కావ్య, రాజ్ మధ్య కలహాలు పోవాలంటే మౌనవ్రతం పూజ చేయాలని పంతులు ఇద్దరికీ మూడోసారి ముచ్చటగా బ్రహ్మముడి వేస్తాడు. ఇద్దరూ ఒక రోజంతా ఇంట్లో ఎవరితో మాట్లాడకుండా ఉండాలని చెప్తాడు. సూర్యాస్తమయం తర్వాత పూజ ముగిసిందని కానీ తెల్లారే వరకు కలిసే ఉండాలని బ్రహ్మముడి విప్పకూడదని ఫిట్టింగ్ పెడతాడు. దీంతో రాజ్ నిద్ర వస్తున్నా అపుకొని కూర్చుంటాడు. ఇంద్రాదేవి రాజ్ నిద్ర రావడం లేదా అంటుంది. వస్తుంది కానీ నేను గదిలోకి వెళ్తే కళావతి కూడా వస్తుందని చెప్తాడు. వస్తే ఏమైంది తనని కూడా గదిలోకి తీసుకెళ్ళి ఇద్దరూ కలిసే పడుకోమని చెప్తుంది. కానీ అందుకు అపర్ణ అంగీకరించదు. రాజ్ తనని భార్యగా అంగీకరించలేదు అలాంటప్పుడు ఆ అమ్మాయి గదిలో కలిసి ఎలా ఉంటుందని కోపంగా అంటుంది.


అపర్ణ మాటలకు శుభాష్ అడ్డు పడతాడు. ఇలా చేస్తే నేను కూడా నిన్ను భార్యగా యాక్సెప్ట్ చేయనని శుభాష్ సీరియస్ అవుతాడు. భార్యాభర్తలను విడదీసే హక్కు ఎవరికీ లేదని ఇద్దరూ కలిసి ఒకే గదిలో ఉండాలని సీతారామయ్య తేల్చి చెప్తాడు. దీంతో రాజ్ చేసేది లేక కావ్యని రమ్మంటాడు.


Also Read: నందు ముందే లాస్య చెంపలు వాయించేసిన తులసి- నిజం చెప్పమని ప్రియని నిలదీసిన దివ్య


సోమవారం నాటి ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..


స్వప్న రాహుల్ ని కలిసేందుకు కేఫ్ కి వస్తుంది. అప్పు, కళ్యాణ్ దూరం నుంచి గమనిస్తూ వీడియో తీస్తారు. తనకి ఇంట్లో పెళ్లి చేయాలని చూస్తున్నారని వెంటనే ఇంట్లో విషయం చెప్పి తనని పెళ్లి చేసుకోవాల్సిందిగా స్వప్న పట్టుబడుతుంది. కానీ రాహుల్ మాత్రం త్వరగా చేసుకుంటే నాకు పట్టిన దరిద్రం వదిలిందని అనుకుంటాడు. పైకి మాత్రం ఇంట్లో ఒప్పించేందుకు కాస్త టైమ్ కావాలని ఓపిక పట్టమని మరోసారి మాయ మాటలు చెప్తాడు. ఇంకోసారి ఇలా కలవడానికి రమ్మని పిలవొద్దని చెప్తాడు. ఈసారి మనం పెళ్లి పీటల మీదే నేను పెళ్లి కొడుకుగా, నువ్వు పెళ్లి కూతురుగా కలుసుకుందామని బురిడీ కొట్టిస్తాడు. ఆ మాటలు నిజమని నమ్మిన స్వప్న తెగ సిగ్గుపడిపోతుంది.


Also Read: మురారీ గురించి నిజం తెలుసుకున్న కృష్ణ- ప్లాన్ తిప్పికొట్టిన భవానీ, ఆగ్రహంతో ఊగిపోతున్న ముకుంద


ఇక వీళ్ళ బండారం వీడియో చూద్దామని అప్పు అంటుంది. తీరా చూస్తే కెమెరాలో మెమరీ కార్డ్ వేయకపోవడంతో ఏమి రికార్డు అవదు. దీంతో అప్పు ఉగ్రరూపం దాలుస్తుంది. కళ్యాణ్ వెంట పడి రోడ్డు మీద పరిగెత్తించి పరిగెత్తించి కొడుతుంది. మంచి ఛాన్స్ మిస్ చేశావని అప్పు కళ్యాణ్ ని బురదలో పడేసి మరీ కుమ్మేస్తుంది. మళ్ళీ ఏదో ఒకటి చేద్దాంలే అని తనకి నచ్చజెపుతాడు. ఇక ఇంట్లో రాజ్ తనని ఏడిపించినందుకు కావ్య రివేంజ్ తీర్చుకుంటుంది. కావాలని రాజ్ ని తన గదికి తీసుకెళ్ళి దుమ్ము తగిలేలా దుప్పట్లు, దిండ్లు విసురుతుంది. ఆ దుమ్ము తట్టుకోలేక రాజ్ కి ఊపిరి ఆడక ఇబ్బంది పడుతూ కింద పడిపోయి ఇన్ హ్యలర్ కోసం వెతుకుతాడు. గమనించిన కావ్య దాన్ని తీసి రాజ్ కి ఇస్తుంది. ఆస్తమా ఉందా అని సైగ ద్వారా అడుగుతుంది. అవునని చెప్పేసరికి చేసిన తప్పుకి కావ్య చాలా బాధపడుతుంది.