-


➥ ఇన్-సర్వీస్ ఫ్యాకల్టీ సభ్యుల కోసం రీసెర్చ్ గ్రాంట్
➥ కొత్తగా రిక్రూట్ చేయబడిన ఫ్యాకల్టీ సభ్యుల కోసం డాక్టర్ డీఎస్ కొఠారీ రీసెర్చ్ గ్రాంట్
➥ సూపర్‌యాన్యుయేటెడ్ ఫ్యాకల్టీ సభ్యులకు ఫెలోషిప్
➥ డాక్టర్ రాధాకృష్ణన్ యూజీసీ పోస్ట్-డాక్టోరల్ ఫెలోషిప్
➥ ఒంటరి ఆడపిల్ల కోసం సావిత్రీబాయి జ్యోతిరావు ఫూలే ఫెలోషిప్


ఐదు ఫెలోషిప్‌లు, రీసెర్చ్ గ్రాంట్ల వివరాలు..

1. ఇన్ సర్వీస్ ఫ్యాకల్టీ రీసెర్చ్ గ్రాంట్:
ఈ స్కీమ్ ద్వారా ఫ్యాకల్టీ మెంబర్లుగా అపాయింట్ అయిన వారికి పరిశోధనలపై అవకాశం ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా 200 మంది ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్లపాటు రూ.10 లక్షల సహకారం అందుతుంది.


2. డాక్టర్ డీఎస్ కొఠారీ రీసెర్చ్ గ్రాంట్:
కొత్తగా రిక్రూట్ చేయబడిన సైన్స్, మెడిసిన్, ఇంజినీరింగ్ విభాగాలకు చెందిన ఫ్యాకల్టీలకు పరిశోధన అవకాశాలను కల్పించే లక్ష్యంతో యూజీసీ ఈ స్కీమ్ ప్రవేశ పెడుతున్నది. దీని ద్వారా 132 మంది ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్లపాటు రూ.10 లక్షల సహకారం అందుతుంది.


3. ఫెలోషిప్ ఫర్ సూపర్‌యాన్యుయేటెడ్ ఫ్యాకల్టీ మెంబర్స్:
పదవీ విరమణ చేసిన తర్వాత కూడా బోధనలో, పరిశోధనలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న ఉపాధ్యాయులకు పరిశోధన అవకాశాలను కల్పించే లక్ష్యంతో యూజీసీ ఈ స్కీమ్ ప్రవేశ పెడుతున్నది. దీనికి 100 సీట్లు అందుబాటులో ఉంటాయి. ఈ ఫెలోషిప్‌కు ఎంపికైన వారికి నెలకు రూ.50 వేలు, ఏడాదికి రూ.50 వేల చొప్పున మూడేళ్లు అందిస్తారు. 


4. డాక్టర్ రాధాకృష్ణన్ యూజీసీ పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్:
ఈ స్కీమ్ కింద 900 మంది అభ్యర్థులకు భారతీయ విశ్వవిద్యాలయాలు మరియు సంస్థలలోని భాషలతో సహా సైన్సెస్, ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ, హ్యుమానిటీస్ మరియు సోషల్ సైన్సెస్‌లో అధునాతన అధ్యయనాలు మరియు పరిశోధనలను నిర్వహించడానికి అవకాశాన్ని అందిస్తుంది. అయితే, ఇందులో 30 శాతం మహిళా అభ్యర్థులకు మాత్రమే రిజర్వ్ చేసి ఉంచింది. ఈ ఫెలోషిప్‌నకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.50వేలు, ఏడాదికి రూ.50 వేల చొప్పున మూడేళ్లు అందిస్తారు. 


5. సింగిల్ గర్ల్ చైల్డ్‌ కోసం సావిత్రిబాయి జోతిరావ్ ఫూలే ఫెలోషిప్:
ఈ ఫెలో షిప్ ఎంతమందికి అందించాలనే నిబంధన ఏమీ లేదు. సింగిల్ గర్ల్స్‌ను ఎంకరేజ్ చేయడానికి యూజీసీ ఈ స్కీం ప్రవేశ పెడుతున్నది. వారు తమ చదువులు, పరిశోధనలు కొనసాగించి అంతిమంగా అవి వారి పీహెచ్‌డీకి ఉపయోగపడేలా చేయాలని యోచిస్తున్నది.


 






 


 


Also Read:



హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 2022 -23 ఏడాదికి వివిధ సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్ ప్రవేశాలకు ఆన్‌‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. దీనిద్వారా మొత్తం 42 కోర్సుల్లో పీహెచ్‌డీ ప్రవేశాలు కల్పించనున్నారు. మొత్తం 281 సీట్లలో ప్రవేశాలు కల్పించనున్నారు. వీటిలో జనరల్ అభ్యర్థులకు 99 సీట్లు, ఎస్సీ అభ్యర్థులకు 43 సీట్లు, ఎస్టీ అభ్యర్థులకు 21 సీట్లు, ఓబీసీ అభ్యర్థులకు 76 సీట్లు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 28 సీట్లు, దివ్యాంగులకు 14 సీట్లు కేటాయించారు. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..