రిసెప్షన్ గ్రాండ్ గా జరుగుతుంది. వచ్చిన వాళ్ళంతా కావ్య, రాజ్ జంట చూసి మురిసిపోతారు. ఫంక్షన్ లో మమ్మీ ఎక్కడ వీళ్ళ మీద రీవెంజ్ ఎలా తీర్చుకోవాలో నాకు తెలుసు రమ్మని చెప్పమని చెప్తాడు. దీంతో రేఖ వెళ్తుంటే స్వప్న ఎదురుపడుతుంది. తనని చూసి గుర్తు పడుతుందేమో అని టెన్షన్ పడుతుంది కానీ రేఖ తిక్కగా మాట్లాడి వెళ్ళిపోతుంది. కావ్యని చూసి కనకం ఎమోషనల్ అవుతుంది. దేవుడి తనకి మంచి జీవితం ఇచ్చాడని అనుకుంటుంది. స్వప్నతో పెళ్లి తప్పిపోవడమే మంచిది అయ్యింది. ఇది దైవ సంకల్పం. ఈ అమ్మాయిలో లక్ష్మీకళ ఉట్టిపడుతుంది. స్వప్న అందంగా ఉంటుందేమో కానీ ఈ అమ్మాయిలో ఉన్న అణుకువ తనలో లేదని ఇంద్రాదేవి అంటుంది.


Also Read: గెలిచిన భార్యాభర్తల బంధం, విన్నీ షాక్- వేదకి ఇక సీతమ్మ కష్టాలే


కావ్యని చూసి స్వప్న అసూయ పడుతుంది. నేను లేచిపోవడం వల్ల నీకు అదృష్టం కలిసి వచ్చింది లేదంటే ఒక చిన్న షాపు  నడుపుకునే దానివి మహారాణిలా మారిపోయావ్ అని కుళ్ళుకుంటుంది. రాహుల్ మళ్ళీ మీడియా యాంకర్ కి సైగ చేస్తాడు. ఇదంతా నటనేనా మీరు నిజంగా ఈ పెళ్లిని పెళ్లికూతుర్ని యాక్సెప్ట్ చేశారా? అని ప్రశ్నిస్తుంది. రాజ్ ఆవేశంగా వెళ్లబోతుంటే కావ్య తనని ఆపి దుగ్గిరాల వారసులు నాతో గొడవ పడినట్టు పడొద్దని అంటుంది. దీంతో రాజ్ కోపంగా కాకుండా కూల్ గా మాట్లాడతాడు. నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను కానీ కుదరలేదు. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. కానీ పేద ఇంటి అమ్మాయి అయినా మేము ఒకేలా చూస్తాం. చూశారు కదా నా భార్య ఎలా ఖరీదైన చీరలో, నగల్లో కనిపిస్తుందో. నా భార్యని నేను గౌరవిస్తాను. నా భార్యని నేను నా ఫ్యామిలీ మీకు పరిచయం చేయడానికి గర్వపడుతున్నాం అనేసరికి కావ్య చిన్నగా క్రీమ్ బిస్కెట్ అని కామెంట్ చేస్తూ ఉంటుంది.


ఆ మాటలు విని స్వప్న షాక్ అవుతుంది. నువ్వు నా భార్య ఏంటి రెండు రోజులు గిర్రున వెనక్కి తిరిగితే ఎంత బాగుండని రాజ్ అనుకుంటాడు. ఇద్దరూ నిలబడి మెల్లగా తిట్టుకుంటూ కవర్ చేసుకుంటారు. ఫొటోగ్రాఫర్ స్టిల్స్ కావాలని అనేసరికి రాజ్ ఒక్కడే ముందుకు వస్తాడు. సోలో కాదు కపుల్ అనగానే రాజ్ రమ్మని సైగ చేస్తాడు. కానీ కావ్య చూడనట్టు నటిస్తుంది. మంచి కామెడీ ఇస్తారు కాసేపు. స్వప్న మాత్రం బిత్తరపోతుంది. కావ్య భుజం మీద చెయ్యి వేసి మరీ దగ్గరకి లాక్కుని కౌంటర్ వేస్తాడు. నేను ఒక పిచ్చిదాన్ని రాహుల్ ని నమ్ముకుని తప్పుచేశాను రాజ్ ని పెళ్లి చేసుకుని ఉంటే ఎంత బాగా చూసుకునే వాడోనని స్వప్న తిట్టుకుంటుంది. మిస్టర్ పులిపిరి మళ్ళీ మీనాక్షి కోసం తెగ ట్రై చేస్తాడు. కనకం వాళ్ళు వెళ్లిపోతుంటే ఆపి పెర్ఫామెన్స్ ఉంది రమ్మని వెనక్కి పిలుస్తాడు. రేఖ వచ్చి రుద్రాణిని రమ్మని పిలుస్తుంది.


Also Read: చూడముచ్చటైన జంట- కనకాన్ని గుర్తుపట్టిన కావ్య, రిసెప్షన్ కి వచ్చిన స్వప్న


అది అసలు పెళ్ళా, ఎగ్జిబిషన్ లో నిలబడిన పెళ్లికూతురు, పెళ్లికొడుకుని చూడటానికి రావాలా? ఈ కుటుంబం మీద కసి. నేను ఇష్టపడిన కోటీశ్వరుడిని కాదని మంచివాడని ఒకడిని ఇచ్చి అపర్ణ పెళ్లి చేసింది. అందుకే మాటకి మాట ఎదురు చెప్పే కావ్యని పెళ్లి చేశానని రుద్రాణి అంటుంది. రాహుల్ ని రంగంలోకి దింపి కంపెనీలో మెల్లమెల్లగా అధికారం చేజిక్కించుకోవాలి. అది నా గోల్ అని రుద్రాణి తన మనసులో కుట్ర బయటపెడుతుంది. కావ్య రాజ్ గురించి కామెంట్ చేస్తూనే ఉంటుంది. ఫోటోస్ దిగడం అయిపోయిన తర్వాత రాజ్, కావ్య కిందకి దిగిపోతారు. జోకర్ వేషం వేసుకున్న కనకాన్ని పెర్ఫామెన్స్ ఇవ్వడానికి తీసుకొస్తారు. అప్పుడే తన చుట్టూ పిల్లలు మూగి జోకర్ జోకర్ అని అరుస్తూ ఉంటే కనకం టోపీ కిందపడిపోతుంది. వాళ్ళని కావ్య చూస్తుంది. అది గమనించిన కళ్యాణ్ కావ్య దగ్గరకి వెళతాడు. ఆ జోకర్ ఎవరో కాదు మీ అమ్మ. రిసెప్షన్ లో మిమ్మల్ని చూడాలని ఆశపడుతుంటే నేనే ఇలా రప్పించానని చెప్తాడు. కన్నకూతురిని మహారాణిలా చూడాలని ఆ తల్లి జోకర్ లాగా మారిందని అంటాడు.