రాజ్ కావ్య దగ్గరకి వచ్చి మాట్లాడటం దూరం నుంచి ధాన్యలక్ష్మి గమనిస్తూ ఉంటుంది. నీ తప్పేమీ లేదని నిరూపించుకోవడానికి చాలా తక్కువ సమయం ఉందని రాజ్ అంటే నిరూపించుకోలేకపోతే నేనే వెళ్లిపోతానని చెప్తుంది. నాకు బాగా గుర్తు ఉంది నిరూపించుకొకపోతే నను మీరు నిర్ధాక్షిణ్యంగా పంపిస్తారని తెలుసని అంటుంది. వాళ్ళ మాటలు విని షాక్ అవుతుంది. అపర్ణ ఇంకా నిద్రలేవకపోవడంతో శుభాష్ చూసి జ్వరం వచ్చిందని హాస్పిటల్ కి వెళ్దామని అంటాడు. అక్క ఎందుకు అక్కడ నుంచి పారిపోయింది, సడెన్ గా మమ్మల్ని చూసి పారిపోయిందా లేదంటే రాహుల్ ప్లాన్ చేసి పంపించాడా ఎలాగైనా తనతో మాట్లాడాలని అనుకుంటుంది. అప్పుడే అక్కడ కవి ఉండటం చూసి ఫోన్ అడిగి తీసుకుని స్వప్నకి ఫోన్ చేస్తుంది. కాల్ కట్ చేయడంతో అప్పుకి కాల్ చేస్తుంది.
Also Read: అనుకున్నది సాధించిన అభిమన్యు- చిత్ర జీవితం సర్వనాశనం, పెళ్లికి ఒప్పుకోక తప్పదా?
స్వప్న ఫోన్ మాట్లాడను అనేసరికి అప్పు తన స్టైల్ లో వార్నింగ్ ఇస్తుంది. నువ్వు అక్కడే ఉండి రాజ్ కి నిజం చెప్పేస్తే సరిపోయేది కదా అని కావ్య అంటుంది. అప్పుడు రాహుల్ ని నన్ను శాశ్వతంగా విడదీయొచ్చని నీ ప్లాన్ లేకపోతే మేము అక్కడ ఉన్నట్టు నీకు ఎలా తెలుసు. ఇంతవరకు నువ్వు చేసింది చాలు ఎవరిని నమ్మాలో నమ్మకూడదో నాకు తెలుసని సీరియస్ గా మాట్లాడి కాల్ కట్ చేస్తుంది. రాహుల్ నిజస్వరూపాన్ని ఎలా బయటపెట్టాలని కావ్య డైలమాలో పడుతుంది. అటు రాజ్ పని చేసుకుంటూ ఉంటే ధాన్యలక్ష్మి వస్తుంది.
ధాన్యలక్ష్మి: నువ్వు నీ భార్యని వదిలేయాలని అనుకుంటున్నావా? ఏదో గడువు పెట్టుకున్నారు ఎందుకు? గొడవ పెట్టుకున్నారు అది చిలిపి తగాదా కాదు. నేను అంతా విన్నాను. ఏంటది కోడలు ఏం తప్పు చేసింది
రాజ్: ఇంకా రుజువు కాలేదు నా నమ్మకం ఇంకా రుజువు అవుతుంది
ధాన్యలక్ష్మి: ముసుగులో ఉండి ఏమి తాళి కట్టించుకోలేదు కదా ముసుగు తీసేసింది కదా? కావ్యని వదిలేయాలని ఎందుకు అనుకుంటున్నావ్. నువ్వు మీ అమ్మ ఎన్ని మాటలన్నా పడి ఉంటుంది. ఈ విషయం ఇంతటితో వదిలేసేయ్. ఆ అమ్మాయి తరఫున మాట్లాడటానికి ఎవరూ లేరని అనుకుంటున్నావా అందరం ఉన్నాం
రాజ్: పిన్నీ ఆగు ఇది నా పర్సనల్ విషయం ఇందులో జోక్యం చేసుకోవడానికి మీరెవరు
Also Read: రంగంలోకి దిగిన కంచు కోడలు, ఇక అత్తకి దబిడీ దిబిడే- డిప్రెషన్ లో నందు
ధాన్యలక్ష్మి: ఇన్నాళ్ళూ నా కొడుకు కంటే నిన్నే ఎక్కువ చూసినందుకు నాకు బుద్ధి వచ్చింది. సోరి నీ పర్సనల్ విషయంలో జోక్యం చేసుకున్నందుకని కన్నీళ్ళు పెట్టుకుంటూ వెళ్ళిపోతుంది
అపర్ణ రాలేదని కావ్య అంటే అప్పుడే శుభాష్ వచ్చి తనకి జ్వరంగా ఉందని చెప్తాడు. ఇంట్లో పనులు సరే మరి పూజ ఎవరు చేస్తారని రుద్రాణి పుల్ల వేస్తుంది. వాళ్ళు లేకపోతే ఏమి ఈ ఇంటి కోడలు ఉంది కదా తను చేస్తుందిలే అని ఇంద్రాదేవి చెప్తుంది. కావ్య కంగారుగా వచ్చి చేయలేనని అంటుంది. నేను పూజ చేయడం మేడమ్ కి ఇష్టం ఉండదు, తనకి నచ్చని పనులు చేసి ఎందుకు ఇంకా ఇబ్బంది పెట్టడమని కావ్య చెప్తుంది. కానీ ఇంటి దీపం పెట్టకుండా వంట చేయకూడదు, అపర్ణతో మాట్లాడతానులేనని సర్ది చెప్తుంది. ఈరోజు అత్తకి, కోడలికి మధ్య చిచ్చు పెట్టి సంబరపడదామని రుద్రాణి మనసులో అనుకుంటుంది.
కావ్య అపర్ణకి పాలు తీసుకొచ్చి తాగమని చెప్తుంది. ఆరోగ్యం బాగోలేదని కనీసం ఫ్రూట్స్ అయినా తినమని బతిమలాడుతుంది. కనీసం నేను వెళ్ళిన తర్వాత అయినా తినండి నామీద కోపం ఆకలి మీద చూపించొద్దని చెప్తుంది. ధాన్యలక్ష్మి రాజ్ మాటలు గుర్తు చేసుకుని కుమిలికుమిలి ఏడుస్తుంది. కావ్య వచ్చి ఏమైందని అడుగుతుంది. రాజ్ నువ్వు మాట్లాడుకోవడం విన్నానని చెప్తుంది.